7, 8 తేదీలలో సీపీఐ మహాసభలు | - | Sakshi
Sakshi News home page

7, 8 తేదీలలో సీపీఐ మహాసభలు

Jul 23 2025 12:23 PM | Updated on Jul 23 2025 12:23 PM

7, 8 తేదీలలో సీపీఐ మహాసభలు

7, 8 తేదీలలో సీపీఐ మహాసభలు

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా సీపీఐ మహాసభలను ఆగస్టు 7, 8 తేదీలలో వినుకొండలో నిర్వహిస్తున్నట్టు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. 7వ తేదీన వినుకొండ ప్రధాన వీధుల్లో ర్యాలీ, సాయంత్రం 4 గంటలకు శివయ్య స్థూపం వద్ద బహిరంగ సభ, 8వ తేదీన ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాసభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, చక్రవరం సత్యనారాయణరాజు, షేక్‌.చినజాన్‌సైదా, చిట్యాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement