
హామీలు నెరవేర్చాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు
పిడుగురాళ్ల: మోసపూరిత హామీలను ఇంటింట ప్రచారం చేసి ఇప్పుడు హామీలు నెరవేర్చాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు అనటం ప్రజలను మోసం చేయటమేనని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున సంవత్సరానికి రూ. 18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, అయితే నేడు ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి ఉందని బహిరంగంగా తెలపటం, రాష్ట్రంలోని మహిళలను మోసం చేయడమేనన్నారు. ఈ పథకం అమలు చేస్తామని పవన్ కల్యాణ్ కూడా సంతకాలు పెట్టి హామీలకు ఊతమిచ్చారని, కానీ చివరకు హామీలు గాలికి వదిలేశారన్నారు.
మోసపూరిత హామీలకు ప్రజలు బుద్ధి చెబుతారు గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి