Tollywood
-
నాన్నపై ఎలాంటి కోపం లేదు.. ఆయనను అలా చూడాలని ఉంది: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కుటుంబంలో జరిగిన పరిణామాలను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబం మొత్తం కలిసి కూర్చొని భోజనం చేయాలని.. ప్రేమగా మాట్లాడుకునే రోజు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తానని అన్నారు.మా కుటుంబంలో జరిగిన పరిణామాలతో అమ్మను చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే నేను అమ్మను కలవాలంటే పలు కండిషన్స్ పెట్టారు. ఆమెను కలవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే నేను వెళ్తే ఆమె ఇంటి బయటకు వచ్చి నన్ను కలవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఆమె కూడా మమ్మల్ని ఎంతో మిస్సవుతోంది. అప్పుడప్పుడూ మా వద్దకు వస్తుంటుంది. మా పాప అంటే అమ్మకు ఎంతో ఇష్టం. గొడవల కారణంగా అక్కను దూరం పెట్టాను. ఇటీవల తన ఆధ్వర్యంలో జరిగిన టీచ్ ఫర్ ఛేంజ్ ఈవెంట్‌కు నేను వస్తానో రానో కూడా ఆమెకు తెలియదు. కానీ తన కోసమే నేను అక్కడికి వెళ్లాను. నేను ఏమైపోతానోనని అక్క చాలా భయపడింది. కానీ దేవుడి దయ, నా పిల్లలు, అభిమానులు ఇచ్చిన ధైర్యంతోనే నిలబడ్డా. తండ్రి అంటే నాకు చాలా ఇష్టం.. ఆయనపై ఎలాంటి కోపం లేదు. నా కుమార్తెను నాన్న ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా' అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. -
బాలకృష్ణ–గోపీచంద్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..?
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) మరోసారి దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇవ్వనున్నాడు. 2023లో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మరోసారి వారిద్దరూ కలిసి ఒక భారీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా డాకు మహారాజ్‌తో విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, మాస్ సినిమాలకు తనదైన మార్క్ చూపించే బాలయ్య మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నాడు. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్ మూవీనిప్లాన్ చేశారట గోపీచంద్.ఇటీవల బాలకృష్ణకు గోపీచంద్ ఓ కథ చెప్పగా, ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాను కేవీఎన్ ప్రోడక్షన్స్ లేదా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. -
'బద్మాషులు' సాంగ్‌ను విడుదల చేసిన ప్రియదర్శి
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'బద్మాషులు'. జూన్ 6న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘జిందగీ బిలాలే’ సాంగ్‌ను విడుదల చేశారు. శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హిలేరియస్ ఎంటర్టైనర్, తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి. బాలకృష్ణ, C.రామ శంకర్ నిర్మాతలుగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి జిందగీ బిలాలే సాంగ్‌ను హీరో ప్రియదర్శి విడుదల చేశారు.ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. 'బద్మాషులు సినిమా ప్రోమోషల్ సాంగ్ జిందగీ బిలాలే సాంగ్ విడుదల చేయడం జరిగింది, సాంగ్ చాలా ఎంటర్టైన్గా ఉంది, తేజ కూనూరు సంగీతం అందించారు, చరణ్ అర్జున్ , విహ పాడిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను, టీజర్ హిలెరియ్గా ఉంది, ఫన్ టేక్ ఓవర్ చేసినట్లు ఉంది, జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ఆయన అన్నారు. ఇది మన ఊరి కథ అనే విధంగా ఈ చిత్రంలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయని మేకర్స్ అన్నారు. డైరెక్టర్ శంకర్ చేగూరి వంద శాతం జనాలను రెండు గంటలు నవ్వించాలనే ఉద్దేశ్యంతో బద్మాషులు చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు.మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా, రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యబోతోంది. -
'బలగం' నటుడు మృతి.. వేణు సంతాపం
‘బలగం’ సినిమా నటుడు జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ కమెడీయన్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి చిన్న తాత అంజన్న పాత్రలో ఆయన నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొంతకాలం క్రితం ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆయన మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ కోసం ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సమయంలో దర్శకుడు వేణు, ప్రియదర్శి కొంత సాయం చేశారు. అప్పటికీ ఆయన ఆసుపత్రి ఖర్చులు అంతకు మించి ఎక్కువ కావడంతో ఆర్థిక సాయం కోసం చాలామందిని ప్రాదేయపడ్డారు. జీవీ బాబు మృతి పట్ల దర్శకుడు వేణు సంతాపం తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ' జి వి బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు.. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను .' అని తెలిపారు. -
తమన్నా చెబితే కొంటారా : రమ్య
శివాజీనగర: మైసూరు శాండల్ సబ్బుల ప్రచారకర్తగా నటి తమన్నాను నియమించడంపై కన్నడ నేతలు, తారల ఆగ్రహం కొనసాగుతోంది. నటి, మాజీ ఎంపీ రమ్య కూడా అసమ్మతిని వ్యక్తం చేశారు. ప్రతి కన్నడిగుడు మైసూరు శాండల్ సోపు రాయబారి అని అన్నారు. ఈ పాత్ర కోసం తమన్నాకు కోట్లాది రూపాయాలను చెల్లింపు వెనుక తర్కాన్ని ప్రశ్నించారు. సెలిబ్రిటీల ప్రచారం కోసం సర్కారు ప్రజల సొమ్మును ఖర్చు చేయడం తగదన్నారు. సోపు రుద్దితే తెల్లగా కారు, సెలిబ్రిటీలు చెబితే ప్రజలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసే రోజులు చాలా ఏళ్ల క్రితమే గతించాయని శనివారం సోషల్ మీడియాలో చెప్పారు. ఒక ఉత్పత్తి నిజంగా విలువైనదైతే అందరూ కొంటారన్నారు. మైసూరు శాండల్‌పై ఇప్పటికే ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందని, తమన్నా ప్రచారం అవసరం లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. -
అందులో రొమాంటిక్ యాంగిల్ మాత్రమే చూశారు: భాగ్యశ్రీ బోర్సే
ఒకే ఒక్క తెలుగు సినిమాతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). ఆ పాపులారిటీతోనే ఇప్పుడు చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోంది. ఆ విషయాలే మీ కోసం.. నైజీరియాలోని లాగోస్‌లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్‌గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు వ్యాపార బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో ఆమె ప్రసిద్ధిచెందింది.విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమాలో నుంచి విడుదలైన ‘హృదయం లోపల’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఆమె చాలా ఇంటిమేట్‌గా కనిపించింది. ఈ విషయమై ఆమెను అడగ్గా, ‘క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికే అలా నటించా– స్టార్డమ్ అందుకోవడానికి కాదు. ఇందులోని హీరోయిన్ పాత్రలో కేవలం రొమాంటిక్ యాంగిలే కాదు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అందుకే, ఈ సినిమా కోసం నేను కూడా ఒక కామన్ ఆడియన్స్‌లాగా ఎదురు చూస్తున్నాను.’ అని భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రీసెంట్గా 26వ పుట్టినరోజు జరుపుకున్న భాగ్యశ్రీ.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జన్మించింది. భాగ్యశ్రీకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లల్లో భాగ్యశ్రీ రెండవది. మిగిలిన ఇద్దరి పేర్లు మధువంతి, పూర్ణిమ. మొదటి సినిమాకి (మిస్టర్ బచ్చన్) రూ. 30 లక్షల పారితోషికం తీసుకున్న భాగ్యశ్రీ, ప్రస్తుతం రూ. రెండు కోట్లు డిమాండ్ చేస్తోందని సమాచారం.ఏ ఫుడ్ ఇష్టం: హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బేగం బజార్లో దొరికే పానీ పూరీ, చాట్ అంటే ప్రాణం. అవకాశం దొరికినప్పుడు తనే స్వయంగా వెళ్లి తినడానికి ప్రయత్నిస్తుంది.ఏ సినిమాలు చేస్తుంది: రామ్ పోతినేనితో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా చేస్తోంది భాగ్యశ్రీ. ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్ తర్వాతే కొత్త ప్రాజెక్టులు సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేయకుండా, ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులకు మాత్రమే సైన్ చేస్తానంటోంది భాగ్యశ్రీ.బాలీవుడ్ ఆలోచనపై: కెరీర్ ఆరంభంలో హిందీలో ‘ఆరియాన్’, ‘చందు ఛాంపియన్’ అనే రెండు సినిమాలు చేసింది. కానీ, ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతానికి బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదంది.వెజిటేరియనే కానీ,..: బేసిక్‌గా వెజిటేరియన్ అయినా, ప్రొటీన్ కోసం చికెన్ తినడం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది. రొమాంటిక్ సినిమాలు చూడటం చాలా ఇష్టమట. ఏ పని అయినా వందశాతం చేయగలను అనే నమ్మకం ఉంటేనే, ఆ పనిని టేకప్ చేస్తాను. లేకపోతే నో చెప్పేస్తా’ అని చెప్పింది భాగ్యశ్రీ. -
24ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం రీఎంట్రీ ఇస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు మెల్లిగా సౌత్ ఇండియా పరిశ్రమైపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ నటీనటులు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. అయితే, 24ఏళ్ల క్రితమే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్( Raveena Tandon). మళ్లీ తమిళ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్లో హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు. అంతేకాకుండా బెంగాలీ, కన్నడం, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. తమిళంలో అర్జున్‌కు జంటగా సాదు అనే చిత్రంతో 1994లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో కమలహాసన్‌కు జంటగా ఆళవందాన్ "అభయ్" చిత్రంలో నటించారు. కాగా ఇటీవల కాలంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్న రవీనా టాండన్ తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నటుడు, సాంకేత దర్శకుడు విజయ్ ఆంటోని ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా లాయర్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జాషువా సేతురామన్ కథా,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా విజయ్ ఆంటోనీ తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ ఆంటోనికి దీటైన పాత్రలో ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు దర్శకుడు ఇదివరకే చెప్పారు. కాగా ఆమె ఎవరని చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆమే నటి రవీనా టాండన్. దీని గురించి దర్శకుడు తెలుపుతూ నటి రవీనా టాండన్ 1999లో నటించిన శూల్ చిత్రంలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాంటి నటి తమ చిత్రానికి అవసరం అనిపించిందన్నారు. లాయర్ చిత్రంలో రవీనా టాండన్ పాత్ర నటుడు విజయ్ ఆంటోని పాత్రకు దీటుగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ ఇదేనా..?
‘పుష్ప 2’తో అల్లు అర్జున్, జవాన్‌తో దర్శకుడు అట్లీ పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టేశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారు. ఈమేరకు తాజాగా దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్‌తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఐకాన్, సూపర్‌హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది. గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్‌తో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు ‘ఐకాన్’ టైటిల్‌ను ఆయన అనుకున్నారు. అయితే, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అట్లీ సినిమాకు ‘ఐకాన్’ టైటిల్ అయితే ఎలా ఉంటుందని బన్నీ ఆలోచిస్తున్నారట. అట్లీ కూడా బాగానే ఉందని చెప్పారట. దాదాపు ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని సమాచారం.ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తారు అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ లుక్‌లో కనిపించిన బన్నీ ఇప్పుడు అట్లీ సినిమా కోసం సరికొత్తగా తన లుక్‌ను మార్చుకోనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్‌ను ప్రయత్నించినట్లు సమాచారం. పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి ఉండే సైన్స్‌ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది. -
సెట్స్‌లో సూపర్‌స్టార్
సూపర్ స్టార్ సూర్యకుమార్ సెట్స్‌కు వచ్చారు. రామ్ హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సినీ సూపర్‌స్టార్ సూర్యకుమార్‌పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు.ఈ సూర్యకుమార్ అభిమానిగా హీరోగా రామ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు ఉపేంద్ర. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. హీరో, ఆ హీరో అభిమానికి మధ్య జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాకు సంగీతం: వివేక్–మెర్విన్. -
వన్స్ మోర్...
ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్లు, హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్, ఫ్రాంచైజీల కోసం హీరో–దర్శకుల కాంబో రిపీట్ అవుతోంది. సీక్వెల్, ఫ్రాంచైజీలకు అదే కాంబినేషన్ కుదరడం కామన్‌గా జరుగుతుంటుంది. వీటిని పక్కన పెడితే... ఆల్రెడీ ఒక సినిమాకి కలిసి... ఇప్పుడు మరో సినిమాకి కలిసిన హీరో–డైరెక్టర్ కాంబినేషన్ ‘వన్స్‌మోర్’ అంటూ రిపీట్ అవుతోంది. తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండోసారి సినిమా చేస్తున్న కొందరు హీరోలపై మీరూ ఓ లుక్ వేయండి.ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్లు, హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్, ఫ్రాంచైజీల కోసం హీరో–దర్శకుల కాంబో రిపీట్ అవుతోంది. సీక్వెల్, ఫ్రాంచైజీలకు అదే కాంబినేషన్ కుదరడం కామన్‌గా జరుగుతుంటుంది. వీటిని పక్కన పెడితే... ఆల్రెడీ ఒక సినిమాకి కలిసి... ఇప్పుడు మరో సినిమాకి కలిసిన హీరో–డైరెక్టర్ కాంబినేషన్ ‘వన్స్‌మోర్’ అంటూ రిపీట్ అవుతోంది. తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండోసారి సినిమా చేస్తున్న కొందరు హీరోలపై మీరూ ఓ లుక్ వేయండి.ఫ్యారడైజ్ ప్రపంచంనానీలోని మాస్ యాక్షన్ యాక్టింగ్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రీన్‌పై చక్కగా చూపించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ ‘దసరా’ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. దర్శకుడిగా ఈ ‘దసరా’యే శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా. అయితే తన రెండో సినిమా ‘ఫ్యారడైజ్’ని కూడా నానీతో చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరియే ఈ ‘ఫ్యారడైజ్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాని సికింద్రాబాద్ కుర్రాడిగా కనిపిస్తారని, స్క్రీన్‌పై ఆడియన్స్ ఓ కొత్త ప్రపంచాన్ని చూసేలా శ్రీకాంత్ ఓదెల స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఓ సరికొత్త పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్లో నాని కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలోని హీరోయిన్‌పాత్రకు మేకర్స్ జాన్వీ కపూర్, కయాదు లోహర్ వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాని ఇంగ్లిష్, స్పానిష్‌లతో సహా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ‘ది ఫ్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై, హిట్‌గా నిలిచింది. సో... ఆ సెంటిమెంట్ ప్రకారం మార్చి చివరి వారంలోనే ‘ది ఫ్యారడైజ్’ సినిమా రిలీజ్‌ను మేకర్స్ షెడ్యూల్ చేసినట్లుగా తెలుస్తోంది.బర్త్ డేకి అనౌన్స్మెంట్? హీరో బాలకృష్ణ–దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్ మూవీనిప్లాన్ చేశారట గోపీచంద్. ఇటీవల బాలకృష్ణకు గోపీచంద్ ఓ కథ చెప్పగా, ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాను కేవీఎన్ ప్రోడక్షన్స్ లేదా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.పన్నెండేళ్ల తర్వాత... పన్నెండేళ్ల క్రితం హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రకటన రెండు సంవత్సరాల క్రితమే వచ్చినప్పటికీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ముందే అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాల్సి రావడం వంటి కారణాల చేత పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో తిరిగి ఫుల్ ప్లెజ్డ్గా ప్రారంభం కానున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే... ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోపోలీస్ ఆఫీసర్‌గా నటించిన పవన్ కల్యాణ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోనూ పోలీసాఫీసర్‌గా నటిస్తుండటం విశేషం. తమిళ హిట్ మూవీ విజయ్ ‘తేరీ’కి తెలుగు రీమేక్‌గా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా రూపొందుతుందనే టాక్ వినిపించింది. కానీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఓ కొత్త కథను సిద్ధం చేయమని దర్శకుడు హరీష్ శంకర్‌కు చెప్పారని, ఆయన ఈ స్క్రిప్ట్‌ను మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని టాక్. ప్రస్తుతం సుజిత్ ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.మళ్లీ విలేజ్‌లో? రామ్‌చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ మరో మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నరపైనే అవుతున్నా చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో తలమునకలై ఉన్నారు దర్శకుడు సుకుమార్. ఇటీవల విదేశాలకు వెళ్లి ఈ సినిమా స్క్రిప్ట్‌పై హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌లు చర్చలు కూడా జరిపారు.అయితే ఈ సినిమా ‘రంగస్థలం’ సినిమా స్టైల్లోనే విలేజ్ నేపథ్యంలో ఉంటుందా? లేక సరికొత్తగా మోడ్రన్ స్టైల్లో ఉంటుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలోని హీరోయిన్‌పాత్రకు రష్మికా మందన్నా, సమంత, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.19వ శతాబ్దం నేపథ్యంలో...విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ సినిమా 2018లో విడుదలై, ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ–దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మళ్లీ ఓ సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్లో 14వ చిత్రం. 19వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఈ మూవీ కథనం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.1854–1878 మధ్య జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా దాదాపు ఖరారయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాలు విజయాలు సాధించిన నేపథ్యంలో, మళ్లీ విజయ్–రష్మికల కాంబోపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, విజయ్–రష్మికల కాంబోపై అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. స్పోర్ట్స్ డ్రామా! నితిన్ కెరీర్లో ‘ఇష్క్’ (2012) సూపర్ హిట్ ఫిల్మ్. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. అయితే ‘ఇష్క్’ (2012) చిత్రం తర్వాత పన్నెండేళ్లకు మళ్లీ హీరో నితిన్, దర్శకుడు విక్రమ్ కే కుమార్ల కాంబినేషన్ కుదిరింది. కొంత గ్యాప్ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో మళ్లీ తాను ఓ సినిమా చేస్తున్నానని, ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని, లార్జ్ స్కేల్లో ఉండబోతుందని, తెలుగు ఆడియన్స్ ఓ కొత్త సినిమాను చూసిన అనుభూతిని పొందుతారని ఇటీవల నితిన్ ఓ ఇంటర్వ్యూ వేదికగా చెప్పారు.వీళ్లే కాదు... ఇంకా మరికొందరు హీరో–దర్శకుల హిట్ కాంబో రిపీట్ కానుందని సమాచారం. – ముసిమి శివాంజనేయులు -
మన ఊరి కథ అనేలా...
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, ఇ.రామ శంకర్ నిర్మించారు. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తోంది. తేజ కూనూరు సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘జిందగీ బిలాలే...’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌ని నటుడు ప్రియదర్శి రిలీజ్ చేసి, మాట్లాడుతూ–‘‘బద్మాషులు’ టీజర్ వినోదాత్మకంగా ఉంది.‘జిందగీ బిలాలే...’పాటని చరణ్ అర్జున్, విహ చక్కగాపాడారు. ఈ సినిమా చక్కని విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇది మన ఊరి కథ అనేలా ఈ సినిమాలోనిపాత్రలు సహజంగా ఉంటాయి. ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించాలనే ఉద్దేశంతో శంకర్ చేగూరి ఈ సినిమాని తెరకెక్కించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
అనంతపురంలో హారర్ కామెడీ
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో ముగిసినట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. అనంతపురంలో థ్రిల్లింగ్ సన్నివేశాలతోపాటు పంచ్ హ్యూమర్‌తో కూడిన సీన్స్ షూట్ చేశాం. వరుణ్ తేజ్, రితికా నాయక్‌పై పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. మా చిత్రం తర్వాతి షెడ్యూల్ కొరియాలో ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఇది సినిమా కాదు... ఒక జీవితం: అడివి శేష్
‘‘అనగనగా’ చిత్రంలో వ్యాస్పాత్రను సుమంత్‌గారు అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ అలానే ఉంటారు. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. సుమంత్ కుమార్, కాజల్ చౌదరి జంటగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా’. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెల 15న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కి అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో రామ్‌పాత్ర కంటతడి పెట్టించింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు..ఒక జీవితం’’ అన్నారు. సుమంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మేము అనుకున్న దానికంటే అద్భుతమైన ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాకి వస్తున్న స్పందన చూసి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినీ ప్రపంచానికి నన్ను, మా టీమ్‌ను పరిచయం చేసిన చిత్రం ఇది’’ అన్నారు సన్నీ సంజయ్. ‘‘ఇంత పెద్ద సక్సెస్ సుమంత్‌గారి వల్లే సాధ్యమైంది’’ అని రాకేశ్ రెడ్డి గడ్డం తెలిపారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడారు. -
మా ముగ్గురిపాత్రలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి: బెల్లంకొండ సాయి శ్రీనివాస్
‘‘నేను, మనోజ్, రోహిత్‌గార్లు సినిమాలకి కొంతకాలం బ్రేక్ ఇచ్చాం. తెలుగులో నా సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లవుతోంది. ‘భైరవం’ చిత్రంలో మాపాత్రలు చూస్తున్నప్పుడు అందరూ ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘భైరవం’. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ తమిళ హిట్ మూవీ ‘గరుడన్’ని తెలుగులో ‘భైరవం’గా రీమేక్ చేశాం. అయితే రీమేక్‌లా కాకుండా స్ట్రైట్ తెలుగు చిత్రంలా మన ప్రేక్షకులకు తగ్గట్టు మార్పులు చేసి, అద్భుతంగా తీర్చిదిద్దారు విజయ్. ఈ కథ,పాత్ర నచ్చడంతో రోహిత్‌గారు వెంటనే అంగీకరించారు. ‘మిరాయ్’ సినిమా పోస్టర్లో మనోజ్‌గారిని చూసి, ‘భైరవం’పాత్రకి సంప్రదించగా, కథ నచ్చడంతో ఒప్పుకున్నారు.⇒ నన్ను ఇష్టపడిన ప్రతి ప్రేక్షకుడి కోసం ‘భైరవం’ చేశాను. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. శ్రీ చరణ్‌పాకాల అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చారు. హరి కె. వేదాంతంగారి విజువల్స్ కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ సినిమా కోసం అద్భుతమైన ఆలయ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలిగారికి థ్యాంక్స్. ఈ సినిమా ట్రైలర్లో పూనకం షాట్ ఉంటుంది. అందరూ చూసే ఉంటారు. ‘భైరవం’లో నాకు బాగా నచ్చినపార్ట్ అది. ఆపార్ట్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.⇒ రాధామోహన్‌గారు నాకిష్టమైన నిర్మాత. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు అనుకున్నా కుదరలేదు. ‘భైరవం’తో సెట్ అయింది. చాలా ఫ్యాషన్‌తో సినిమా నిర్మిస్తారాయన.⇒ పూరి జగన్నాథ్‌గారిని ఒకటి రెండు సార్లు కలిశాను. మా కాంబోలో కచ్చితంగా సినిమా ప్లాన్ చేస్తాం. నా ప్రతి సినిమాలో కొత్తదనం ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. విడుదలవుతున్న ‘భైరవం’, ప్రస్తుతం చేస్తున్న ‘టైసన్ నాయుడు, హైందవ, కిష్కిందపురి’ చిత్రాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. -
'థగ్ లైఫ్' సాంగ్స్.. దుమ్మురేపిన టాప్ సింగర్స్
నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా తెలుగు వర్షన్ సాంగ్స్ అన్ని ఒకే వీడియోతో షేర్ చేశారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కమల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా థగ్ లైఫ్ నిలుస్తుందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ప్రస్తుతం విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే, టాప్ సింగర్ చిన్మయి ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్‌ను పాడారు. ట్రాక్ మూడో వరుసలో ఉన్న 'ముద్దు వాన' సాంగ్‌ను ఆమె పాడారు. సింగర్ మంగ్లీ కూడా ఈ చిత్రంలో సూపర్ హిట్ పాటను ఆలపించారు. థగ్ లైఫ్ పాటల ప్రారంభంలోనే 'జింగుచ్చా' అంటూ ఆమె దుమ్మురేపారు. ఈ సినిమా కోసం ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు విజయ్ ఒక పాట, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ ఒక పాటతో మెప్పించారు. -
'షష్టి పూర్తి' ట్రైలర్.. మంచి ప్రయత్నం
'షష్టి పూర్తి' సినిమా ట్రైలర్ తాజాగా వచ్చేసింది. మంచి కంటెంట్‌తోనే ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి 'షష్టి పూర్తి' మూవీలో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మంచి లవ్ ట్రాక్‌తో పాటు కుటుంబ విలువలకు పెద్ద పీఠ వేసినట్లు ట్రైలర్లో చూస్తే అర్థం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటతో పాటు రూపేష్, ఆకాంక్షా సింగ్ యంగ్ జంటగా మెప్పించనున్నారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా 'గుర్తింపు'.. తెరపైకి రియల్ స్టోరీ
స్వస్తిక్ విజన్స్ సమర్పణలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కేజేఆర్ హీరోగా తెన్‌పతియాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘గుర్తింపు’. స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెన్‌పతియాన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కేజేఆర్, సింధూరి విశ్వనాథ్ జంటగా నటిస్తుండగా విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రమా, మోహన్ రామ్, ఆంటోనీ, అజిత్ ఘోషి, విమల్, ఇజబెల్లా, షాన్, దీపిక, జానకి, అరుల్ జ్యోతి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.గుర్తింపు సినిమా పోస్టర్ విడుదల తర్వాత నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ.. " పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, క్రీడా రంగంలో గుర్తింపు కోసం పడిన శ్రమ, చేసిన ప్రయాణం ఎలా ఉంటుందో ఇందులో చూపాం. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ డ్రామాగా ‘గుర్తింపు’ సినిమాను రూపొందిస్తున్నాo. ఇప్పటికి 85 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంతకు ముందు మా సంస్థలో శివ కార్తికేయన్ చిత్రాన్ని 'వరుణ్ డాక్టర్' పేరుతో అనువదించి మంచి విజయాన్ని అందుకున్నాo. ఇటీవల అశ్విన్ బాబు హీరోగా ‘శివం భజే’ చిత్రం నిర్మించాను' అని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు. కెమెరామెన్‌గా ఎ. విశ్వనాథ్ పనిచేస్తున్నారు. యాక్షన్ ఏపిసోడ్స్ పీటర్ హెయిన్ రూపొందించనున్నారు. -
ప్రభాస్ 'స్పిరిట్'లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ప్రకటన వచ్చేసింది
ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్' (Spirit Movie).. తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ప్రకటన వచ్చిన సమయం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి పూర్తిగా స్పిరిట్ సినిమా కోసమే పనిచేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.స్పిరిట్ సినిమా ప్రకటన వచ్చిన తర్వాత మొదటిసారి అధికారికంగా ఒక ప్రకటన చేశారు మేకర్స్.. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, దీపికా పదుకోణ్ ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఆ ఛాన్స్‌ను త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) అందుకుంది. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ సందీప్ ఒక పోస్ట్ షేర్ చేశారు.సందీప్ షేర్ చేసిన పోస్టర్‌ను బట్టి చూస్తే స్పిరిట్ చిత్రాన్ని దాదాపు 9 భాషలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాశారు. యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీకి మంచి గుర్తింపు దక్కింది. ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభింస్తామని సందీప్ తెలిపారు. ఇందులో విలన్‌గా దక్షిణ కొరియా స్టార్ నటుడు మా డాంగ్ సియోక్‌ను (Ma Dong-seok) తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆనందంలో త్రిప్తిస్పిరిట్ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసినందుకు త్రిప్తి డిమ్రీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఈ ప్రకటన రాగానే చాలా ఆనందంలో మునిగిపోయాను. ఈ జర్నీలో నన్ను నమ్మినందుకు సదా రుణపడి ఉంటాను. మరోసారి మీ విజనరీలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ సందీప్ రెడ్డి వంగా' అంటూ ఆమె తెలిపింది.The female lead for my film is now official :-) pic.twitter.com/U7JJQqSUVa— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025 -
శ్రీరామ్ 'నిశ్శబ్ద ప్రేమ' మూవీ రివ్యూ
