
సాగర్ చెంత సందర్శకుల సందడి
విజయపురి సౌత్: నాగార్జున సాగర్, కొండకు గురువారం పర్యాటకులు తరలివచ్చారు. సాగర్ డ్యాం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో తిలకించిన వస్తున్నారు. నాగసిరి, అగస్త్య లాంచీలలో నాగార్జున కొండకు తరలివెళ్లారు. ఇలా రూ.48 వేల ఆదాయం చేకూరినట్లు అధికారులు తెలిపారు. మ్యూజియంలో బుద్ధుడి ప్రతిమలు, రాతి సామగ్రి, మట్టి కుండలు, బుద్ధుడి 9 అడుగుల పాలరాతి విగ్రహం, మహా స్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానాల గట్లు, బోది వృక్షం చూసి తన్మయత్వం చెందారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి దేవాలయం, అనంతరం 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. నాగార్జునసాగర్ డ్యాంపై 26 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో నూతన బ్రిడ్జి, పాత వంతెన, లాంచీస్టేషన్, కృష్ణవేణి పుష్కర్‌ఘాట్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి.