
చికిత్స పొందుతూ బాధితుడు మృతి
నూజెండ్ల: మండలంలోని ఐనవోలు గ్రామంలో ఇటీవల జరిగిన పెట్రోల్ దాడిలో చికిత్స పొందుతూ పెద్ద శ్రీను సోమవారం మృతి చెందినట్లు కుటుంట సభ్యులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున ఆరుబయట నిద్రిస్తున్న దంపతులు నీలబోయిన పెద్ద శ్రీను, మంగమ్మ దంపతులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో మంగమ్మ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన పెద్ద శ్రీనును గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆరు రోజులుగా చికిత్స పొందుతూ బాధితుడు శ్రీను సోమవారం మరణించాడు. ప్పటికే ఐనవోలు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.