టైటిల్ : నిశ్శబ్ద ప్రేమనటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో తదితరులునిర్మాణ సంస్థ: సెలెబ్రైట్ ప్రొడక్షన్స్నిర్మాత: కార్తికేయన్. ఎస్‌ఎడిటింగ్: మదన్.జిదర్శకత్వం, కథ: రాజ్ దేవ్సంగీతం: జుబిన్సినిమాటోగ్రఫీ: యువరాజ్.ఎంవిడుదల: మే 23, 2025హీరో శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శ్రీరామ్ హీరోగానే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. తాజాగా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో 'నిశ్శబ్ద ప్రేమ' అంటూ తన కొత్త సినిమాను విడుదల చేశారు. ఇందులో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్గా నటిస్తోంది. కార్తికేయన్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి రాజ్ దేవ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 23న విడుదలైంది. కెరీర్లో ఇప్పటివరకు చేయనటువంటి ఓ విభిన్నమైన క్యారెక్టర్లో శ్రీరామ్ కనిపించాడు. భార్య మరణానికి కారణమైన వారిపై ఓ యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..? అనే అంశాన్ని చాలా థ్రిల్లింగ్‌గా దర్శకుడు చూపారు.కథేంటంటే..సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను వాళ్లింట్లోనే గుర్తుతెలియని వ్యక్తి చంపే ప్రయత్నం చేస్తాడు. దీంతో భయంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. రోడ్డు వెంట పరుగెడుతుండగా యాక్సిండెంట్ కావడంతో తలకు తీవ్రమైన గాయం అవుతుంది. దీంతో ఆమె తన గతాన్ని మరిచిపోతుంది.తనని హాస్పిటల్లో చేర్చిన రఘు ఎవరో కాదు తన భర్తే అనేలా పరిచయం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి యోగ క్షేమాలు చూస్తుంటాడు. ఆ సమయంలో కనిపించిన పాత డైరీని చూసిన సంధ్య.. అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుసుకుంటుంది. ఈలోపు తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. విచారణ మొదలెట్టిన కమీషనర్ అడ్వర్డ్ (హరీశ్ పెరడి)కు యునానిమస్ కిల్లర్ దగ్గర సంధ్య ఉందని తెలుస్తోంది. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు? సంధ్య ఎలా అతని నుంచి తప్పించుకుంది? అసలు విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? వీరిద్దరికి, సంధ్యకి ఉన్న సంబంధం ఏమిటి? మధ్యలో రఘు పర్సనల్ సెక్రటరీ అయిన షీలా (నిహారిక పాత్రో) పాత్రేమిటి? అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ.ఎలా ఉందంటే..సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం కోసం టైమ్ తీసుకోకుండా దర్శకుడు చాలామంచి పనిచేశాడు. ప్రేక్షకులను డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సగం సినిమా అయ్యే సమయానికి, అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు..? అనేది ఓ క్లారిటీ వస్తుంది కానీ, అతను ఎలా బయటకు వస్తాడు..? అతన్ని ఎవరు కనిపెడతారు..? అనేది ఉత్కంఠగా సాగుతుంది. చివరకు ఇచ్చిన ముగింపు కూడా కన్వెన్సింగ్గానే ఉంది. శ్రీరామ్ డైలాగ్స్‌తో టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడంలో కూడా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా, ట్విస్ట్‌లతో పాటు వాటికి వివరణ ఇచ్చిన విధానం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశామనే ఫీల్‌ని ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..యునానిమస్ కిల్లర్ విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ నటన ఈ సినిమాకు హైలెట్. సీరియస్ ఫేస్‌తో కనిపించడమే కాకుండా, క్రూరంగా హత్యలు చేసే పాత్రని ఆయన ఇందులో పోషించారు. ఇందులో మరో కోణం ఆయన పాత్రకి ఉంది. ఇలాంటి పాత్రలు ఆయనకి కొత్తేం కాదు. తన పాత్రలోని వైవిధ్యం, ఆ వైవిధ్యానికి తగినట్లుగా శ్రీరామ్ అమరిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. సంధ్యగా నటించిన ప్రియాంక తిమ్మేష్ పాత్రపైనే ఈ సినిమా అంతా నడుస్తుంది. గృహిణిగా చక్కని అభినయం ఆమె ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో షీలాగా నటించిన నిహారిక పాత్ర కనిపించేది కాసేపే అయినా కుర్రకారుకు హీటెక్కిస్తుంది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రఘు పాత్రలో నటించిన వియాన్, కండలు తిరిగిన శరీరంతో కనిపించారు. అమాయకుడిగానూ, అలాగే కథలో కీలకమైన పాత్రలోనూ వియాన్ మెప్పించారు.సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జుబిన్.. ఓ స్టార్ హీరో సినిమా చూస్తున్న ఫీల్‌ని తెప్పించారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. ఎడిటింగ్ పరంగా కూడా ఎటువంటి వంకలు లేవు. మధ్యలో ఒకటి రెండు సీన్లు కాస్త స్లో అనిపించినా, కథలోని థ్రిల్లింగ్ అంశాలు దానిని డామినేట్ చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్ట్రైయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ని దర్శకుడు కలిగించారు. -
విశాల్ ప్రియురాలి కొత్త సినిమా.. ట్రైలర్లో దుమ్మురేపిందిగా
సాయి ధన్సిక పేరు ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో బాగా వైరల్ అవుతుంది. నటుడు విశాల్‌తో ఆమె ప్రేమలో ఉండటమే ఇందుకు కారణం. తాజాగా వారిద్దరూ అధికారికంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించారు. అయితే, తాజాగా సాయి ధన్సిక నటించిన కొత్త సినిమా 'యోగి డా' నుంచి ట్రైలర్ విడుదలైంది. గౌతమ్ కృష్ణ దర్శకత్వం వహించిన యాక్షన్ తమిళ చిత్రంలో సాయాజీ షిండే, కబీర్ దుహాన్ సింగ్ నటించారు. శ్రీ మోనికా సినీ ఫిల్మ్స్ బ్యానర్‌పై వి సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ షేర్ చేసింది. భారీ యాక్షన్ సిన్స్లో పోలీస్ ఆఫీసర్‌గా సాయి ధన్సిక దుమ్మురేపింది. ఈ సినిమా కోసం డూప్ లేకుండానే రియల్‌గా ఆమె స్టంట్స్ చేశారట.రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ధన్సిక.. అందులో ఆయన కూతురు (యోగి) పాత్రలో మెప్పించింది. ఇప్పుడు 'యోగి డా' టైటిల్‌తో తనే ప్రధాన పాత్రలో నటించింది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. -
ఓటీటీలో ప్రేమలు హీరో కొత్త సినిమా 'జింఖానా'
గతేడాదిలో 'ప్రేమలు' సినిమాతో తెలుగు యూత్‌కు బాగా దగ్గరయ్యాడు యువ నటుడు నస్లేన్ కె. గఫూర్. మలయాళ పరిశ్రమకు చెందిన ఆయన రీసెంట్గా మరో చిత్రం 'జింఖానా'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.జింఖానా సినిమా సోనిలివ్ (SonyLIV)లో జూన్ 5నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా నటించారు. మొదట మలయాళంలో ‘అలప్పుజ జింఖానా’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా తర్వాత రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో విడుదల చేశారు.కథఊరిలో ఆకతాయి కుర్రాళ్లుగా ఉన్న జోజో జాన్సన్ (నస్లేన్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), డీజే జాన్ (బేబీ జీన్), దీపక్ పణిక్కర్ (గణపతి), షణవాస్ (శివ హరిచరణ్) వీరందరూ మంచి స్నేహితులు. అయితే, వారిలో షణవాస్ మినహా మిగతా వాళ్లంతా 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోతారు. కానీ, స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు వారు బాక్సింగ్ ఆటలో ఎంట్రీ ఇస్తారు. అందుకోసం స్థానికంగా ఉన్న 'అలప్పుజా జింఖానా' అకాడమీలో శిక్షణ తీసుకుంటారు. అలా బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెడుతారు. ప్రొఫెషనల్ ఆటగాళ్లతో ఈ ఆకతాయి గ్యాంగ్ ఎలా ఎదుక్కొంటుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? అనేది సినిమాలో చూడాల్సిందే. -
ఓటీటీలో నాని 'హిట్ 3' సినిమా.. స్ట్రిమింగ్ వివరాలు ఇవే
నాని 'హిట్3: ది థర్డ్ కేస్'(HIT: The Third Case) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. హీరో నాని కెరీర్లో వంద కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరిపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం ఆపై సినిమా పట్ల పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ దుమ్మురేపాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా ఏంటో చూపించనున్నాడు.'హిట్3: ది థర్డ్ కేస్' సినిమా మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది. రాబోవు సినిమాల జాబితాలో హిట్3ని నెట్‌ఫ్లిక్స్ చేర్చించి. గురువారం (మే 29)న స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది. హిట్3 మూవీలో కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్మురేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావడం విశేషం. ఇప్పటికే 'ప్యారడైజ్' షూటింగ్లో నాని జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత సుజీత్‌తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల (శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
అనసూయ మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ వచ్చేస్తోంది
పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తాజాగా తెరకెక్కించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల పలు మార్లు విడుదల వాయిదా పడుతూ..ఇప్పుడు మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఇంత వరకు ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు జయశంకర్. కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని, కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు. -
ఓటీటీలో సల్మాన్, రష్మికల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా నటించిన సికందర్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైంది. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రూ. 210 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. బాలీవుడ్లో విడుదలైన సినిమాలు కొన్ని 8వారాలకు ఓటీటీలో విడుదలౌతున్నాయి. ఇదేబాటలో సికందర్ చిత్రం కూడా స్ట్రీమింగ్కు రానుంది. మే 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. అయితే, కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.కథకథ చాలా పాతదే.. దర్శకుడు చెప్పిన తీరు అంతే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. రాజ్‌కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్‌కోట్‌కు రెండు పేర్లు ఉంటాయి. సికందర్, రాజాసాబ్ (సల్మాన్ ఖాన్), రాణి సాయిశ్రీ (రష్మిక మందన్న) అన్యోన్య దంపతులుగా ఉంటారు. తమ రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. ఈ క్రమంలో ఒకరోజు మంత్రి ప్రధాన్ (సత్యరాజ్)తో మొదలైన వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. ఆమె చివరికోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేయాలని కోరుతుంది. అయితే, ఎవరైతే రాణి నుంచి అవయవదానం పొందుతారో వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముగ్గురి జీవితాల్లోకి సికందర్ ఎలా ఎంటర్ అవుతాడు. మంత్రి ప్రధాన్ అనుచరుల నుంచి వారిని సికందర్ ఎలా కాపాడుతాడు..? ఇంతకీ సాయిశ్రీ ఎలా మరణించింది? అవయవదాన గ్రహీత వైదేహీ (కాజల్ అగర్వాల్)కు ఉన్న సమస్య ఏమిటి..? అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే. -
‘థియేటర్స్ బంద్’పై ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనేది అవాస్తవం అని..ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ కోరారు. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్లో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని చెప్పారు. ‘చర్చలు జరగకపోతే, జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పారు కానీ..దాన్ని కొంతమంది మరోలా ప్రచారం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్స్ మూసివేస్తారనే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అలాంటిదేమి జరగడం లేదు. సమస్యలను పరిష్కరించుకోవడానికి మూడు సెక్టర్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నాం.నిర్ణిత సమయంలోగా మా సమస్యలను పరిష్కరించుకుంటాం. 30న ఈసీ సమావేశమై కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం. థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది.కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదు. చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్ మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం’ అని దామోదర ప్రసాద్ అన్నారు. -
'ఒక బృందావనం' మూవీ రివ్యూ
కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో నూతన నటీనటులతో తెరకెక్కించే సినిమాలు ఎక్కువయ్యాయి. వాటిలో చాలా వరకు విజయం సాధిస్తున్నాయి కూడా. అలా వచ్చిన మరో చిన్న చిత్రమే ‘ఒక బృందావనం’. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కెమెరామెన్ రాజా విక్రమ్(బాలు) ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా అమెరికాకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. మహి(షిన్నోవా).. చనిపోయిన వాళ్ల అమ్మ చేయాలనుకున్న డ్యాక్యుమెంటరీని తీయాలనుకుంటుంది. దీని కోసం పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంది. అనాథ అయిన నైనికా(సాన్విక)..తనకు ప్రతి క్రిస్మస్కి బహుమతులు పంపిస్తున్న జోసెఫ్(శుభలేక సుధాకర్)ని కలిసి తన పేరెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం అనాథ ఆశ్రమం నుంచి పారిపోవాలనుకుంటుంది. ఈ ముగ్గురు వివిధ కారణాలతో కలుస్తారు. మహి తన డాక్యూమెంటరీకి కెమెరామెన్‌గా రాజాను తీసుకుంటుంది. జోసెఫ్ని కలిపిస్తామని చెప్పి.. నైనికతో డాక్యూమెంటరీ వీడియో తీసేందుకు ఒప్పిస్తారు. అసలు ఆ డాక్యూమెంటరీ దేని గురించి? చివరకు అది పూర్తయిందా లేదా? అమెరికా వెళ్లాలనుకున్న రాజా కోరిక నెరవేరిందా? నైనికాకు జోసెఫ్ ఎందుకు బహుమతులు పంపిస్తున్నాడు? చివరకు జోసెఫ్ని నైనికా కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం చేసిన ఎమోషనల్ జర్నీయే ‘ఒక బృందావనం’ మూవీ. కథ పరంగా ఇది రొటీనే అయినా.. కథనం, స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకునేలా ఉంటుంది. వినోదంతో పాటు ఓ మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందించాడు దర్శకుడు. ఫస్టాప్ కాస్త సాగదీతగా అనిపించినా.. ద్వితియార్థం అంతా చాలా ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. మూడు పాత్రల పరిచయానికే దర్శకుడు సమయం ఎక్కువ తీసుకున్నాడు. ఈ ముగ్గురు కలిశాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకడాఫ్‌లో జోసెఫ్ని వెతుక్కుంటూ ఈ ముగ్గురు చేసే ప్రయాణం చుట్టే కథనం తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తే..మరికొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కథనం కాస్త నెమ్మదిగా సాగినా.. ఓపికతో చూస్తే మాత్రం హృదయాలను ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ,వయోలెన్స్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చి దిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించినవారంతా నూతన నటీనటులే అయినప్పటికీ చక్కగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరామెన్ రాజాగా బాలు చక్కగా నటించాడు. మహి పాత్రకి పిన్నోవా న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మహేందర్, మహబూబ్ బాషాల కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. ఇక సీరియర్ నటీనటులు శుభలేక సుధాకర్, శివాజీ, అన్నపూర్ణమ్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సన్నీ సాకేత్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై చక్కగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘కన్నప్ప’ టీమ్‌కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
‘కన్నప్ప’చిత్ర బృందానికి మంచు మనోజ్(Manchu Manoj) క్షమాపణలు చెప్పారు. భైరవం సినిమా ఈవెంట్లో ‘శివయ్యా..’ అనే డైలాగును వేరేలా వాడడం తప్పని ఒప్పుకున్నాడు. ఒకడు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని..ఏదో ఎమోషనల్‌గా అలా అన్నానని చెబుతూ కన్నప్ప టీమ్‌కు సారీ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..శివయ్యా... అని పిలిస్తే రాడుమంచు మనోజ్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఏపీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఇబ్బందులు ఉన్న సమయంలో ఆ పరమ శివుడే డైరెక్టర్ విజయ్ రూపంలో వచ్చి భైరవం సినిమా ఆఫర్ ఇచ్చాడని చెబుతూ.. ‘ శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ పరోక్షంగా కన్నప్ప సినిమాలో మంచు మనోజ్ చెప్పిన శివయ్యా డైలాగ్పై కౌంటర్ వేశాడు. అదికాస్త నెట్టింట బాగా వైరల్ అయింది.సినిమా ఒకడిది కాదు.. తాజాగా శివయ్య కామెంట్స్‌పై మంచు మనోజ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివయ్యా అనే డైలాగ్పై సెటైర్లు వేయడం తప్పని ఒప్పుకున్నాడు. ‘సినిమా అంటే ఒక్కడికాదు.. అందులో ఎంతో మంది పని చేస్తారు.. ఆ డైరెక్టర్,మ్యూజిక్ డైరెక్టర్..ఇలా ఎంతో మంది కష్టపడతారు. మోహన్ లాల్.. ప్రభాస్.. ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు.. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించడం తప్పే. ఒక సినిమా వాడిగా నేను అలా అనకూడదు. ఎప్పుడైనా ఏదైనా అని ఉంటే.. కన్నప్ప టీంకి క్షమాపణలు కోరుతున్నాను. అవి ఎమోషనల్‌గా చేసిన కామెంట్సే తప్ప..మరో ఉద్దేశం నాకు లేదు. కన్నప్ప సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ అన్నారు.భైరవం విషయానికొస్తే.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. -
Atlas Cycle Attagaru Petle : ‘అట్లాస్ సైకిల్’ షురూ
‘‘కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ’ చిత్రాల ఫేమ్ కార్తీక్ రాజు హీరోగా ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ సినిమా షురూ అయింది. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘అనగనగా’ మూవీ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్‌పై గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి హీరో చైతన్య కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి. సురేష్‌బాబు క్లాప్ కొట్టారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందజేశారు. అనంతరం రాజా దుస్సా మాట్లాడుతూ– ‘‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యంతో ΄ాటు ఎమోషనల్గానూ ఉంటుంది. 1980లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘80వ దశకంలో జరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అన్నారు కార్తీక్ రాజు. ‘‘వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని కాజల్ చౌదరి పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో డైరెక్టర్ క్రాంతి మాధవ్ అతిథిగా ΄ాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మల్లవరం వెంకటేశ్వర రెడ్డి, రూప కిరణ్ గంజి, కెమేరా: గంగానమోని శేఖర్, సంగీతం: సురేష్ బొబ్బిలి. -
జూన్‌లో గ్యాంబ్లర్స్
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగ హీరోయిన్గా, రాకింగ్ రాకేశ్ ముఖ్యపాత్రలో నటించారు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, సంగీత్ ఫస్ట లుక్‌ను విడుదల చేశారు.కేఎస్కే చైతన్య మాట్లాడుతూ– ‘‘మిస్టరీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. సంగీత్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సునీత, రాజ్‌కుమార్ తెలిపారు. -
అల్లు అర్జున్ మనసులో రాఘవేంద్రరావు స్థానం.. ఫోటో వైరల్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ తన తొలి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారిపట్ల ఎంతో గౌరవం, కృతజ్ఞతతో ఉంటాడు. తనను హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిత్యం తలచుకునేలా, తన సినీ ప్రయాణం ప్రారంభమైన దశను ప్రతిరోజూ గుర్తు చేసుకునేలా, అల్లు అర్జున్ తన కార్యాలయ ప్రవేశద్వారంలో రాఘవేంద్రరావు ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా దర్శకుడిపై తన గౌరవాన్ని చాటుకున్నారు.అల్లు అర్జున్ కెరీర్ విజయాలమీద మాత్రమే కాకుండా, తనకు మద్దతుగా నిలిచిన వారిపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే విషయంలో కూడా ఎంతో విలువలతో ఉంటాడు. ఈ విషయంలో ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది. రాఘవేంద్రరావు తనను సినిమారంగంలోకి పరిచయం చేసిన తొలి దర్శకుడిగా, ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించారు."అల్లు అర్జున్ తన కెరీర్ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల విషయంలో ఎంతో జెన్యూన్ ప్రేమతో ఉంటాడు. వాళ్ల పట్ల ఎప్పుడూ ఆయన మనసులో ఎంతో గౌరవం ఉంటుంది. అందులో రాఘవేంద్రరావుకు బన్నీ జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. తన దర్శకులు, సాంకేతిక నిపుణులు, చిత్రబృందంలోని ఇతర సభ్యుల పట్ల అల్లు అర్జున్ గల గాఢమైన భావోద్వేగ బంధం గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిదశలో ఆయనకు సహాయపడిన వారిని ఆయన ఎప్పటికీ మరిచిపోరు అని పలువురు అంటున్నారు.అల్లు అర్జున్ కార్యాలయం ప్రవేశద్వారంలో ఉన్న రాఘవేంద్రరావు చిత్రపటం ఆయనలో ఉన్న కృతజ్ఞత, గౌరవం, భావోద్వేగ సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విలువలే ఆయన విజయాలకు పునాది మాత్రమే కాకుండా, స్టార్‌గా కాకుండా వ్యక్తిగా కూడా ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 'థాంక్యూ డియర్' ఫస్ట్ లుక్ లాంచ్!
టాలీవుడ్లో యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఇందులో హెబ్బా పటేల్, రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ - శ్రీనివాస్ నాయుడు తదితరులు నటిస్తున్నారు.ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘థాంక్ యూ డియర్’ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్లో కీలకమైనదని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
'మెగా 157' ప్రారంభం.. ఫస్ట్ సీన్ ఎక్కడంటే
మెగాస్టార్ చిరంజీవి,అనిల్ రావిపూడి తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) ఈరోజు హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రం రానుంది.తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు (మే 23) హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అనిల్‌తో పాటు చిరంజీవి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో, తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది.ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. -
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్‌ల రొమాంటిక్ సాంగ్ విడుదల
టాలీవుడ్లో అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా 'తెప్పసముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. 'ఎస్.ఎస్.మీడియా' సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. మాస్ మహారాజ్ రవితేజ 'ఈగల్' వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది. ఈ సినిమా ఓరిజినల్ కాపీ అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతుంది. అలాంటప్పుడు రీమేక్ భైరవం కోసం జనాలు థియేటర్‌కు వస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల నోటిదురుసు వల్ల బాయ్‌కాట్ భైరవం (#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు.తమిళ సినిమా 'గరుడన్'కు రీమేక్‌గా 'భైరవం' సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. గతేడాదిలో తమిళ్లో మాత్రమే విడుదలైన గరుడన్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ నటుడు సూరి లీడ్ రోల్లో నటించగా అతని స్నేహితులుగా శశికుమార్, ఉన్నిముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాను ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. వెట్రిమారన్ కథ అందించాడు.భైరవంలో కూడా ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. గరుడన్ కథ నచ్చే తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలని భైరవం తీస్తున్నట్లు దర్శకుడు విజయ్ కనకమేడల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, మాతృకతో పోలిస్తే మన ప్రేక్షకులకు నచ్చేలా అవసరమైన మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్లకి కూడా కొత్త అనుభూతిని అందించేలా ఈ కథలో మార్పులు చేసినట్లు ఆయన అన్నారు. -
విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణం ఎవరు..?
ప్రస్తుతం తమిళ నటుడు విశాల్ వయసు 50కి చేరువవుతోంది. నిజానికి అన్ని విధాలుగా బాగున్న ఓ వ్యక్తి అంత కాలం పాటు వివాహం కోసం ఆగడం అసాధారణమేననాలి. అందునా విశాల్... ఏ వయసుకా ముచ్చటను అచ్చంగా ఫాలో అయే అచ్చ తెలుగు సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు అనేది కూడా తెలిసిందే. పోనీ సినీనటుడిగా పరిగణనలోకి తీసుకున్నా, 40ఏళ్లకు కాస్త అటూ ఇటూగా పెళ్లి చేసుకోవడం రివాజు. మరోవైపు విశాల్, ధన్షికల మధ్య ప్రేమ ప్రయాణం కూడా ఈ నాటిది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో... విశాల్ తన పెళ్లిని ఎందుకు ఇన్నేళ్ల పాటు వాయిదా వేశాడు?అయితే విశాల్ పెళ్లి ఆలస్యం కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. అది వ్యక్తిగత సమస్యల వల్ల కాదు, ఎవరిపైనా ప్రేమ లేకపోవడం వల్ల కూడా కాదు. అది ఒక భవన నిర్మాణంతో ముడిపడింది. ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ తో ముడిపడింది. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం)కు తమ భవన నిర్మాణం ఓ కల. ఎందరో కళాకారులకు, సాంకేతిక నిపుణులకు నిలయమైన తమిళనాట అందరికీ ఉపయుక్తమైన ఒక భవనం లేకపోవడం అనే లోటు తీరేందుకు ఓ విశాలమైన వసతి కావాలని ఎందరో కోరుకున్నారు. చాలా సార్లు ఆ భవన నిర్మాణం ప్రతిపాదనలు వచ్చినా రకరకాల కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఈ నేపధ్యంలోనే కొత్త నడిగర్ సంఘంకు ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎంపికయ్యాడు. అంతేకాదు భవనం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని ఆయన హామీ ఇచ్చాడు.నడిగర్ సంఘం భవన నిర్మాణ ప్రాజెక్టు తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కార్యక్రమాలు కళాకారుల సమావేశాలకు ప్రత్యేక స్థలo లేకపోవడంతో ఈ భవనం నిర్మాణం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎట్టకేలకు కళాకారులకు ఉపయుక్తంగా ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక అత్యుత్తమ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు రజనీకాంత్ కమల్ హాసన్ దీనికి పునాదిరాళ్లు వేశారు. విజయ్ కమల్ హాసన్ లు తమ వ్యక్తిగత నిధుల నుంచి రూ.1 కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు, అలాగే మరో హీరో, నటుడు కార్తీ నిర్మాణాన్ని పర్యవేక్షించడంలో చురుకుగా పాల్గొన్నాడు, ఇలా ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ... ఈ భవనం పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. వ్యక్తిగతంగా భావోద్వేగాలను సైతం హీరో విశాల్ ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడిగా పెట్టాడని చెప్పొచ్చు. ఈ భవనం సాకారమయే వరకు తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయన తమందరి కల నెరవేరేదాకా పెళ్లి చేసుకోనని శపధం చేశాడు. ఏమైతేనేం.. చెన్నై నడిబొడ్డున టి. నగర్, హబీబుల్లా రోడ్లో ఈ భవనాన్ని చలనచిత్ర పరిశ్రమ వివిధ రకాల అవసరాలను తీర్చగల బహుళార్ధక సాధక సినీ కేంద్రంగా భవనం రూపుదిద్దుకుంది. ఇందులో అవార్డు ఫంక్షన్ల కోసం 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల వివాహ మందిరం, 300 సీట్ల చిన్న చిన్న సమావేశ మందిరాలు డిజైన్ చేశారు. భవనం దాదాపుగా సిద్ధమై ప్రతిజ్ఞ నెరవేరడంతో, విశాల్ పెళ్లికి సిద్ధమ్యాడు. నటి సాయి ధన్షికతో తన వివాహాన్ని ప్రకటించాడు, ఇది అన్ని రకాల ఊహాగానాలకు ముగింపు పలికింది. అయితే ఈ ప్రకటన వారి సన్నిహితులెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. వారిద్దరూ 15 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసనీ, బలమైన స్నేహ బంధాన్ని ప్రేమ గా మార్చుకున్నారని కూడా తెలుసు. ముఖ్యంగా తన జీవితంలోని కష్ట సమయాల్లో విశాల్ చూపిన అచంచలమైన మద్దతు తోడ్పాటును ధన్షిక చాలా కాలంగా ఆరాధించింది. పెళ్లి ప్రకటన సందర్భంగా విశాల్ తమ ఇద్దరి ప్రయాణం గురించి మాట్లాడాడు. తాను చేసిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ వివాహం గురించిప ఆలోచనను నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఆపిందని ఆయన అంగీకరించాడు తనను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ధన్షికను అభివర్ణించాడు ఇంత కాలం వేచి ఉన్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. -
విక్రమ్ సరసన క్రేజీ హీరోయిన్‌కు గోల్డెన్ ఛాన్స్
చిత్రపరిశ్రమలో వైవిధ్య భరిత కథాచిత్రాలకు కేరాఫ్ చియాన్ విక్రమ్. ఈయన తాను నటించే ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఇటీవల తంగలాన్, వీర ధీర సూరన్ చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా తాజాగా విక్రమ్ తన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మడోనా అశ్విన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు మండేలా, మావీరన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని శాంతి పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సంస్థ ఇంతకుముందు శివకార్తికేయన్ కథానాయకుడిగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా తాజాగా విక్రమ్ హీరోగా నిర్మించే చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో విక్రమ్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నటి ప్రియాంక మోహన్, అలాగే శ్రీనిధిశెట్టిలలో ఒకరు నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కాగా తాజాగా లక్కీ కథానాయకి మీనాక్షి చౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కన్నడ బ్యూటీ ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో మంచి రేసింగ్‌లో ఉన్నారు. ఈమె ఇంతకు ముందు తమిళ్, తెలుగు భాషల్లో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాగే వెంకటేష్ సరసన నటించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ప్రస్తుతం ఈమె క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. కాగా మరోసారి తమిళంలో విక్రమ్‌తో జత కట్టడానికి రెడీ అవుతారా? అన్నది వేచి చూడాలి. -
విజయ్ సేతుపతి 'ఏస్' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) థియేటర్స్‌లోకి వచ్చేసింది. రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రాన్ని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. మే 23న బి. శివ ప్రసాద్ భారీ ఎత్తున తెలుగులో రిలీజ్ చేశారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకుందాం.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు.అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందలు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు.ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? తనపై నమోదైన నేరాల నుంచి ఎలా బయటపడుతాడు..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?దర్శకుడు అరుముగకుమార్ కథ చెప్పడంలో ఒక ప్రత్యేకమైన శైలి తీసుకున్నాడు. సినిమాలోని పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోతారు. ప్రేక్షకుల ఊహకు అందేలానే కథనం సాగుతూ ఉన్నా కూడా ఎక్కడా అయితే బోర్ కొట్టదు. విజయ్ సేతుపతి డార్క్ కామెడీ, యోగిబాబు టైమింగ్, రుక్మిణి వసంత్ అందాలు ఆ లోపాల్ని కప్పి పుచ్చేస్తుంటాయి. అలా సినిమాను ఎంగేజింగ్‌గా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా నెమ్మదిగా సాగే మొదటి అర్ధభాగం కాస్త నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత కథ స్పీడ్ అందుకుంటుంది. ప్రథమార్దం అంతా కథలోని పాత్రలను పరిచయం చేసేందుకే సరిపోతుంది. అసలు కథ మొదలు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే హీరో తన వారి కోసం విలన్ డెన్‌కు ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి జోరు అందుకుంటుంది. బ్యాంక్‌లో దొంగిలించిన సొమ్ముతో హీరో ఎలా బయటపడతాడు..? ఆ నేరాల్లోంచి ఎలా తప్పించుకుంటాడు..? అనే పాయింట్లతో సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్ తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో హీరో చేత డైరెక్టర్ ఆడించే ఆట, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారంటే..?ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. బోల్ట్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. కేవలం ఆయన మాత్రమే చేయగలడు అనేలా పాత్ర ఉంటుంది. మొదటి సారి డార్క్ కామెడీని ఆయన పండించాడు. ఇక యోగి బాబు అయితే ఫుల్ లెన్త్గా నవ్విస్తాడు. రుక్మిణి వసంత్ ఇందులో తన గ్లామర్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. దివ్యా పిళ్లైకి ఓ మంచి పాత్ర దక్కింది. అవినాష్ విలనిజం మెప్పిస్తుంది. సాంకేతిక పరంగా కూడా సినిమా బాగుంటుంది. కెమెరామెన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. పాటలకు పెద్దగా కనెక్ట్ కాకున్నప్పటికీ మ్యూజిక్ బాగుంది. శామ్ సీఎస్ ఆర్ఆర్ మెప్పిస్తుంది. కాస్త ఎడిటింగ్‌లో మార్పులు చేసింటే ఇంకా బాగుండేది. విజయ్ సేతుపతి కోసం సినిమా చూడొచ్చు. ఎక్కడా కూడా ఎవరినీ నిరుత్సాహపరచడు. -
పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ (2024) సినిమా విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ, ఆయన తదుపరి చిత్రంపై స్పష్టత లేకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో అల్లు అర్జున్‌తో పాన్-ఇండియా చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు 2026 వరకు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో, త్రివిక్రమ్ సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్లు మొన్నటిదాక ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం ఉండకపోవచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. బన్నీ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టి రామ్ చరణ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. వెంకీ చిత్రం తర్వాత...బన్నీ సినిమా వాయిదా పడడంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్‌లో విక్టరీ వెంకటేశ్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట. ఈ చిత్రం కథా చర్చలు పూర్తయి, మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరిగేలా లేదు. త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టుని పూర్తిగా పక్కకు పెట్టేసి.. రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.పవన్ కోసం..పవన్ కల్యాణ్ చొరవతో రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఓ క్రేజీ కథను రెడీ చేశాడట. ఇటీవల ఈ కథను చరణ్‌కు చెప్పి ఒప్పించారట. ఈ చిత్రానికి త్రివిక్రమ్ సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. పెద్ది చిత్రం పూర్తయిన వెంటనే చరణ్ త్రివిక్రమ్ సినిమాని సెట్స్‌పైకి వెళ్తుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సుక్కు మూవీకి బ్రేక్!వాస్తవానికి పెద్ది తర్వాత చరణ్ .. సుకుమార్‌తో సినిమా చేయాల్సింది. ఇటీవల సుకుమార్ కూడా తన తదుపరి సినిమా చరణ్‌తోనే అని ప్రకటించాడు. కానీ పవన్ కల్యాణ్ కారణంగా చరణ్.. సుక్కు ప్రాజెక్టుని పక్కకు పెట్టి..త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం తర్వాత సుకుమార్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి సుక్కు అంతకాలం వెయిట్ చేస్తాడా లేదా మధ్యలో మరో హీరోని చూస్కొని సినిమా చేస్తాడా అనేది తెలియాల్సింది. -
థియేటర్స్‌లో వాటి ధరలు తగ్గిస్తే బెటర్: ఎస్కేఎన్
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మే 31వ తేదీ నుంచి బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం, జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేయబడతాయి. తాజాగా నిర్మాత ఎస్కేఎన్ ఈ అంశంపై స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్ వేడుకలో ఆయన పలు అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. చిత్రపరిశ్రమ ఐసీయూలో ఉందని, ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.'సినిమా పర్సంటేజీల విధానం కంటే మనం ముందు ప్రేక్షకులను థియేటర్స్ రప్పించాలి. ఈ విషయంలో వారి నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు థియేటర్స్‌లో దొరికే తినుబండారాల ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. సినీ పెద్దలు వీటిపై దృష్టి పెట్టాలి. ఆపై ఓటీటీల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. రెండు వారాల్లో ఎటూ ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. ఉదయం ఆటకు వచ్చే ఆడియన్స్ భారీగా తగ్గిపోతున్నారు. కేవలం ఈవెనింగ్ షో, వీకెండ్స్‌లలో మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్‌కు బాగా వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి మాములు రోజుల్లో టికెట్ ధరలు తగ్గించడం, వీకెండ్స్‌లో ధరలు పెంచడం వంటి విధానంపై ఆలోచన చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.' అని ఆయన గుర్తుచేశారు.సినిమా థియేటర్ల నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని, అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం ద్వారా తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. తమకు మల్టీప్లెక్స్ తరహాలోనే వచ్చే ఆదాయంలో పర్సెంటేజీ విధానాన్ని అమలుచేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. అలా చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అలా పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతే సినిమా పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఎస్కేఎన్ అభిప్రాయపడ్డారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఘటికాచలం' ట్రైలర్
తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అందుకుని అందరి అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతాయి. అలాంటి అంచనాలతో వస్తున్న చిత్రం 'ఘటికాచలం'.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినట్లు అర్ధం అవుతుంది. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మూవీలో నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
ACE X review: విజయ్ సేతుపతి ‘ఏస్’ మూవీ టాక్ ఎలా ఉందంటే..?
వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏస్’(ACE). దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టాలీవుడ్లో కూడా విజయ్ సేతుపతి ప్రమోషన్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు(ACE Review). (చదవండి: డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ భైరవం’)ఇలా ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ్నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఫస్డ్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘ఏస్’ సినిమా ఎలా ఉంది? విజయ్ సేతుపతి ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండిఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్ ఫిల్మ్ అని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. What a delightful entertainer! #ACE is just what I was craving for. A pleasant, funny simple entertainer that has loads of action, romance and comedy! A film that truly makes you forget the pressures of life and relax for a good three hours. @VijaySethuOffl looks smart, having… pic.twitter.com/QVa4hM7TdK— Cineobserver (@cineobserver) May 22, 2025 ‘ఏస్’ ఓ కామెడీ ఎంటర్టైనర్. కడుపుబ్బా నవ్విస్తుంది. యాక్షన్, రొమాన్స్ కూడా కూడా ఆకట్టుకుంటాయి. లైఫ్‌లో అన్ని ఒత్తిళ్లను మరిచిపోయి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. విజయ్ సేతుపతి తెరపై చాలా స్మార్ట్‌గా కనిపించాడు. యాక్టింగ్ నీట్‌గా ఉంది. రుక్మిని వసంత్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. యోగిబాబు కామెడీ అదిరిపోయింది’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. #ACE [4/5] – A fun comedy-heist set in Malaysia!@VijaySethuOffl delivers both mass & class moments.@iyogibabu is in top form – his chemistry with VJS is a blast!@rukminitweets does her part well.@samcsmusic's BGM fits perfectly.@Aaru_Dir delivers a clever entertainer for… pic.twitter.com/BpBWTT3AvJ— CinemaNagaram (@CinemaNagaram) May 22, 2025 మలేషియాలో జరిగే దోపిడి ఆధారంగా నడిచే కామెడీ చిత్రమిది. విజయ్ సేతుపతి మాస్ క్లాస్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతితో కలిసి యోగి బాబు చేసిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. రుక్మిణి వసంత్ తన పాత్రకు న్యాయం చేసింది. సామ్ సీఎస్ బీజీఎం బాగుంది.అర్ముగ కుమార్ ఇంటెలిజెంట్ రైటింగ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.#ACE Vijay Sethupathi and Yogi Babu carried the movie entirely. It was funny and intelligent about how an unknown lands in Malaysia and pulls off a chaotic heist by misleading police and loan sharks. It has good chances to get a sequel.Rukmini was cute and so was their love story— Procrastinator (@BagaCoolAipoyam) May 23, 2025@VijaySethuOfflன் #ACE ஒரு பரபரப்பான ரொமான்டிக் க்ரைம் காமெடி. மலேசியாவில் படமாக்கப்பட்ட இப்படத்தில் விஜய் & @iYogiBabuவின் கெமிஸ்ட்ரி, ஆக்ஷன், காமெடி, ரொமான்ஸ் கலந்து ரசிகர்களை கவர்கிறது. இயக்குனர் @Aaru_Dirன் புதுமையான கதைக்களம் பாராட்டுக்குரியது. #MovieReview #RukminiVasanth pic.twitter.com/V3jNnixC68— Ranjith (@RanjithAnthony) May 23, 2025#AceFirs & foremost the movie did not bore or cringe at any point.The movie just needed better staging & execution, was feeling like watching film that should have come 10 years back(KTv Movies).@VijaySethuOffl & #YogiBabu managed to evoke laughter at intervals,#RukminiVasanth… pic.twitter.com/s4LnPOEGUl— Jiya Rahman (@jiyathedon) May 23, 2025 -
డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ భైరవం’
‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్‌పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్‌కాట్ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?ఆ డైలాగ్ అవసరమా?మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించింది. అయితే ఆ స్టేజ్‌పై దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేశాడు. దీంతో వైఎస్సార్సీసీ శ్రేణులు విజయ్ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్‌కాట్ భైరవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్లో వైరల్ చేస్తున్నారు. విజయ్ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్‌పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విజయ్ పెట్టిన ఒక పోస్టే.No apology will make up for these filthy acts. Unanimously #BoycottBhairavam and TFI should call for a ban on this director, #VijayKanakamedala. Anyone who books a ticket for this film isn’t just insulting the stars, they’re disrespecting the entire art of cinema. pic.twitter.com/ynpUYmF9Gd— At Theatres (@attheatres) May 22, 2025కొంపముంచిన ‘ఛా’విజయ్ కనకమేడల ఫేస్బుక్లో 2011లో చిరంజీవి, రామ్ చరణ్‌లపై ఒక పోస్ట్ పెట్టాడు. హిందీలో అమితాబ్, అభిషేక్ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్ని మార్పింగ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్‌కి ‘ఛా’ అనే టైటిల్ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్ చరణ్‌లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు.హ్యాక్ అయిందా? అదేలా?సోషల్ మీడియాలో బాయికాట్ భైరవం ట్యాగ్ ట్రెండ్ కావడంలో విజయ్ కనకమేడల దీనిపై రియాక్ట్ అయ్యాడు. ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, హ్యాక్ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్ మాత్రం హ్యాకింగ్ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్‌ని ఎలా హ్యాక్ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్‌బుక్‌ని చెక్ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.Mr. అతి @DirVijayK మాట పొదుపు గా ఉండాలి , చేతలకి అదుపు ఉండాలి 🤬🤬#BoycottBHAIRAVAM pic.twitter.com/1YFBJmPBQv— Aravind Reddy (@AravindOnAir) May 23, 2025 నమస్కారం అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025#Hacked #Tollywood #director #BoycottBHAIRAVAM #dengey #megadogs #mogga pic.twitter.com/NPM4jtyhQl— 𝔾𝕙𝕠𝕤𝕥ℝ𝕚𝕕𝕖𝕣🐉 (@yashwanthpotter) May 23, 2025 -
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తండ్రి అయ్యాడు. గురువారం(మే 22) ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.‘మగబిడ్డ పుట్టాడు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్యూ రహస్య. జై శ్రీరామ్'' అని కిరణ్ అబ్బవరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తన బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఇందులో కిరణ్ తన కుమారుడి చిట్టి పాదాలను ముద్దాడుతూ కనిపించారు.కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు బాబు పుట్టినట్లు తెలిపారు. దీంతో అభిమానులు కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు.ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
ఈ ప్రేమ చాలా విలువైనది: ఎన్టీఆర్
‘‘వార్ 2’ టీజర్‌కి ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నేను నటుణ్ణి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రేమ లభించడం ఒక వరంలా అనిపిస్తోంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందిస్తూ– ‘‘వార్ 2’లో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. యూనిట్ అంతా సరదాగా కలిసి పని చేశాం. థియేటర్లో మీ స్పందన చూడటానికి నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ‘వార్ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి ఉప్పొంగిపోయాను. టీజర్ ఇంతటి ప్రభావం చూపించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
నేను ద్రోణాచార్య కాదు.. విద్యార్థినే: కమల్‌హాసన్
‘‘నేను మనసు పెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ‘థగ్ లైఫ్’ కూడా మనసుపెట్టి చేసిన సినిమా. అద్భుతమైన టీమ్‌తో పని చేశాను. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. మణిరత్నంగారు, నా కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ చిత్రం కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద విజయం సాధిస్తుంది... ఇది నాప్రామిస్’’ అని కమల్‌హాసన్ చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలుపోషించారు.రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా మీట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నన్ను ద్రోణాచార్యతోపోల్చారు. కానీ, కాదు... ఇప్పటికీ విద్యార్థినే. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మణిరత్నంగారి సినిమాలో నేను యాక్ట్ చేయను... జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం.సినిమాని ఎప్పుడు కూడా భుజాలపై మోస్తాం. నేను తెలుగులోనే స్టార్‌గా ఎదిగాను. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ– ‘‘నాయకుడు’ తర్వాత ఇన్నేళ్లకు కమల్‌గారితో ‘థగ్ లైఫ్’ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడికి సపోర్ట్ చేసే హీరో ఆయన’’ అని తెలిపారు. ‘‘నేను ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.‘థగ్ లైఫ్’ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నటి సుహాసినీ మణిరత్నం పేర్కొన్నారు. ‘‘మణిరత్నంగారి క్రమశిక్షణ, టైమింగ్ అద్భుతం. కమల్‌గారితో వర్క్ చేయడం గొప్ప అనుభూతి’’ అన్నారు శింబు. ‘‘మణిరత్నం, కమల్హాసన్గార్లతో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని త్రిష చెప్పారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత కమల్ సార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అన్నారు. -
విలేజ్‌లో పెద్ది యాక్షన్
విలేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పెద్ది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం‘పెద్ది’. ఈ మల్టీస్పోర్ట్స్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రోడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో ఓ భారీ విలేజ్ సెట్‌ని ‘పెద్ది’ సినిమా కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సెట్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు మేకర్స్. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను ‘ఇన్ స్టా’లో షేర్ చేశారు రామ్‌చరణ్. ‘‘ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ షెడ్యూల్‌తో కీలక దశకు చేరుకుంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ విడుదల కానుంది. -
గ్లిజరిన్ లేకుండా సహజంగా నటించాం: ఆకాంక్షా సింగ్
‘‘తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా చేస్తున్న సమయంలో మా నాన్న గుర్తొచ్చారు. ఆయన్ని నేను చాలా మిస్ అయ్యాను. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడాల్సిన చిత్రమిది. తల్లిదండ్రులను ప్రేమించండి... వారితో ఎక్కువ సమయాన్ని గడపండి’’ అని హీరోయిన్ ఆకాంక్షా సింగ్ తెలిపారు. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో హీరో రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆకాంక్షా సింగ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’లో జానకి అనే గ్రామీణ అమ్మాయి పాత్ర చేశాను. అచ్చమైన తెలుగమ్మాయిలా లంగా ఓణిలో స్క్రీన్‌పై కనిపించడం నాకిదే తొలిసారి. ఇక ‘బెంచ్ లైఫ్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారితో నటించాను. ఇప్పుడు ‘షష్టిపూర్తి’లో చేశాను. మేమిద్దరం ఎప్పుడు కలిసి నటించినా భావోద్వేగ సన్నివేశాల కోసం గ్లిజరిన్ వాడలేదు. సహజంగానే నటించేస్తాం. కథ, పాత్ర నచ్చితే వెబ్ సిరీస్‌లో అయినా నటిస్తాను. యాక్షన్ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాను. తమిళంలో ఒక సినిమా ఒప్పుకున్నాను’’ అని తెలిపారు. -
విశ్వంభర బుక్‌లో ఏముంది?
