
జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లాలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం గురువారం వినుకొండరోడ్డులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్ నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటుతో జిల్లాలో జూడోను క్రీడా శాఖతో అనుసంధానమై అభివృద్ధి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరుజిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి, జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుబ్బారావు, సీఈఓ నామిశెట్టి వెంకట్, ఉపాధ్యక్షుడు చింతా శ్రీను, జాయింట్ సెక్రటరీ గమిడి శ్రీనివాసరావు, రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, వాగ్దేవి విద్యాసంస్థల కార్యదర్శి రాయల శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం..
పల్నాడుజిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పసుపులేటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల నరసింహారావు, కోశాధికారిగా కె.రాజగోపాల్, ఉపాధ్యక్షులుగా కొప్పుల పార్వతి, జాయింట్ సెక్రటరీగా బి.బాలమురళీకృష్ణ ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా బి.మల్లిఖార్జున, పి.రామకృష్ణ, ఆర్.గోపీనాయక్, రాజు, ఎన్.శివ, ఈ.రామాంజనేయులు ఎన్నికయ్యారు. వీరిని పలువురు అభినందించారు.