
నేడు అమ్మవారికి స్వర్ణ కవచాలంకారం
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి ఆగస్టు 22 వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి స్వర్ణ కవచాలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నెల రోజుల పాటు భక్తుల కోసం హోమం, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.