‘విశ్వంభర’ బుక్‌లో ఏముంది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు నిర్మాత విక్రమ్ రెడ్డి. చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. టాప్ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిపోస్ట్ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘విశ్వంభర’ సినిమాకు చెందిన బుక్‌ను రిలీజ్ చేశారు ఈ చిత్రనిర్మాత విక్రమ్ రెడ్డి. అలాగే కాన్స్‌లోని భారత పెవిలియన్‌లో ‘విశ్వంభర’ సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు, వీఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారం గురించిన పలు విశేషాలను ఆయన తెలిపారు. కీరవాణిగారు అద్భుతమైన మ్యాజిక్, ఆర్ఆర్ అందించారని, ఛోటా కె. నాయుడు విజువల్స్ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో..భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ ‘కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ టైటిల్ రోల్లో నటించనున్న ఈ బయోపిక్కు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, టీ– సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.‘కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ సినిమాను ప్రకటించిన తర్వాత, ఈ సినిమాను గురించి కాన్స్‌లోని భారత్ పెవిలియన్‌లో ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడారు. ‘‘ఏపీజే అబ్దుల్ కలాంగారి జీవితం ప్రపంచవ్యాప్త యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన బయోపిక్‌ను తెరకెక్కడం బాధ్యతతో కూడిన సవాల్లాంటింది’’ అని పేర్కొన్నారు ఓం రౌత్. ‘‘ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందుకు గౌరవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు అభిషేక్ అగర్వాల్.సోనమ్.. ఓ హాట్ టాపిక్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది బొమ్మ ఉన్న నెక్లెస్‌ను ధరించి, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై చర్చనీయాంశమయ్యారు రాజస్థాన్ నటి–మోడల్ రుచి గుజ్జర్. ఈ విషయాన్ని మరవక ముందే ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ సోనమ్ చబ్రా ధరించిన కాస్ట్యూమ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చర్చనీయాంశమైంది. సోనమ్ చబ్రా డ్రెస్‌పై భారతదేశంపై జరిగిన ఉగ్రదాడుల (ఇటీవల జరిగిన పహల్గాం, గతంలో జరిగిన ఉరి, పుల్వామా..’) పేర్లు ఉన్నాయి.అలాగే ఐశ్వర్యా రాయ్ 22వ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఐశ్వర్యా రాయ్ నుదుట సిందూర్ హైలైట్ అయ్యేలా ఉంది. ‘ఆపరేషన్ సిందూర్’ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇలా ఐశ్వర్యా రాయ్ సిందూరం ధరించారనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఇంకా భారతీయ నటి అదితీరావ్ హైదరీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. -
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా...
హీరోకి గాయం... షూటింగ్‌కి బ్రేక్ ఆర్టిస్ట్ డేట్స్ సర్దుబాటు కాలేదు... షూటింగ్ లేట్ సినిమాకి అనుకున్న థియేటర్లు అమరలేదు... రిలీజ్ పోస్ట్‌పోన్ ఒక సినిమా మేలు కోరి ఇంకో సినిమా వెనక్కి తగ్గితే... విడుదల వాయిదా... కారణం ఏదైనా కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లకు రావు. వాయిదా పడుతుంటాయి. ఇలాంటప్పుడే లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తా అని రజనీకాంత్ ‘బాషా’లో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంటుంది. అలా లేట్ అయిన సినిమాలన్నీ లేటెస్ట్గా వస్తాయని ఊహించవచ్చు. ఇక... విడుదల వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం. తనయుడి కోసం... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలుపోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ సపై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్‌ని కూడా శరవేగంగా జరిపారు.చిరంజీవి ఎలాగైనా సంక్రాంతి బరిలో దిగుతారని అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినిమా అభిమానులు అనుకున్నారు. కట్ చేస్తే... తనయుడు రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదల వాయిదా వేశాం’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే మే 9న ఈ సినిమా విడుదలకానుందనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండటంతో ఆ తేదీకి రిలీజ్ కాలేదు. కాగా జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం 2002 జూలై 24న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ పరంగానూ ఆ డేట్ కలిసొచ్చే అవకాశం ఉండటంతో చిత్రయూనిట్ జూలై 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఏదిఏమైనా కొత్త విడుదల తేదీపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండక తప్పదు. రాజా సాబ్ వచ్చేదెప్పుడు?రాజా సాబ్ రాక కోసం అటు ప్రభాస్ అభిమానులు ఇటు సగటు సినిమా ప్రేమికులు వేచి చూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.అది కూడా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడినప్పటికీ కొత్త విడుదల ఎప్పుడు? అన్నది మాత్రం చిత్రబృందం ఇప్పటివరకూ ప్రకటించ లేదు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని టాక్.చారిత్రక యోధుడు వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలుపోషించారు. చారి్రతక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్ సపై ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా, 2025లోనూ రెండు స్లారు రిలీజ్ వాయిదా పడింది.ఈ ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన యూనిట్.. ఆ తేదీకి వాయిదా వేసి, మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీకి కూడా విడుదల కాలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నందున మే 9 నుంచి జూన్ 12కి విడుదలను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసారి ఎలాగైనా ఈ తేదీకే రిలీజ్ చేసేందుకు ప్రమోషన్స్‌ని కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మాస్ ఎంటర్టైనర్వెండితెరపై తనదైన శైలిలో మాస్ జాతరని ప్రేక్షకులకు చూపించనున్నారు రవితేజ. అయితే ఆ సమయం ఎప్పుడు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. (మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్). భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు 2025 మే 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే ఈ నెల 9న విడుదల కాలేదు.రిలీజ్‌ని వాయిదా వేసిన చిత్రబృందం కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించ లేదు. దీంతో రవితేజ అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రవితేజ భుజానికి గాయం కావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఈ కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయింది. అయితే మేజర్ టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ శ్రీలీల కూడా ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్. అయితే జూలైలో ‘మాస్ జాతర’ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల జరిగిన ఓ ప్రెస్మీట్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చె΄్పారు. ఆయన విడుదల తేదీ ప్రకటించనప్పటికీ జూలై 18న రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. భక్తి పరవశంవిష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర కీలక పాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు మేకర్స్.అయితే వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం వల్ల రిలీజ్‌ని జూన్ 27కి వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్‌కి సంబంధించినపోస్టర్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయించింది యూనిట్. మహాశివుడికి వీర భక్తుడైన కన్నప్ప కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా, తనయుడు అవ్రామ్ భక్త వెండితెరపై ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగానే కాదు.. అమెరికాలోనూ విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మంచు విష్ణు అండ్ టీమ్. పీరియాడికల్ నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల కాలేదు. ఆ తర్వాత మే 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ డేట్ కూడా జూలై 4కి వాయిదా పడింది. ‘‘కింగ్డమ్’ని ముందుగా అనుకున్నట్టు మే 30న రిలీజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు (ఆపరేషన్ సిందూర్) జరిగాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్ స, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని ఆయన తెలిపారు. అక్కా తమ్ముడి అనుబంధం నితిన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలుగా నటించారు. నటి లయ కీలక పాత్ర చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే ఆ తేదీకి వాయిదా పడిన ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రయూనిట్. అక్క– తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న కథతో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. ఇందులో క్రీడా నేపథ్య అంశాలు కూడా ఉంటాయని, ఆర్చరీ ఆటగాడిగా నితిన్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సలో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వాయిదా పడి, చివరికి జూలై 4కి రాబోతోంది. అదే తేదీకి విడుదలకు సిద్ధమైన నితిన్ ‘తమ్ముడు’ మరోసారి వాయిదా పడుతుందా? లేక విడుదలవుతుందా? అనేది వేచి చూడాల్సిందే. పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి.. మరికొన్ని జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
మన దేశానికి వచ్చేస్తున్న యూనివర్సల్ స్టూడియోస్, ఆ ప్రాంతం ఇక సరికొత్త సినిమా క్యాపిటల్, ఎక్కడంటే?
