పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు | - | Sakshi
Sakshi News home page

పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

Aug 1 2025 11:48 AM | Updated on Aug 1 2025 11:48 AM

 పీ 4

పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

స్వచ్ఛందంగా

ముందుకు వచ్చినవారినే ఎంపిక చేయండి

నరసరావుపేట: పీ ఫోర్‌ పథకంలో భాగంగా బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారిని మాత్రమే మార్గదర్శకులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం స్వర్ణాంధ్ర, పీఫోర్‌ ఫౌండేషన్‌, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలపై చీఫ్‌ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్వో మురళితో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ మార్గదర్శకులుగా చేరాలని ఎవరినీ ఎటువంటి ఒత్తిడికి గురిచేయొద్దన్నారు.

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సీపీఓ ..

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సీపీఓ జి.శ్రీనివాస్‌ను కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు సత్కరించారు. శేషజీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జేసీ సూరజ్‌ గనోరే, డీఆర్‌ఓ మురళి పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం చేసిన డీఆర్‌ఎం సుధేష్ట సేన్‌

లక్ష్మీపురం: ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే అని గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ సుధేష్ట సేన్‌ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో గల రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సెంటర్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌ కార్యాలయ సిబ్బందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా డీఆర్‌ఎం శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా చిన్నతనం నుంచి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని చెప్పారు. యువతీ, యువకులంతా క్లిష్టమైన వైద్య, అత్యవరసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న గొప్ప లక్ష్యంలో చేరాలని కోరారు. గుంటూరు రైల్వే డివిజన్‌ అభివృద్ధితో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యాక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం డివిజన్‌ పరిధిలో 74 మంది సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్‌, సీనియర్‌ డివిజనల్‌ పర్సన్‌ ఆఫీసర్‌ షహబాజ్‌ హనూర్‌, సీనియర్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ అమూల్యా బి. రాజ్‌, సీనియర్‌ డివిజనల్‌ మెటీరియల్స్‌ మేనేజర్‌ కార్తికేయ గాడఖ్‌, డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కమలాకర్‌బాబు, సీనియర్‌ డివిజనల్‌ సేఫ్టీ ఆఫీసర్‌ విజయ కార్తి, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ శైలేష్‌కుమార్‌, రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ వైద్య అధికారి డాక్టర్‌ మేడూరి భాస్కరరావు, జిల్లా సమన్వయకర్త రసూల్‌ పాల్గొన్నారు.

ముగిసిన జిల్లాస్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ పోటీలు

తాడేపల్లి రూరల్‌ : జిల్లాస్థాయి రోడ్‌ స్కిప్పింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు గురువారంతో ముగిశాయి. పోటీలను తాడేపల్లి రూరల్‌ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూలులో నిర్వహించారు. జిల్లా రోప్‌ స్కిప్పింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ రమాదేవి, ప్రిన్సిపాల్‌ దీనకుమారి, వైస్‌ ప్రిన్సిపాల్‌ మౌనిక, గుంటూరు జిల్లా రోప్‌ స్కిప్పింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నిర్వహణ కార్యదర్శి ఇమ్మానియేలు రాజు పాల్గొన్నారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

తెనాలి రూరల్‌: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సుమారు 32 నుండి 35 ఏళ్ల వ్యక్తి స్టేషన్‌ ఉత్తర కేబిన్‌ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు 1
1/2

పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

 పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు 2
2/2

పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement