
కృష్ణమ్మకు పోటెత్తిన వరద
శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025
బెల్లంకొండ: గురువారం కృష్ణా నదికి వరద పోటెత్తింది. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి రెండు రోజులుగా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైన ప్రవాహంతో బుధవారం వరకు ఖాళీ చేసిన గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురవగా.. గురువారం అవి పూర్తిగా నీట మునిగాయి. ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం దాదాపుగా 40 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వతో బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలైన పులిచింతల, గొల్లపేట, కోళ్లూరు, భోదనం, చిట్యాల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఎమ్మాజీగూడెం వరకు వరద నీరు చేరే అవకాశం ఉంది. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఎమ్మాజీగూడెం ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాలలో పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ డి.ప్రవీణ్ సూచించారు.
పరివాహక ప్రాంతాలలో అప్రమత్తం
అమరావతి: కృష్ణా నదిపై ఎగువన ఉన్న పులి చింతల ప్రాజెక్టు నుంచి బుధవారం సుమారు 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు విడుదల చేయటంతో అమరావతిలో గురువారం కృష్ణానది జలకళ సంతరించుకుంది ఒక్కపారిగా వరద వచ్చి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలు తిలకించటానికి ప్రజలు వస్తున్నారు. మండలంలోని సుమారు 30 కిలోమీటర్ల మేర నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పర్యాటక కేంద్రం అమరావతిలోని అమరేశ్వరఘాట్, ధ్యానబుద్ధ ఘాట్ వద్దకు ప్రజలు అధికంగా తరలివచ్చారు. తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరారు.
నిండుకుండలా టెయిల్ పాండ్ రిజర్వాయర్
సత్రశాల (రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్దనున్న నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 14 క్రస్ట్‌గేట్లు ద్వారా 2,12,618 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం గురువారం తెలిపారు. 3 మీటర్ల మేర గేట్లు ఎత్తామన్నారు. ప్రాజెక్టులో 75.50 మీటర్లకుగాను 74.34 మీటర్ల వరకు నీటిమట్టం చేరిందన్నారు. గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.304 టీఎంసీలు ఉందని తెలిపారు. టీఆర్‌సీ లెవల్ 60.09 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువనున్న నాగార్జున సాగర్ నుంచి 2,26,015 క్యూసెక్కుల వరద ఇక్కడి ప్రాజెక్టుకు చేరుకుంటోందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.
న్యూస్‌రీల్
ముంపు గ్రామాలకు
అధికారుల హెచ్చరికలు
పులిచింతలకు 2,12,618
క్యూసెక్కులు విడుదల

కృష్ణమ్మకు పోటెత్తిన వరద

కృష్ణమ్మకు పోటెత్తిన వరద

కృష్ణమ్మకు పోటెత్తిన వరద