హాలీవుడ్ సినిమాలతో బాగా అనుబంధం ఉన్నవారికి యూనివర్సల్ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నది యూనివర్సల్ స్టూడియోలోనే. ప్రపంచ సినీరంగానికి యూనివర్సల్ స్టూడియో అనేది ఒక డ్రీమ్ మేకింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలనుకున్న ప్రతీ టెక్నీషియన్ కల యూనివర్సల్ స్టూడియో. ఈ నేపధ్యంలో భారతీయ సినిమా రంగానికి సినీ అభిమానులకు చెప్పుకోదగ్గ శుభవార్త ఏమిటంటే, మన దగ్గర త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. అవును...నిజం...భారతదేశం త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్‌ను స్వాగతించబోతోంది. ఈ ప్రపంచ వినోద దిగ్గజం త్వరలో ప్రపంచ స్థాయి థీమ్పార్క్తో సహా భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. త్వరలోనే సినీ రూపకర్తల కల సాకారం కానుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో యూనివర్సల్ స్టూడియోస్ పార్క్ ఉన్న కొన్ని దేశాలలో ఒకటిగా అవతరించనుంది. ప్రస్తుతం ఈ థీమ్ పార్క్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, సింగపూర్, చైనా దేశాల్లో మాత్రమే ఉంది.అందుతున్న సమాచారం ప్రకారం, భారతదేశంలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ త్వరలో హర్యానాలోని ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఢిల్లీ నుంచి కొంచెం దూరంలో నెలకొల్పనున్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, ఈ పార్క్ గురుగ్రామ్ రూపురేఖల్ని మార్చేయనున్న ప్రాజెక్ట్ కానుంది. హర్యానా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (హెచ్ఎస్ ఐఐడిసి) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి, ఇప్పటికే సైట్ చుట్టూ మౌలిక సదుపాయాల ప్రణాళికల అమలు కూడా ప్రారంభించింది. ఇది రాబోయే 3 మిలియన్ చదరపు అడుగుల మాల్ లోపల అభివృద్ధి చేయబడిన ఇండోర్ థీమ్ పార్క్ అవుతుంది. మీడియా నివేదికల ప్రకారం, వినోద ఉద్యానవనాన్ని నిర్మించడానికి భారతి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఇక్కడ 300,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంటుందని తెలుస్తోంది. భారతదేశంలో ప్రారంభమవుతున్న ఈ అత్యంత భారీ పార్క్‌లో ఒసాకా హాలీవుడ్లో ఉన్నట్లుగా థీమ్ , రైడ్లు, షోలు కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ ఆకర్షణలు ఉంటాయి. మన దేశానికి యూనివర్సల్ స్టూడియోస్ రాక ఉపాధి రంగానికి కూడా ఊతమిచ్చే శుభవార్త అనే చెప్పాలి. ఈ పార్క్ అనేక రకాల ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. దీని చుట్టుపక్కల ప్రాంతంలో హోటళ్ళు, రవాణా సేవలు షాపింగ్ కేంద్రాలు తదితర వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరం అవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం సరికొత్త సినిమా క్యాపిటల్‌గా అవతరించినా ఆశ్చర్యం లేదు. గురుగ్రామ్‌లోని ఈ స్థలం అటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో మార్గాలు ఇటు మరి కొన్ని ప్రధాన రహదారులకు సులభమైన కనెక్టివిటీని అందిస్తుంది. నిజానికి యూనివర్సల్ స్టూడియోస్ భారతదేశంలో తన తొలి అడుగు వేసేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఇదీ ఒక కారణమే. -
అబ్దుల్ కలామ్ బయోపిక్‌లో ధనుష్.. పోస్టర్ విడుదల
జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి ‘కలాం’ అనే టైటిల్‌తో పాటు "ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే ట్యాగ్‌లైన్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.ఈ భారీ ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లతో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించిన ‘కలాం’ సినిమా టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. డాక్టర్ కలాం సిల్హౌట్‌తో పాటు, ఒక మిస్సైల్ చిత్రం ఆవిష్కరణాత్మకంగా రూపొందించబడింది, ఇది ఆయన భారత మిస్సైల్ టెక్నాలజీకి చేసిన కృషిని సూచిస్తుంది.భారతీయ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరిగా గుర్తింపు పొందిన ధనుష్, డాక్టర్ కలాం పాత్రను పోషించేందుకు చాలా ఫిజికల్ బాడీ ట్రాన్స్ ఫర్ మిషన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించినా ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటించబడనున్నాయి. ఈ చిత్రం డాక్టర్ కలాం జీవితాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప సినిమాగా రూపొందనుంది. -
మైసూర్ శాండల్‌తో తమన్నా ఢీల్‌పై విమర్శలు.. మంత్రి వివరణ
నటి తమన్నా భాటియాను ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ఐకానిక్ మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే, ఈ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక బ్రాండ్‌గా ఉన్న మైసూర్ శాండల్ సబ్బుకు ప్రాతినిధ్యం వహించడానికి స్థానిక నటుడిని ఎందుకు ఎంపిక చేయలేదని కన్నడిగులు ప్రశ్నించారు.ఈ వ్యతిరేకతను ప్రస్తావిస్తూ.. కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుత మార్కెట్లో పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయంటూ.. ఈ నిర్ణయాన్ని సమర్థించారు. కన్నడ చిత్ర పరిశ్రమపై తమకు అత్యంత గౌరవం ఉందన్నారు. కానీ, కెఎస్‌డిఎల్ సంస్థ కర్ణాటకను దాటి తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే తాము పాన్-ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా ఎంపిక చేశామన్నారు.తమన్నా ఎందుకు?మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను ఎంచుకోవడం వెనుక నాలుగు ముఖ్య కారణాలను మంత్రి వివరించారు.పాన్-ఇండియా రేంజ్లో గుర్తింపు: తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటించారు. జాతీయ స్థాయి మార్కెట్లో ఆమెకు గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే మరింతగా విస్తరించవచ్చు.మార్కెట్ విస్తరణ: KSDL కర్ణాటకేతర ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతదేశంలో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రొఫెషనల్ బ్రాండింగ్ అనుభవం: తమన్నాకు హై-ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్‌కేర్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడిర్‌గా పనిచేశారు. ఆమెకు ఈ విషయంలో అనుభవం ఉంది. ఆమె ద్వారా సులువుగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యాప్తి చెందొచ్చు.బోర్డు ఆమోదం: తమన్నా ఎంపికను మార్కెటింగ్ నిపుణుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా మాత్రమే తీసుకున్నారు. అందుకు PSU డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదించింది.రూ. 6.2 కోట్ల డీల్కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తయారు చేస్తున్న మైసూరు శాండల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా నియమించబడ్డారు. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు ఉంటుంది. ఇందుకోసం ఆమెకు రూ. 6.2 కోట్ల భారీ మొత్తం కర్ణాటక చెల్లించనున్నట్లు సమాచారం.కర్ణాటకకు గుర్తింపుగా ఉన్న మైసూరు శాండల్ సోప్‌కు ఒక కన్నడ స్టార్‌ను ఎంపికి చేసుంటే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి. ప్రాతీయ గుర్తింపును ప్రోత్సహించడంలో విఫలం అయ్యారని చెబుతున్నారు. కర్ణాటకతో వందేళ్ల అనుబంధం ఉన్న ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కన్నడ నటిని కాకుండా మరొక ప్రాంత నటిని తీసుకోవడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రతిస్పందనగా, ప్రభుత్వం ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార లక్ష్యాలను అందుకునే వ్యూహాత్మకతలో భాగమని పేర్కొంది. KSDL has deepest respects and regards for Kannada Film Industry. Some Kannada Movies are giving competition to even Bollywood movies. Mysore sandal has a very good brand recall within Karnataka. Which shall be strengthened. However the intent of Mysore Sandal is to also… https://t.co/qnXe3MyJYn— M B Patil (@MBPatil) May 22, 2025 -
వెయ్యి కోట్ల స్కామ్.. వాళ్ల 'నైట్ పార్టీలకు' వెళ్లిన కయాదు లోహర్
అస్సాం బ్యూటీ కయాదు లోహర్ చిక్కుల్లో పడేలా ఉంది. డ్రాగన్ సినిమా విజయంతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ అయిపోయిన ఆమెకు ఈడీ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో సంచలనంరేపిన టాస్మాక్ కుంభకోణంలో పాల్గొన్న వారు నిర్వహించిన 'నైట్ పార్టీ'కి ఆమె వెల్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో ఆమె పాల్గొనేందుకు రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టాస్మాక్ కుంభకోణం విషయంలో తమిళనాడు వ్యాప్తంగా కొద్దిరోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కయూదు లోహర్ పేరు తెరపైకి వచ్చింది.టాస్మాక్ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో లోహర్ పేరు బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకుగాను నటికి రూ.35 లక్షలు చెల్లించినట్లు ఒప్పుకున్నారట. అందుకు సంబంధించిన అధారాలు కూడా అందించారట. తమిళనాడు మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అక్కడి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ఆరోపణలపై కయాదు లోహర్ ఇంకా స్పందించలేదు.రూ. 1000 కోట్ల స్కామ్తమిళనాడులో సుమారు రూ. 1000 కోట్లకు పైగా మద్యం స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణకు ఎంట్రీ ఇచ్చారు. అయితే, టాస్మాక్ అధికారులు అందుకు సహకరించకపోవడంతో వారి ఇళ్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నటి కయాదు లోహర్ పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేటు మద్యం ఫ్యాక్టరీలు, ప్రభుత్వ ముఖ్య అధికారులు వంటి చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఆపై టాస్మాక్‌లో రూ.1000 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఈడీ తెలిపింది.సినీ నిర్మాత నివాసంలో సోదాలుప్రముఖ సినీ నిర్మాత ఆకాష్ భాస్కరన్ ఇంట్లో కొద్దిరోజుల క్రితమే ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ స్కామ్‌లో సినిమా పరిశ్రమకు కూడా లింకులు ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న ఆకాష్ భాస్కరన్ సహాయ డెరెక్టరుగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. అలా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే, భాస్కరన్‌కు ఉదయనిధికి మధ్య మంచి స్నేహం ఉందని తమిళ మీడియా పేర్కొంటుంది. -
సల్మాన్ ఖాన్ ఇల్లు మరోసారి టార్గెట్ అయిందా..?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో ఎప్పుడూ పలు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన ఇంట్లోకి చొరబడిని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన జరిగిన రెండురోజుల తర్వాత పోలీసులు ప్రకటించారు. అయితే, తనని విచారిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుమార్లు సల్మాన్ ఇంటి వద్ద ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.ముంబైలోని సల్మాన్‌కు చెందిన గెలాక్సీ అపార్ట్మెంట్లోకి చొరబడిన వ్యక్తి పేరు జితేంద్ర కుమార్ సింగ్ అని పోలీసులు ప్రకటించారు. అయతే, తను సల్మాన్‌ను కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు ఇలా తెలిపారు. ' రెండురోజుల క్రితం సల్మాన్ ఇంటిముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేంద్రను భద్రతా సిబ్బంది మొదట హెచ్చరించించి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బందితో గొడవపెట్టుకుని తన ఫోన్‌ను విసిరేశాడు. అయితే, అదేరోజు సాయింత్రం మళ్లీ సల్మాన్ ఇంటి వద్ద అతను మరో వ్యక్తితో కనిపించాడు. ఒకరు బయట ఉన్న సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంటన్నట్లు గేమ్ ప్లాన్ చేయగా సల్మాన్ ఇంట్లోకి జితేంద్ర వెళ్లే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ తనను అడ్డుకుని ముంబై పోలీసులకు అప్పజెప్పారు.' అని వారు తెలిపారు. అయితే, పోలీసుల విచారణలో సల్మాన్‌ఖాన్‌ను కలవాలనుకుంటున్నానని జితేంద్ర చెప్పాడు. అడిగితే అనుమతి లేదని చెప్పడంతో ఇలాంటి పనిచేశానని తెలిపాడు. జితేంద్రపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.కొంతకాలంగా సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు భద్రత కల్పించారు. -
ఓటీటీలో 'సారంగపాణి జాతకం'.. ఎలా ఉందో తెలుసుకోండి..?
'సారంగపాణి జాతకం' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ.. ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా తన జాతకం చూసుకోనుంది.ప్రియదర్శికి ఈ సినిమా మరింత గుర్తింపును తెచ్చింది. మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే 'సారంగపాణి జాతకం' అని చెప్పవచ్చు. మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. థియేటర్లో విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో కాస్త ఆసక్తిని కలిగించే అంశం అని చెప్పవచ్చు. కథలో అనవసరమై డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేర్చకుండా మంచి కామెడీతో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. అయితే, స్టోరీని ముందే అంచనా వేసేలా ఉండటంతో ఆశించినంత విజయాన్ని అందుకోలేదని చెప్పవచ్చు.సారంగపాణి జాతకం కథ ఇదేసారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్‌తో స్కెచ్ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే. -
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. శుభం మూవీతో ఓ చిన్న పాత్రలో కనిపించిన సామ్.. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలోనే సమంత టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంది. ఈ ఈవెంట్లో సమంత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జర్నీని తలచుకుంటూ ఎమోషనలైంది సామ్.తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన సినిమా అవార్డ్ ఈవెంట్లో మెరిసింది సమంత. ఈ ఈవెంట్లో 15 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న సమంతను ప్రత్యేకమైన అవార్డ్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా సమంత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తెలుగు సినిమా పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది.. ఇదే నా కర్మ భూమి అంటూ భావోద్వేగ ప్రకటన చేసింది. ఇదే ఈవెంట్‌కు హాజరైన అక్కినేని అమల.. సమంతను కొనియాడుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇది చూసిన అభిమానులు అక్కినేని అమల తన మాజీ కోడలికి అభినందనలు తెలిపారంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'యే మాయ చేసావే' చిత్రంతో సమంత రూత్ టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, కత్తి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2018లో అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సమంత ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకుంది. గతేడాది నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. -
‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నేడు(మే 23) ఇది తెలుగులో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్ 2’ చిత్రం అవుతుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్ చేసిన న్యాయ పోరుని హైలెట్ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న శంకరన్ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్ సింగ్ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్, మెక్కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్‌వాలాబాగ్ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్ నేపథ్యం, కమీషన్ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్ తరపున మెక్కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్. ఎవరెలా చేశారంటే.. సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న మెక్ కిన్లేగా ఆర్ మాధవన్ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్రీత్ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్ సచ్దేవ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సడన్‌లో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, స్వాతి మందల్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ది డెవిల్స్ చైర్'(the devil's chair). ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన మూడు నెలల తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో ది డెవిల్స్ ఛైర్ స్ట్రీమింగ్ అవుతోంది.ది డెవిల్స్ చైర్ కథేంటంటే..ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే విక్రమ్(అదిరే అభి) బెట్టింగ్‌కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్‌ని ప్రియురాలు రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్‌ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్లో ఓ డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్‌పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్‌ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్లో ఉన్నది ఎవరు? విక్రమ్‌ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
టాలీవుడ్ నటి అనసూయ ఇంట మరో వేడుక జరిగింది. ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన అనసూయ.. తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను జరుపుకున్నారు. ఉపనయనం అంటే మన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించండం, వైదిక సంప్రదాయంలో ప్రకారం ఉపనయన వేడుకలో శరీరంపై యజ్ఞోపవీతం (పవిత్ర దారం) ధరిస్తారు. ఈ వేడుకకు సంబంధించిన వేడుకను అనసూయ తన ఇన్‌స్టాలో పంచుకుంది.అనసూయ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్యభరద్వాజ్.. నీకు ఈ అధికారిక వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ తల్లిదండ్రులుగా, కుటుంబంగా మేమంతా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, సూత్రాలు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా.. మన సాంస్కృతిని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. ఆ హనుమాన్ జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది' అంటూ పోస్ట్ చేసింది. ఇవాళ హనుమాన్ జయంతి కావడంతో అనసూయ ఈ శుభకార్యం చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.ఉపనయనం అంటే ఏమిటి?ఉపనయనం అనేది ఒక ప్రాచీన హిందూ ఆచారం. ఇది వేదాధ్యయనానికి, ఆధ్యాత్మిక జీవితానికి, సమాజంలో గౌరవప్రతిష్టను అందుకోవడానికి ప్రారంభంగా భావిస్తారు. ఉపనయనం విద్యాభ్యాసం, గురువు-శిష్య సంబంధంలో ముఖ్యమైన దశగా చెబుతారు. ఈ ఆచారం ముఖ్యంగా హిందూ కుటుంబాల్లో కనిపిస్తుంది. ఈ ఆచారం సాధారణంగా అబ్బాయిలకు విద్య నేర్చుకునే తొలి దశగా పరిగణిస్తారు.ఈ ఆచారం అబ్బాయిలకు సంబంధించినది అయినప్పటికీ.. ఆధునిక కాలంలో అమ్మాయిలకు కూడా ఈ ఆచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఇది సంప్రదాయబద్ధంగా చూస్తే కేవలం అబ్బాయిలకు మాత్రమే నిర్వహిస్తారు. పురాణాలలో, హిందూ ధర్మంలో ఈ ఆచారం అబ్బాయిలకే జరిపినట్లుగానే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఉపనయనం వేడుకను సాధారణంగా పిల్లల వయస్సు 7 నుండి 16 సంవత్సరాల మధ్య చేయడం ఉత్తమమని భావిస్తారు. దీనికి కారణం, ఈ వయస్సులో పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా మారేదశగా గుర్తిస్తారు. ఈ ఆచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖాండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటిస్తారు. -
అట్లీ- బన్ని సినిమా అప్డేట్.. ఫ్యాన్స్‌కి పునకాలు గ్యారెంటీ!
