
పేద కుటుంబాల అభివృద్ధే లక్ష్యం
నరసరావుపేట రూరల్: పేద కుటుంబాల అభివృద్ధే పీ–4 లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. మండలంలోని దొండపాడు గ్రామంలో గురువారం పీ–4 సర్వే బంగారు కుటుంబాల పరిశీలన కోసం గ్రామ సభ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే సచివాలయ సిబ్బంది పీ–4 సర్వే పూర్తిచేసి 139 బంగారు కుటుంబాలను గుర్తించారని తెలిపారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పుల కోసం గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 వేల మందిని గుర్తించినట్టు వివరించారు. 2047 నాటికి ఒక్క కుటుంబం కూడా పేదరికంతో బాధపడకుండా చూడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులు, విదేశాలలో ఉండే వారిని సమన్వయపరిచి మార్గదర్శకులుగా ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమాజంలోని పేదవారిని గుర్తించి వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయంతో పాటు మార్గదర్శకుల నుంచి ఏదో ఒక సాయం అందించడం కార్యక్రమ ఉద్దేశ్యమని తెలిపారు. పేదరికం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా మార్గదర్శకులు పనిచేయాలని సూచించారు. ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీఓ టీవీ కృష్ణకుమారి పాల్గొన్నారు.
సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..
నరసరావుపేట: ఏపీ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ పి.అరుణ్‌బాబు కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. స్వర్ణ ఆంధ్ర, పీ–ఫోర్ ఫౌండేషన్, సానుకూల ప్రజా దృక్పథం, పట్టణాల్లో గ్యాస్ పంపిణీకి సంబంధించిన సమస్యలు, తదితర అంశాలపై జిల్లాలో నెలకొన్న పరిస్థితులను సీఎస్‌కు కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు