సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
మూడు గ్రానైట్ లారీలు స్వాధీనం
స్మార్ట్ మీటర్ల బిగింపు తక్షణమే ఉపసంహరించుకోవాలి
లక్ష్మీనరసింహస్వామికి పూజలు
వినుకొండ:కొండమెట్ల వద్ద ఉన్న లక్ష్మీనరసింహస్వామికి 16 రోజుల పండుగ సందర్భంగా ఆదివారం వసంతోత్సవం నిర్వహించారు. భక్తులు పూజలు, అభిషేకాలు, పొంగళ్లు చేశారు.
చౌడేశ్వరీ అమ్మవారికి బోనాలు
రెంటచింతల: ఆషాఢమాస చివరి ఆదివారం చౌడేశ్వరి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు మారుతీశర్మ నేతృత్వంలో అమ్మవారికి పూజలు చేశారు.
అమ్మవారికి బోనాలు
గురజాల: కనకదుర్గ అమ్మవారికి మహిళలు ఆదివారం బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని పూజలు చేశారు.
ఇనిమెట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపేట చెరువులో పూడికతీత పనుల్లో ఉపాధి కూలీలు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా అసలే కరువు ప్రాంతం. వ్యవసాయ పనులు ముగియగానే ఇక్కడి కూలీలు, సన్న, చిన్నకారు రైతులు పొరుగూళ్లకు వలస బాటపడతారు. ఇక ఊళ్లను అంటిపెట్టుకొని ఉంటున్న పేదలకు మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులే శరణ్యం. పూట గడవాలంటే ఉపాధి పనులే దిక్కు. అయితే ఉపాధి కూలీల ఆశలపై కూటమి ప్రభుత్వం మట్టి చల్లింది. వేతనాలు మంజూరు చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ఉపాధి పనుల పైనా కూడా కూలీలు ఆశలు వదులుకునే పరిస్థితి తెచ్చారు. ఒకప్పుడు పనుల్లో వేలల్లో పాల్గొనే కూలీలు నేడు పదుల సంఖ్యకు చేరారు. దీనికి కారణం వేతనాలు సమయానికి ఇవ్వకపోవడమే.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
జిల్లాలో 28 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలు. మొత్తం 3.52 లక్షల జాబ్ కార్డులు. 6.09 లక్షల మంది సభ్యులు. యాక్టివ్ జాబ్ కార్డులు 2.75 లక్షలు. ప్రస్తుతం ఉపాధి హామీ పనులకు 4.72 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్క. జిల్లాలో 1.92 లక్షలు కుటుంబాలు పనులు పొందగా 3.23 లక్షల కూలీలు పనులు వినియోగించు కున్నారు. అయితే సమయానికి వేతనాలు రావడం లేదు. గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు రెండు నెలలు దాటినా వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో రూ.109.31 కోట్ల వేతనాలు...
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంట కాలువల పూడికతీత, చెరువుల పూడిక తీత, మిని గోకులాల నిర్మాణం, సేద్యపు నీటి కుంటలు, కంపోస్టు పిట్టులు, ఉద్యాన శాఖకు సంబంధించిన పనులు .. ఇలా మొత్తం 41 రకాల పనులు చేపట్టారు. వీటికి రూ. 155.87 కోట్లు రావాల్సి ఉండగా రూ. 46.56 కోట్లు విడుదల చేశారు. ఉపాధి కూలీలకు మే 10 నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. 70 రోజులుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో జిల్లాలో కూలీలకు రూ. 109.31 కోట్ల వేతన బకాయిలు పేరుకుపోయాయి. మే, జూన్ నెలలతో పాటు జూలైలో 10 రోజులకు సంబంధించిన వేతన బకాయిలు మొత్తం 109.31 కోట్లు ఉన్నాయి.
7
న్యూస్‌రీల్
వారం పది రోజుల్లో ఉపాధి వేతనాలు
రెక్కలు విరిగేలా చెమటోడ్చినా కష్టార్జితం చేతికందని దౌర్భాగ్యం. అసలే వ్యవసాయం పనుల్లేక రైతులు, రైతు కూలీలు వలస బాట పడుతున్నారు. ఏదో ఊరిలో కాసుకొని ఉన్న రైతు కూలీలకు ఉపాధి పనులు కాస్త ఊరటగా నిలిచాయి. అయితే వేతన కష్టాలు తప్పడం లేదు. నెలలుగా వేతనాలు ఆపారు. ఉపాధి కూలీలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉపాధి కూలీలకు రెండు నెలలుగా
అందని వేతనాలు
జిల్లాలో పెండింగ్ వేతనాలు
రూ.109.31 కోట్లు
చొరవ చూపకుండా వేడుక
చూస్తున్న కూటమి ప్రభుత్వం
జిల్లాలో ఉపాధి కూలీల పనిదినాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేశాం. సాంకేతికంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నాం. అయితే మెటీరియల్ కాంపోనెంట్, మిని గోకులాలకు సంబంధించి విడుదలయ్యాయి. రెండు నెలలకు పైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వారం పది రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
– ఎం.సిద్ధలింగమూర్తి,
డ్వామా పీడీ, పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు