ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం

Jul 30 2025 9:15 AM | Updated on Jul 30 2025 9:15 AM

ప్రభు

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో అవసరమైన డేటా ను రూ పొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) కార్యాచరణ ప్రణాళిక 2025–26 రూపకల్పనలో భాగంగా ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌, ప్రగతి పోర్టల్‌పై మండల స్థాయిలోని సాంకేతిక సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ టీఎంపీ, ప్రగతి పోర్టల్‌, ప్రగతి యాప్‌ వినియోగించే పద్ధతి, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణకు సంబంధించిన అంశాలను పోర్టల్‌లో నమో దు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడంలో సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోస్ట్‌, ప్రీ అసెస్‌మెంట్‌, ఆధార్‌ ఆథెంటిఫికేషన్‌, ఈ–సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ వంటి అంశాలను పూర్తి చేసేందుకు ప్రతి ఉద్యోగికి శిక్షణ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్‌ పర్సన్లు రవీంద్రబాబు, కె.నాగేశ్వరరావు, కరీముద్దీన్‌, అనురాధ, ఏవో ప్రతాప్‌ పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో మద్యం అమ్మకం దారులు

తాడికొండ: ‘మద్యం మత్తులో యువకుల ఘర్ష ణ’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. తాడికొండలోని మద్యం దుకాణంలో రాత్రి వేళ అమ్మకా లు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 80కి పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం 1
1/1

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement