
108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర
సత్తెనపల్లి: త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించిన సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సతెనపల్లి)ఆధ్వర్యంలో నందిగామలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో 108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర ర్యాలీ మంగళవారం నిర్వహించారు. సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడుతూ.. జాతీయ జెండా భారత దేశం యొక్క సార్వభౌమత్వం, ఐక్యతకు చిహ్నమన్నారు. సత్తెనపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆళ్ల సాంబయ్య మాట్లాడుతూ త్రివర్ణ పతాకం భారతీయులకు అందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. తొలుత పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, పాఠశాల పీడీ సాంబశివరావు, చెంబేటి బోల్లయ్య, హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు అక్షయ్, నిర్మల్ కుమార్, జాతీయ జెండా వేషధారి శేఖర్, ఉపాధ్యాయ బృందం, అంగన్‌వాడీ కార్యకర్తలు సుజాత, వాణి, జ్యోతి, అమల, గౌసియా, విద్యార్థులు పాల్గొన్నారు.