
రూ.2కోట్లతో చిట్టీ నిర్వాహకులు పరారీ
నరసరావుపేట రూరల్: చిట్‌ల పేరుతో వసూళ్లు చేసిన సుమారు రూ.2కోట్ల సొమ్ముతో నిర్వాహకులు పరారైనట్టు నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన పలువురు బాధితులు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలకు సంబంధించిన 98 ఫిర్యాదులు అందాయి.
చిట్టీ పేరిట 100 మందికి టోపీ
లింగంగుంట్ల గ్రామంలో పానుగంటి ప్రసాద్, రంగమ్మలు గత 30 సంవత్సరాలుగా చిట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సకాలంలో డబ్బులు చెల్లిస్తుండటంతో నమ్మిన గ్రామస్తులు అధిక సంఖ్యలో సభ్యులుగా చేరారు. 20 రోజుల నుంచి ప్రసాద్, రంగమ్మలు కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన చిట్ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుమారు 100 మందికి రూ.2కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన లింగంగుంట్ల గ్రామస్తులు