నరసరావుపేట: కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్‌ఎస్)లో 148 అర్జీలు స్వీకరించారు. అధికారులు అందరూ అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటిజాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ ఏకా మురళి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
బల్లకట్టు ప్రయాణికులకు రక్షణ కల్పించండి
సరైన భద్రతా చర్యలు లేని చింతిర్యాల గోవిందపురం వద్దనున్న బల్లకట్టుపై ప్రయాణం చేస్తున్న వారందరికీ రక్షణ కల్పించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే బల్లకట్టుపై ప్రయాణికులను రక్షించేందుకు గజ ఈతగాళ్లు లేరు. బెలూన్లు లేవు.
– ప్రజాసంఘాల నాయకులు
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారు..
వినుకొండ రూరల్ పరిధిలోని 2.45 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎన్‌ఎస్పీ కాలువతో సహా రిజిష్టర్ చేయించుకున్న శాంతమ్మ, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దీనిపై ఈ ఏడాది మే 28న ఒకసారి తహసీల్దార్‌కు, జూన్ 30న గ్రీవెన్‌సెల్‌లో మరోసారి ఫిర్యాదు చేశాం. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆక్రమణ దారుల్లో ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు ఉన్నారు. వారిపై విచారణ చేయించి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి.
–వై.వెంకటేశ్వరరావు, మస్తాన్‌వలి, పీడీఎం