
శ్రావణం.. శుభప్రదం
సత్తెనపల్లి/యడ్లపాడు/గురజాల: సకల శుభాల శ్రావణమాసం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆయా ఆలయాల్లో కమిటీలు ముమ్మర ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది. అందుచేత మహిళలు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు. నేడు శ్రావణ మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు మహిళలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
26 నుంచి మంచి ముహూర్తాలు...
నెలరోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈనెల 24 (గురువారం) తో ముగిసింది. శ్రావణమాసంలో ఈ నెల 26 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. శ్రావణ మాసం మొదలైన మరుసటి రోజు నుంచి సుముహుర్తాలు మొదలు కానున్నాయి. ముఖ్యంగా ఈనెల 26, 30, 31, ఆగస్టు నెలలో1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెప్టెంబర్ 23, 24, 26, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో సుముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో ఉన్న 15 మంచి ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. బాధ్రపద మాసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు ముహుర్తాలు లేవు.
నేటి నుంచి ప్రారంభం కానున్న
నోముల మాసం