
పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన నారా లోకేష్ టీడీపీ కూటమి సర్కారు గతంలో అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు ప్రశ్నించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు బాలాజీనగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లు వద్దంటూ ఆదివారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బాబురావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చి స్మార్ట్ మీటర్లు వేగంగా ఏర్పాటు చేస్తూ ప్రజలపై భారాలు మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన జరిగే పోరాటంలోనూ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు లక్కా అరుణ, బి.ముత్యాలరావు, ఎం.ఎ. చిష్టీ, పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసీహెచ్ బాబూరావు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పాతగుంటూరులో ప్రచారం