
మహానాడులో యువకుడు ఆత్మహత్య
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తన మరణానికి సైదులు అనే టీడీపీ నాయకుడు కారణమంటూ ఓ యువకుడు గోడపై రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి రాగా, కొడుకు మరణించాడన్న బాధలో ఉన్న వారిని అవమానించడంతో వారు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి మొహమ్మద్ మునీనురీసా మాట్లాడుతూ.. తన కుమారుడైన ఎం.డి. బాజీ (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 23వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఎందుకు చనిపోయాడో తమకు తెలియక 24వ తేదీ మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పారు. ఖననం అనంతరం ఇంటిని శుభ్రం చేస్తుండగా గోడమీద ‘తన మరణానికి ఎస్‌డీ సైదులు, రాకేష్ కారణం అని, చంపుతామని బెదిరించారని, వారు టీడీపీ నేతలని, తాను ఏం చేయగలవంటూ బెదిరించినట్లు’ కుమారుడు రాశాడని తెలిపారు. ఈ విషయాన్ని 25వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా ఖననం చేసి తమ దగ్గరకు వస్తే ఏం చేయలేమని పోలీసులు పేర్కొన్నట్లు చెప్పారు. తమ కుమారుడి చావుకు కారణం వాళ్లు ఎందుకు అవుతారని ప్రశ్నించారని తెలిపారు. గోడపై కుమారుడు రాసిన విషయాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి చూపించగా తాము కేసు కట్టబోమని, బయటకు వెళ్లాలని, ఎవరి దగ్గరకు వెళ్లినా న్యాయం జరగదని, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కృష్ణానది ఒడ్డున తమ కుమారుడికి అన్నయ్య వరుస అయ్యే వారిని సైదులు కొట్టాడని, అప్పుడే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, కేసు వాపస్ తీసుకుంటారా లేదా అంటూ అనేకసార్లు బెదిరించారని ఆమె తెలిపారు. 23వ తేదీన కూడా సైదులు, రాకేష్‌లు కత్తి తీసుకుని చంపేస్తామని, తమది టీడీపీ అని చెప్పినట్లు ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని ఆమెతోపాటు బాజీ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
గుట్టుచప్పుడు కాకుండా ఖననం టీడీపీ నాయకుడి వల్లే తన కుమారుడు చనిపోయాడంటున్న తల్లి ఫిర్యాదు తీసుకోని పోలీసులు

మహానాడులో యువకుడు ఆత్మహత్య