
ఏఐతో రైల్వే డివిజన్ అభివృద్ధికి కృషి
లక్ష్మీపురం: ఆర్టిఫీషియల్ ఇంటల్‌జెన్స్ (ఏఐ)తో రైల్వే డివిజన్‌ను మరింత ఆధునాత పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం సుధేష్ట సేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం ఏఐపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. సిబ్బంది అంతా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా పని చేయాలని తెలిపారు. నూతన హంగులు, అధునాతన పద్ధతులు, కొత్త దనంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయా విభాగాధిపతులు సమర్థమైన పనితీరుతో డివిజన్ మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం రమేష్‌కుమార్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎం సుథేష్ట సేన్