కోడెల విగ్రహ శిలాఫలకానికి మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

కోడెల విగ్రహ శిలాఫలకానికి మరమ్మతులు

Jul 30 2025 9:15 AM | Updated on Jul 30 2025 9:15 AM

కోడెల విగ్రహ శిలాఫలకానికి మరమ్మతులు

కోడెల విగ్రహ శిలాఫలకానికి మరమ్మతులు

సత్తెనపల్లి: పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిలోని సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో డివైడర్‌ పై ఏర్పాటు చేసిన ఏపీ మాజీ స్పీకర్‌, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పేరు ఉన్న శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోడెల అభిమానులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి మంగళవారం ఆ శిలాఫలకానికి మరమ్మతులు చేపట్టారు.

పర్యావరణ పరిరక్షణకు

ప్రత్యేక కృషి

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో పర్యావరణ పరిరక్షణ పెంపొందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి నాణ్యతను మరింతగా పెంపొందించేందుకు జాతీయ క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ మిని సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్‌ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ను జిల్లా స్థాయి అమలు కమిటీలు నిర్వహించాలన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు నగరానికి 2011–15 మధ్య గాలి నాణ్యతా డేటా ఆధారంగా నాన్‌ అసైన్‌మెంట్‌ నగరాల్లో ఒకటిగా గుర్తించిందన్నారు. జాతీయ కాలుష్యాన్ని గుర్తించేందుకు జాతీయ క్లీన్‌ఎయిర్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించారని పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో గాలిలో కాలుష్యాన్ని 70 నుంచి 80 శాతం తగ్గించే లక్ష్యంతో పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. దీనిలో భాగంగా 2019–20, 2024–25 వరకు గుంటూరు నగరానికి మొత్తం ఎన్‌సీ ఏపీ కింద రూ. 20.51 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి క్లీన్‌ సిటీ రూ.2.73 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన పనులను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సకాలంలో పూర్తి చేయాలన్నారు. గాలి నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి కూ ల్చడం, నూతన బ్రిడ్జి నిర్మాణ క్రమంలో జీజీహెచ్‌, ట్రావెల్స్‌ బంగ్లాలో వద్ద ఉన్న నేషనల్‌ ఎయిర్‌ మానిటరింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఏర్పాటు చేసిన స్టేషన్‌లను ప్రత్యామ్నాయ ప్రాంతాలకు మార్చాలన్నారు. సమావేశంలో ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎన్వీరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ ఎం.డి.నజీనా బేగం, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, డీఎస్‌ ఆర్‌.చంద్రమౌళి పాల్గొన్నారు.

రైల్వే సిగ్నల్‌ కంట్రోల్‌

కార్యాలయం ప్రారంభం

దుగ్గిరాల: దుగ్గిరాలలో నిర్మించిన నూతన కార్యాలయంలో మంగళవారం రైల్వే సిగ్నల్‌ కంట్రోల్‌ వ్యవస్థను రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం ప్రారంభించారు. మూడు సంవత్సరాల నుంచి ఆధుని కీకరణ పనులతో పాటు మూడవ లైను నిర్మాణం జరుగుతుంది. పనులు పూర్తి కావడంతో అత్యంత ఆధునిక సాంకేతిక విధానం కలిగిన కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement