
వైఎస్సార్ సీపీ తరఫున లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తాం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో హాస్టళ్లను చాలా చక్కగా నిర్వహించారని, నాడు–నేడు కింద హాస్టళ్లను బాగుచేసే ప్రయత్నంలో ప్రభుత్వం మారిందన్నారు. కూటమి హయాంలో నేడు తినేందుకు ఇచ్చిన బియ్యంలో ముక్కపురుగులు తిరుగుతున్నాయన్నారు. హాస్టల్‌లోని ఎస్సీ విద్యార్థులు చదువుకునే పరిస్థితి కన్పించట్లేదన్నారు. హాస్టల్ బిల్టింగ్ యజమానే హాస్టల్‌కు రంగులు వేయించాడని చెప్పారు. ఒక రూమ్‌లో పదిహేను రోజుల నుంచి లైటు లేకుండా విద్యార్థులు ఉంటున్నారంటే హాస్టల్ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో రూ.1.75లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, ఆ డబ్బులతో కనీసంగా హాస్టళ్లను కూడా బాగుచేయకుండా వాటిని దిగమింగుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున ప్రైవేటు ఎలక్ట్రిషీయన్‌చే లైట్లు వేయిస్తున్నామని, ఎస్సీ సోదరుల సహకారంతో మరో 24గంటల్లో ఫ్యాన్లు వేయిస్తామని భరోసా ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారని, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వెంటనే హాస్టళ్లను విజిట్ చేయాలని డిమాండ్ చేశారు.