
వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోట
నరసరావుపేట రూరల్: వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు కల్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం 11 మందితో కూడిన రాష్ట్ర ఐటీ విభాగ కమిటీని ప్రకటించింది. ఇందులో గురజాల నియోజకవర్గానికి చెందిన నంద్యాల రాజశేఖరరెడ్డి, మాచర్ల నియోజకవర్గానికి చెందిన తాటికొండ హనిమిరెడ్డిలను కార్యదర్శులుగా నియమించారు.
ప్రతి రైతుకు
‘అన్నదాత సుఖీభవ’
– జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు
నరసరావుపేట: అర్హత కలిగిన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు జరిగేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. గురువారం ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు రెండో తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు ఇవ్వనుందని, అదే రోజు కేంద్ర సర్కార్ కూడా తనవంతుగా రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుందని తెలిపారు. జిల్లా, మండల స్థాయిల్లో ఈ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద కచ్చితంగా లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, రైతులను భాగస్వాములను చేస్తామన్నారు. సమావేశంలో జేసీ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.