
సౌకర్యాలు పెంచాలి
సర్కారు వసతి గృహాల్లో
సత్తెనపల్లి: జిల్లాలోని ప్రభుత్వ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు నరకకూపాలుగా మారాయని, తక్షణమే అక్కడి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రైల్వేగేట్ సమీపంలో గల సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. కనీసం దోమల మెష్‌లు లేవన్నారు. ముఖ్యంగా బియ్యం, కందిపప్పులో ముక్క పురుగులు ఉన్నాయని చెప్పారు. సాంబార్లో మచ్చుకై నా పప్పు కనిపించడం లేదన్నారు. విద్యార్థులకు చిక్కీ ఇవ్వడం లేదని, అసలు మెనూ ప్రకారం ఆహారం అందిచడం లేదని తెలిపారు. ప్రతి నెలా కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, అధికారులు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆహార పదార్థాలు నాణ్యతగా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వైస్ ప్రెసిడెంట్ వేణు, నరసరావుపేట యువజన విభాగం ప్రెసిడెంట్ కోటపాటి మణీంద్రారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు మోహిద్దీన్, రాజేష్, తరుణ్, హరి, మధు తదితరులు ఉన్నారు.
మెనూ సక్రమంగా అమలు చేయాలి కందిపప్పు, బియ్యంలో అన్నీ ముక్క పురుగులు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్

సౌకర్యాలు పెంచాలి