
కూటమి అరాచకాన్ని తిప్పికొడదాం
పోలీసులను శిఖండిగా మార్చిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వ పెద్దలు పోలీసులను శిఖండిగా వినియోగిస్తూ వారిచేత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను కొట్టిస్తున్నారు. పోలీసులు చేస్తున్న అరాచకాలపై ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేయాల్సిన అవసరం ఉంది. –కాసు మహేష్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, గురజాల
పోలీసులపై ప్రైవేటు
కంప్లయింట్
పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఏ లీగల్‌సెల్ సభ్యుడు ఊరుకోవద్దు. అక్రమాలకు, అరాచకాలకు పాల్పడిన పోలీసులపై ఖచ్చితంగా ప్రైవేట్ ఫిర్యాదు చేస్తాం.
–రోళ్ల మాధవి,
లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు
నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ అరాచకాన్ని తిప్పికొట్టడంలో లీగల్ సెల్ న్యాయవాదులు సమష్టిగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షులు మల్లసాని మనోహరరెడ్డి పేర్కొన్నారు. రామిరెడ్డిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో జిల్లా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జిల్లా అధ్యక్షురాలు, న్యాయవాది రోళ్ల మాధవి అధ్యక్షతన శనివారం నిర్వహించిన పార్టీ లీగల్‌సెల్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అరాచకం పరాకాష్టకు చేరిందన్నారు. ప్రభుత్వమే రాక్షస పాలన సాగిస్తుందని, బాధితులు ఎక్కువగా పల్నాడు జిల్లాలోనే ఉన్నారన్నారు. పిన్నెల్లి లాంటి గ్రామాల్లో వందలమంది ఊరువిడిచి పెట్టి వెళ్లాల్సి వచ్చిందన్నారు. జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌పై అనేక అక్రమ కేసులు పెట్టారన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లీగల్ సెల్ ప్రతినిధులు అద్భుతంగా పనిచేశారని, ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ఛేదించి నాయకులు, కార్యకర్తలను బయటికి తీసుకొస్తున్నారన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గుర్తుపెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో తొలుత దివంగత వైఎస్సార్ ప్రతిమకు పూలమాల వేసి నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాదులు కట్టా నారపరెడ్డి, పక్కాల సూరిబాబు, చల్లా రామిరెడ్డి మాట్లాడారు. మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సుదర్శనరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు భగవాన్, జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన లీగల్‌సెల్ న్యాయవాదులు నరేంద్ర, వై.సీతారామిరెడ్డి, చిట్టిబాబు, సీహెచ్.నాగిరెడ్డి, ఎం.ఎన్.ప్రసాదు, హరిప్రసాదు, పెద్దసంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
మాకు రక్షణ లీగల్‌సెల్ న్యాయవాదులే
తమకు రక్షణ కల్పిస్తుందని లీగల్‌సెల్ న్యాయవాదులే. పార్టీ కార్యకర్త రషీద్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారు. లీగల్ సెల్ ప్రతినిధులు కోర్టులో న్యాయపోరాటం చేసి ఆ పేర్లు తిరిగి ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారు. లీగల్‌సెల్ కమిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ కోసం పనిచేస్తున్న వారందరినీ గుర్తుపెట్టుకుని పదవులు ఇస్తాం.
–బొల్లా బ్రహ్మనాయుడు,
మాజీ ఎమ్మెల్యే, వినుకొండ
కార్యకర్తల సంరక్షణే లక్ష్యం కావాలి
కార్యకర్తలను పోలీసులు కొట్టకుండా వారి చెర నుంచి బయటకు తీసుకురావటమే లక్ష్యంగా లీగల్ సెల్ సభ్యులు పనిచేయాలి. నాయకులు, కార్యకర్తలపై ఏవిధంగా కేసులు పెట్టాలో, ఏఏ సెక్షన్లు బనాయించాలో, రిమాండ్ రిపోర్టు ఎలా తయారుచేయాలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. పల్నాడు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా రాజకీయపరమైన కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లీగల్ సెల్ అవసరం ఎంతో ఉంది. ఎక్కడైనా కేసులు బనాయించిన సత్వరమే స్పందించి న్యాయ సహాయం అందిస్తున్నారు.
–డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే,
పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్
అధ్యక్షులు మనోహరరెడ్డి
నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ
లీగల్‌సెల్ న్యాయవాదుల సదస్సు
లీగల్‌సెల్ పాత్ర కీలకం
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనలో లీగల్‌సెల్ న్యాయవాదుల ప్రాముఖ్యత తెలియచేస్తుంది. తనతోపాటు అనేకమంది నాయకులపై ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది. తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే అందుకు లీగల్‌సెల్ సహకారమే కారణం.
–విడదల రజిని,
మాజీ మంత్రి
ప్రతి ఇంట్లో ఒక న్యాయవాది అవసరం
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటన న్యాయవాదుల ప్రాధాన్యతను తెలియచేసింది. ప్రతి ఇంట్లో ఒక న్యాయవాది ఉండాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం రేకెత్తిస్తుంది.
–డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, సమన్వయకర్త, సత్తెనపల్లి

కూటమి అరాచకాన్ని తిప్పికొడదాం

కూటమి అరాచకాన్ని తిప్పికొడదాం