
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 249 అర్జీలను జేసీ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ ఏకా మురళితో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటిజాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు పీజీఆర్‌ఎస్‌లో 249 అర్జీలు స్వీకరణ