
కాసుపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
గురజాల : వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, నాయకులకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి అన్నారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభించిన పిడుగురాళ్ల– జానపాడు ఓవర్ బ్రిడ్జి పనులు, మెడికల్ కళాశాల పనులు నిలిచిపోతే పోరాటం చేసి వాటి పనులు ప్రారంభించేలా చేసిన ఘనత కాసు మహేష్‌రెడ్డికే దక్కుతుందన్నారు. దీంతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెంటనే స్పందించి సంవత్సర కాలంలో మెడికల్ కళాశాల పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడడం, పంటలకు గిట్టుబాటు ధరల లేక రైతులు విలవిల్లాడి పోతున్న సంఘటనలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాసు మహేష్‌రెడ్డిపై ఆరోపణలు మానుకోవాలన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల