
నేను పీజీఆర్‌ఎస్‌కు రావడం మూడవ సారి
నా భర్త అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం 2021లో మాకు ఉన్న 75 సెంట్ల స్థలాన్ని డి.వాసు అనే వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి రూ.5.25 లక్షలు తీసుకున్నాం. కమీషన్, రిజిస్ట్రేషన్ ఖర్చులు అని చెప్పి రూ.4.25లక్షలు ఇచ్చారు. అప్పుగా తీసుకున్న నగదుకు వడ్డీగా 2023లో రూ.4లక్షలు చెల్లించాం. సదరు స్థలాన్ని మాకు తెలియకుండా వాసు వేరే వాళ్లకి విక్రయించాడు. న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇస్తున్నా క్రోసూరు పోలీసులు పట్టించుకోవడం లేదు.
– మక్కెన పార్వతి, క్రోసూరు