
కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోవడం వల్ల వేలాది కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నరసింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు రెండో రోజు శుక్రవారం పాత గుంటూరులోని శ్రీ కృష్ణ కల్యాణ మండపంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనసూయ, రమణరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోపు సంక్షేమ బోర్డు పని చేయడం ప్రారంభించాలని, లేనిపక్షంలో సెప్టెంబర్ 15న లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సామూహిక ధర్నా చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు మాట్లాడారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం
నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా రమణరావు, ఆర్.వి. నరసింహారావు, కోశాధికారిగా గోపాలరావు, ఉపాధ్యక్షులుగా అనసూయ, రాజ్‌గోపాల్, సహాయ కార్యదర్శులుగా సుందరబాబు, అప్పారావు, 17 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని, 63 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నరసింగరావు