
వరి నాట్లుకు సిద్ధమవుతున్న రైతులు
పిడుగురాళ్ల: రైతులు వరి నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నిన్నటి వరకు ఎండలు విపరీతంగా కాయటంతో నాట్లు వేసేందుకు ఆలోచనలో పడ్డ రైతులకు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూమి పదునెక్కింది. దీంతో రైతులు బోర్ల కింద వేసిన నారును కొనుగోలు చేసి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బోర్ల దగ్గర నారు పోసిన వారు ముందుగానే నాట్లు వేశారు. వర్షం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. మెట్ట భూములు కూడా పదునెక్కటంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిగమ్నయ్యారు. దీంతో సాగర్ నుంచి నీరు వస్తే పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలకు పదునెక్కిన భూమి