
కార్యకర్తలకు వెన్నుదన్నుగా...
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
రేపాల శ్రీనివాసరావు
పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండేది మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అని ఆ పార్టీ సెక్రటరీ, రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షులు రేపాల శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ... ఆయన కార్యకర్తలను పట్టించుకోవటం లేదని చెప్పటం సరికాదన్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు, ఏ నాయకుడికి సమస్య వచ్చినా కాసు మహేష్‌రెడ్డి నిలబడి సమస్యలను పరిష్కరించేందుకు ముందు ఉన్నారన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను అధికార పార్టీ నేతలు ఇబ్బందికి గురి చేసినప్పుడు, పోలీసులు తప్పుడు కేసులు పెట్టినప్పుడు కాసు మహేష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి అండగా నిలిచారన్నారు.