
వెయిట్ లిఫ్టింగ్‌లో అంగలకుదురు విద్యార్థుల సత్తా
తెనాలిరూరల్: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని అంగలకుదురు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 60 కిలోల విభాగంలో బి.దివ్య, 70 కిలోల విభాగంలో జి.అఖిల, 105 కిలోల విభాగంలో ఎం.బాలాజీ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. అలానే 83 కిలోల విభాగంలో టి.హేమచంద్, 90 కిలోల విభాగంలో వై. శ్రీశశాంక్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వ్యాయామోపాధ్యాయులు వేమూరి శరత్‌బాబు, పులివర్తి రాజులను పాఠశాల హెచ్‌ఎం ఎన్.అనురాధ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మంగళవారం అభినందించారు.