ప్రైవేట్‌ నర్సరీలతో జర జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ నర్సరీలతో జర జాగ్రత్త

Jul 28 2025 8:05 AM | Updated on Jul 28 2025 8:05 AM

ప్రైవేట్‌ నర్సరీలతో జర జాగ్రత్త

ప్రైవేట్‌ నర్సరీలతో జర జాగ్రత్త

సత్తెనపల్లి: జిల్లాలో మిర్చి పంటలు సాగు చేసే రైతులు నారు కోసం నర్సరీలను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు నారు కోసం ప్రైవేట్‌ నర్సరీలపై ఆధారపడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది ప్రైవేట్‌ నర్సరీల నిర్వాహకులు నాసిరకం నారును రైతులకు అంటగడుతున్నారు. నర్సరీల నిర్వాహకుల మాటలు నమ్మి రూ.లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేసిన రైతులు దిగుబడులు సక్రమంగా రాక, తెగుళ్ల బెడదతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా నారు కొనుగోలు సమయంలో మోసపోతే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. పైరు ఏపుగా పెరిగి ఎన్ని మందులు వాడినా దిగుబడులు రాక రైతులు నష్టపోతుంటారు. పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ నర్సరీల నిర్వాకంతో రైతులు నష్టపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే రైతులు మోసపోకుండా ఉండేందుకు విత్తన చట్టం ప్రకారం నర్సరీల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్వాహకులు విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? ఎలా పెంచుతున్నారు? రైతులకు ఎలా ఇస్తున్నారని? ఉద్యాన శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. జిల్లాలో ప్రైవేట్‌ నర్సరీలు 380 నిర్వహిస్తున్నారు. ఉద్యాన శాఖ అధి కారులు పరిశీలించి లైసెన్స్‌ గడువు ముగిసిన నర్సరీలను వెంటనే రెన్యువల్‌ చేసుకోవా లని నర్సరీల నిర్వాహకులకు సూచిస్తున్నారు.

ఏమాత్రం పొరపాటు జరిగిన రైతుకు తీవ్ర నష్టం నారు నాణ్యతలో రాజీ పడకూడదు ప్రైవేట్‌ నర్సరీల నిర్వాహకులు నిబంధనలను పాటించకుంటే చర్యలు జిల్లా వ్యాప్తంగా 380 మిర్చి సాగు ప్రైవేట్‌ నర్సరీలు

నర్సరీలు పాటించాల్సిన నిబంధనలు...

నారు పెంచే నర్సరీ చుట్టూ ఇన్‌సెక్ట్‌ నెట్‌ ఉండాలి

ఇన్‌సెక్ట్‌ నెట్‌కు ఎలాంటి చిల్లులు లేకుండా చూడాలి

డబుల్‌ డోర్‌కు ఎలాంటి సందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

షేడ్‌ నెట్‌కు మూడు అడుగుల విస్తీర్ణం వరకు ఎలాంటి కలుపు, చెట్లు ఉండకూడదు

నర్సరీ లోపల పసుపు రంగు జిగురు అట్టలు ఉంచాలి

నర్సరీ లోపల వైరస్‌ నిర్మూలనకు చుట్టూరా ట్రాప్‌ క్రాఫ్‌ (బంతి మొక్కలు) వేయాలి

ప్రతి బెడ్డుకు ముందు ఆ బెడ్డులో పోసిన నారును సూచిస్తూ కంపెనీ, వైరెటీ, నాటిన తేదీ మొదలగు వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలి

నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన కంపెనీల బిల్లులు తీసుకోవాలి

నర్సరీ కి సంబంధించిన ఏడు రిజిస్టర్‌ లలో పూర్తి వివరాలు నమోదు చేయాలి

నర్సరీ లైసెనన్స్‌ నెంబర్‌ ప్రింట్‌ చేసిన బిల్లులు మాత్రమే నారు కొనుగోలుదారులకు ఇవ్వాలి

నర్సరీ పేరును సూచిస్తూ నర్సరీ బయట పెద్ద బోర్డును ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement