
నిర్లక్ష్య విపత్తు
వెంటనే సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలి
వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే వరి నారు సాగు ఆలస్యమైంది. మరోవైపు ప్రభుత్వం ఇంకా సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయ లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా సర్వేలు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు గుర్తించి సకాలంలో పంపిణీ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సిన దుస్థితి ఏర్పడింది.
– అన్నెం పున్నారెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు
సాక్షి, నరసరావుపేట: ఖరీఫ్ సాగు ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తోంది.. ఓ వైపు వర్షాలు మొదలయ్యాయి.. మరోవైపు వారం పది రోజుల్లో సాగర్ కుడికాలువ నుంచి నీరు వదులుతామని అధికారులు చెబుతున్నారు. వరి నారు పోయడానికి ఇప్పటికే ఆలస్యమవడంతో రైతులు సిద్ధమవుతున్న వేళ కూటమి ప్రభుత్వ ఆలసత్వం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఏటా జూన్, జూలై నెలల్లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సబ్సిడీపై వరి విత్తనాలను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది జూలై చివరి వారం వచ్చినా ఇంకా సబ్సిడీ విత్తనాల పంపిణీ చేయలేదు. నకరికల్లు మండంలో గుండ్లపల్లి లాంటి ఒకటి రెండు చోట్ల మాత్రమే అరకొరగా సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద కనీసం జిల్లాలో ఇప్పటి వరకు ఏ పంట ఎంత మేరకు సాగు చేశారన్న సమాచారం కూడా లేకపోవడం శోచనీయం. జిల్లాలో ఈ ఏడాది సుమారు 40 వేల హెక్టార్లలో వరిసాగు చేసే అవకాశాలున్నాయి. అన్ని రకాల వరి విత్తనాలు కలిపి జిల్లాకు సుమారు 24 వేల క్వింటాళ్లు అవసరం కానుంది.
గతేడాది చేదు అనుభవాలున్నా...
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఎన్నికల ముందు అలవి కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాలో పూర్తిగా విఫలమయ్యారు. గత ఏడాది ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవడం, నాగార్జున సాగర్ జలాశయం నిండటంతో రైతులు వరిసాగుపై దృష్టిసారించారు. వరి విత్తనాల సరఫరాపై ప్రభుత్వం ముందస్తుగా సిద్ధం కాకపోవడంతో విత్తన కొరత ఏర్పడింది. ప్రధానంగా జేజీఎల్–384 రకం విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ అధికంగా వచ్చింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేయాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు.
వరి నారుమళ్లకు సిద్ధమైనా అందుబాటులోకి రాని వరి విత్తనాలు అరకొరగా వచ్చిన విత్తనాలను పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్న వ్యవసాయ శాఖ ఇప్పటికే అదును ఆలస్యమవుతుండటంతో ఆందోళనలో రైతులు బ్లాక్ మార్కెట్‌లో దోచుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న రైతన్నలు గత ఖరీఫ్‌లో ఎన్నడూ లేని విధంగా వరి విత్తనాల కొరత జేజీఎల్–384రకం కోసం జోరువానలో రైతుల పడిగాపులు గతేడాది చేదు అనుభవాలు ఉన్నా జాగ్రత్త పడని వ్యవసాయ శాఖ అధికారులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌బీకేల ద్వారా గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలు
అదును ముంచుకొస్తున్నా.. వరి విత్తనాల పంపిణీ లేదన్నా..?
బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలు
ఆర్బీకేల
నిర్వీర్యంతో..
కూటమి ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు అవసరమైన విత్తనాలు లేకపోవడంతో ప్రైవేట్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటన్న ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో బోర్ల కింద వరి సాగు చేసే వారు నారుమళ్లు పోశారు. వారికి ఆర్‌బీకేలలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరిగా ప్రైవేట్ దుకాణాలలో, బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సి వస్తోంది.
వరి విత్తనాల కొరతపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.జగ్గారావును వివరణ కోరగా ఇండెంట్ పంపామని, ఇంకా విత్తనాలు జిల్లాకు చేరలేదని రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరో సా కేంద్రాలు బాగా పనిచేయడంతో రైతులకు అవసరమైన విత్తనాల రకాలను ముందుగానే గుర్తించి ఆ దిశగా సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయడంతో సమస్య జఠిలమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు విత్తనాల కోసం వారం రోజులుగా తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వచ్చింది. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. తీవ్ర వర్షంలో రైతులను క్యూలో నిల్చోబెట్టి విత్తనాలు పంపిణీ చేయాల్సి వచ్చింది. గతేడాది చేదు అనుభవాలున్నా వ్యవసాయ శాఖ మాత్రం మొద్దునిద్ర వీడలేదు. ఓ వైపు ఆగస్టు నెల వసున్నా.. వర్షాలు విపరీతంగా కురుస్తున్నా.. మరో వారంలో రోజుల్లో సాగర్ నిండే అవకాశాలున్నా ఇంకా జిల్లాకు పూర్తిస్థాయిలో వరి విత్తనాలు అందుబాటులోకి రాని దుస్థితి.

నిర్లక్ష్య విపత్తు

నిర్లక్ష్య విపత్తు

నిర్లక్ష్య విపత్తు