
ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది
ప్రభుత్వ సహకారం పొందే సంస్థలు, శాఖలకు
నరసరావుపేట: ప్రభుత్వ సహకారం, సహాయం పొందుతున్న అన్ని సంస్థలు, శాఖా కార్యాలయాలకు సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు పేర్కొన్నారు. గురువారం ప్రకాష్‌నగర్‌లోని జిల్లా సహకార బ్యాంక్ సమావేశం హాలులో సమాచార హక్కు–2005పై అవగాహన సదస్సును ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక సహకార సంఘాల సీఈఓలకి సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి స్వర్ణ చినరామిరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 1964 ఏపీ సీఎస్ చట్టం కింద రిజిస్టరైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయని అన్నారు.
● డివిజనల్ సహకార అధికారి కె.తిరుపతయ్య మాట్లాడుతూ పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి, సమాచార కమిషనర్ అధికార పరిధి, విధి విధానాలను, సమాచార విషయాల గురించి వివరించారు. సమాచార హక్కు ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని అధికారులు, పౌరులు పరస్పరం బాధ్యతాయుతంగా పారదర్శకంగా వ్యవహరిస్తూ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజాఅవసరాలకు ఉపయోగించుకోవాలని అన్నారు.
● విజయవాడ కో–ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ కో–ఆర్డినేటర్ రంగరాజు, ఎస్‌డీఎల్ సీఓ రామిరెడ్డి, డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీస్ సూపరింటెండెంట్ జీపీడీ టాండన్‌లు మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకు నరసరావుపేట బ్రాంచ్, సహకార శాఖ పల్నాడు జిల్లా కార్యాలయం, డివిజనల్ కో–ఆపరేటివ్ కార్యాలయ, సబ్ డివిజనల్ కార్యాలయ సిబ్బంది, నరసరావుపేట తాలూకాలోని 18 పీఏసీఎస్‌ల సీఈఓలు పాల్గొన్నారు.
జిల్లా సహకార అధికారి నాగరాజు