హీరో అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు అట్లీ (Atlee)ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. తమ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో రానున్న సినిమా పనులను స్పీడప్ చేశారు. తాజాగా ఈ చిత్రం ప్రీ డక్షన్ పనుల నిమిత్తమై అల్లు అర్జున్ను కలిసేందుకు హైదారాబాద్ వచ్చారు అట్లీ. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను ముగించేసి, జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలన్నది వీరి ప్లాన్ అని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారట. ఈ మూడు పాత్రల్లో ఒకటి యానిమేటెడ్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్‌కి పునకాలు తెప్పించే సన్నివేశాలో ఇందులో చాలా ఉండబోతున్నాయట. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే ఈ చారిత్రాత్మక చిత్రంలో యాక్షన్ సీన్స్ వేరే లెవల్లో ఉంటాయట. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని చిత్రబృందం ముందు నుంచి చెబుతుంది. రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించబోతున్నట్లు సమాచారం. -
అప్పుడు బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్.. రెండు చిత్రాలు మన దర్శకధీరుడివే!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈ మూవీని లండన్‌లో ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ ఘనతను దక్కించుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. రాయల్ అల్బర్ట్ హాల్ స్థాపించి ఇప్పటి వరకు దాదాపు 154 ఏళ్లు పూర్తయింది. ఈ హాల్ స్థాపించాక ప్రదర్శించిన సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం బాహుబలి మాత్రమే నాన్ ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. 2019లో బాహుబలి మూవీని ఇదే హాల్లో ప్రదర్శించారు.తాజాగా 2025లో ఆర్ఆర్ఆర్ ఈ ఘనతను సాధించింది. బాహుబలి తర్వాత ఈ రికార్డ్ సాధించిన రెండో నాన్ ఇంగ్లీష్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో టాలీవుడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకధీరుడికే దక్కుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరెకెక్కిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ప్రస్తుతం షూటింగ్‌కు విరామం లభించడంతో రాజమౌళి లండన్ కార్యక్రమానికి హాజరయ్యారు.An SS Rajamouli Film… Does it again!! 🔥🌊 HistorRRRy continues at @RoyalAlbertHall!#RRRMovie is the second non-English film after Baahubali since its inauguration 154 years ago. ✊🏻 https://t.co/AJ9Od2mnD4 pic.twitter.com/FMf5UWHBKM— RRR Movie (@RRRMovie) May 21, 2025 -
రానా నాయుడు అందరూ చూశారు.. కానీ మన తెలుగు వాళ్లే: రానా దగ్గుబాటి
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు-2. గతంలో విడుదలైన రానా నాయుడుకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే మొదటి సీజన్లో ఎక్కువహా బూతులు ఉన్నాయని ఈ సిరీస్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కించుకుంది.తాజాగా ఈ సీజన్ టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన ఈవెంట్లో హీరో రానా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన సీజన్-2పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రానా నాయుడు ప్రపంచం మొత్తం చూసింది.. కానీ మన తెలుగు వాళ్లు మాత్రం చూడలేదని అన్నారు. అయితే ఈ సీజన్-2లో బూతులు తగ్గించి.. వయొలెన్స్ ఎక్కువ పెట్టామని రానా తెలిపారు. కాగా.. ఈ సమావేశానికి బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అర్జున్ రాంపాల్‌ను తెలుగువారికి పరిచయం చేశారు రానా.కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. తాజాగా రిలీజైన రానా నాయుడు సీజన్-2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. -
బిగ్‌బాస్ బ్యూటీ దివి వన్‌సైడ్ లవ్.. రెడ్ శారీలో మెరిసిపోతున్న అదితిరావు హైదరీ!
హీరోయిన్ నివేదా థామస్ స్మైలీ లుక్..రెడ్ శారీలో మెరిసిపోతున్న అదితిరావు హైదరీ..వన్ సైడ్ లవ్ చేద్దామంటోన్న బిగ్‌బాస్ బ్యూటీ దివి..బర్త్ డే పార్టీ మూడ్‌లోనే యాంకర్ రష్మీ గౌతమ్..బీచ్‌లో బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..కేన్స్‌లో దేవర భామ జాన్వీ కపూర్ సందడి.. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
రానా నాయుడు సీజన్-2.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. కాగా.. సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు.తాజాగా రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిర్వహించిన ఈవెంట్లో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరో రానా సందడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌కు విచ్చేసిన రానాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలతున్నాయి. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. తాజాగా రిలీజైన రానా నాయుడు సీజన్-2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. -
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. ఆ రోజే తుది నిర్ణయం!
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో జూన్‌పై విడుదలయ్యే సినిమాలపై ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్లో చర్చించారు. ఈ నెల 23న మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శుక్రవారం రోజైనా తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను అద్దె విధానంలో నడుపుతున్నారు. దీని వల్ల తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అందుకే పర్సంటేజీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజా సమావేశంలో పర్సంటేజీ విధానంపై కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా.. మరికొందరు ఓకే చేయలేదని సమాచారం. ఈ సమావేశంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ పాల్గొన్నారు. -
గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
రామ్‌చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్‌లో స్టార్స్...ఎవరు గ్రేట్?
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైనపు విగ్రహాల ప్రదర్శన కేంద్రం. ఇది లండన్, సింగపూర్, దుబాయ్, ఢిల్లీ వంటి భారీ నగరాల్లో ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు, సంగీతకారులు తదితర అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఆయా సెలబ్రిటీలకు ఆయా సందర్భాల్లో ఉన్న పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని వీటిని నెలకొల్పుతారు కాబట్టి ఈ విగ్రహాలు అత్యంత ప్రాచుర్యం సెలబ్రిటీలకు స్టేటస్ సింబల్స్‌గా మారాయి. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం భారతీయ సినీ ప్రముఖుల గౌరవార్థం మైనపు విగ్రహాలను ప్రదర్శించడంలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులకు ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో సూచిస్తుంది. ఇందులో పదుల సంఖ్యలోనే ఇండియన్ స్టార్స్ చోటు చేసుకున్నప్పటికీ.. విశేషం ఏమిటంటే... మన టాలీవుడ్ స్టార్స్ నలుగురి విగ్రహాలు ఒక్కోటి ఒక్కో రకమైన ప్రత్యేకతతతో చరిత్ర సృష్టించాయి.లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన తాజా మైనపు విగ్రహం టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ది. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ సహా మైనపు బొమ్మలుగా మారి కొలువుదీరడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో తన పెట్‌తో సహా కొలువుదీరిన రెండవ సెలబ్రిటీగా, సినీరంగం నుంచి మొదటి వాడిగా రామ్ చరణ్ రికార్డ్ సాధించాడు.గత మార్చి 2024లో, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా వైకుంఠపురములో చిత్రం లో కనిపించినట్టుగా ఎరుపు జాకెట్ ధరించి, మేడమ్ టుస్సాడ్స్ లో ఈ విగ్రహం కొలువుదీరింది. పుష్ప ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బన్నీ ని కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటూ టుస్సాడ్స్ పేర్కొనడం విశేషం.గత 2019 మార్చి లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మహేష్ బాబుకు ఉన్న భారీ అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కారణంగా, ఈ విగ్రహాన్ని సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకువచ్చారు. అలా తొలిసారిగా, ఒక భారతీయ నటుడి విగ్రహాన్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఘనతను మహేష్ దక్కించుకున్నాడు. ఇక ఇలాంటి అంతర్జాతీయ పాప్యులారిటీకి కొబ్బరికాయ కొట్టిన హీరో ప్రభాస్... మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా కూడా ఘనత దక్కించుకున్నాడు. గత 2017మార్చి లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన బాహుబలి తన నటన ద్వారా, బ్లాక్‌బస్టర్ విజయాల ద్వారా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ అమెరికా వంటి దేశాలలోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. -
టాలెంట్ ఉన్న యువతకు దిల్ రాజు గుడ్ న్యూస్
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు, కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు "దిల్ రాజు డ్రీమ్స్" అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా, యువ దర్శకులు, నటీనటులు, రచయితలు, టెక్నీషియన్లు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందనున్నారు.జూన్ నెల నుంచి యాక్టివ్ కానున్న ఈ ఆన్లైన్ పోర్టల్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లో తమ వివరాలను నమోదు చేయవచ్చు. నమోదు చేసుకున్న వారిని దిల్ రాజు డ్రీమ్స్ బృందం సంప్రదిస్తుంది. సినీ పరిశ్రమలో సరైన అవకాశాలు, కాంటాక్ట్స్ లేక ఇబ్బంది పడుతున్న యువ ప్రతిభావంతులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.దిల్ రాజు, తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి, కొత్త టాలెంట్‌ను పరిచయం చేసిన చరిత్ర కలిగిన నిర్మాత. ఈ కొత్త బ్యానర్ ద్వారా కూడా ఆయన తెలుగు సినిమాకు కొత్త టాలెంట్‌ను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సినీ రంగంలో కలలు కనే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దిల్ రాజు సూచిస్తున్నారు. -
నేను క్లియర్‌గా చెప్పా.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే నా పోరాటం: పూనమ్ కౌర్ మరో పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. సినిమా విషయాలే కాదు.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంది.ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని చెప్పాను.. మళ్లీ కూడా చెప్తున్నా.. నేను మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఆ తర్వాత ఝాన్సీ గారితో మాట్లాడానని.. కానీ మీటింగ్ కాస్తా ఆలస్యమవుతుందని చెప్పారని.. అప్పటివరకు తమను డిస్టర్బ్ చేయవద్దని చెప్పారని కోరింది.కానీ ఇక్కడ నేను ఎవరి పేరు చెప్పలేదని అనుకుంటున్నారు.. క్లియర్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్‌తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్‌కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్‌షాట్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
31 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన 'విశ్వసుందరి'.. ప్రత్యేకత ఇదే
పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు సుస్మితా సేన్( Sushmita Sen) పరిచయం చేశారు. సరిగ్గా 31 ఏళ క్రితం మే 21న విశ్వసుందరి కిరీటాన్ని ఆమె అందుకున్నారు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో ఆమె పేరు విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోయింది. అప్పటి తీపి గుర్తులను ఆమె తాజాగా మరోసారి గుర్తుచేసుకుంటూ ఫోటలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 'ఈ రోజు నా జీవితంలో ఎప్పిటికీ మరిచిపోలేనిది. నా ఆశలకు మరింత బలాన్ని అందించిన రోజు ఇదే.. ప్రపంచమంతా పర్యటించడానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిసే భాగ్యం పొందడానికి దోహదపడిన రోజు. మిస్ యూనివర్స్ రేసులో నా భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యున్నతమైన గౌరవం నాకు అభించిందని ఎప్పటికీ గర్వంగా ఉంటుంది. దానిని మాటలలో చెప్పలేం.' అని ఆమె పంచుకున్నారు.1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకుగాను 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసే వారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
Kannappa: కిరాతగా మోహన్ లాల్.. స్పెషల్ గ్లింప్స్ అదిరింది!
మోహన్‌లాల్(Mohanlal ) పుట్టినరోజు (మే 21) సందర్భంగా ‘కన్నప్ప’(Kannappa) చిత్ర బృందం ఒక అద్భుతమైన స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో మోహన్‌లాల్ కిరాత అనే దైవిక శక్తితో ముడిపడిన పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.ఇక కన్నప్ప విషయానికొస్తే.. విష్ణు మంచు హీరోగా నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషించారు.ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. -
'హరి హర వీరమల్లు' అసుర హననం సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా నుంచి 'అసుర హననం' పాటను తాజాగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన నుంచి విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏఎమ్ రత్నం నిర్మించారు. సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు.ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సుమారు 5 ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ పనులు కొనసాగాయి. -
తెలుగు సినిమా కోసం ‘కమిట్మెంట్’ అడిగారు: నాగార్జున హీరోయిన్
ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో ఓ అనే అంశం చాలా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సినీ తారలు ఇప్పుడిప్పుడే బహిరంగంగా మాట్లాడుతున్నారు. తమకు ఎదురైన ఛేదు అనుభవాలను పంచుకుంటూ.. వాటిని ఎలా అధిగమించాలో కొత్తతరం నటీనటులకు సలహాలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సయామీ ఖేర్(Saiyami Kher) కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. తన కెరీర్ ఆరంభంలో ఓ తెలుగు సినిమా అవకాశం కోసం ‘సర్దుకుపోవాలని’ అడిగారని, దానికి ఆమె నో చెప్పి.. ఆ సినిమాను వదిలేశానని చెప్పారు. తాజాగా సయామీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పటి వరకు వచ్చిన ఆఫర్ల విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి సినిమాల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అయితే నా కెరీర్ ఆరంభంలో మాత్రం నాకొక ఛేదు అనుభవం ఎదురైంది. నాకు 19-20 ఏళ్ల వయసులో ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. ఒక లేడీ ఏజెంట్ నన్ను పిలిచి సినిమా చాన్స్‌ల కోసం ‘సర్దుకుపోవాలి’ అని చెప్పారు. నేను ఆమెను టెస్ట్ చేయడానికి ప్రయత్నించాను. ఆమె మాటలు అర్థం కానట్లుగా నటించాను. కానీ ఆమె పదే పదే అదే విషయం ప్రస్తావించడంతో ‘క్షమించండి, నేను అలాంటి పనులకు దూరంగా ఉంటాను. నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని ఎప్పటికీ దాటలేను’ అని సున్నితంగా తిరస్కరించాను. అయితే ఆ సమయంలో ఈ విషయాన్ని బయట పెట్టేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఆ సినిమాను వదిలేసి నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. నా కెరీర్లో ఒక్కసారి మాత్రమే ‘కమిట్మెంట్’ లాంటి ఛేదు ఘటన ఎదురైంది’ అని సయామీ చెప్పుకొచ్చింది.సయామీ ఖేర్ కెరీర్ విషయానికొస్తే.. 2015లో ‘రేయ్’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తీసిన 'మిర్జ్యా' చిత్రంతో సయామి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.'చోక్డ్' 'ఘూమర్' వంటి చిత్రాలతో పాటు 'స్పెషల్ ఆప్స్', 'ఫాదూ' వంటి వెబ్ సిరీస్‌లు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. 2021లో అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన 'వైల్డ్ డాగ్' మూవీలో సయామీ కీలక పాత్ర పోషించారు. ఇటీవల రిలీజైన'జాట్' సినిమాలో ఎస్సై పాత్రలో కనిపించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్త్నునారు. -
రామ్ చరణ్‌తో సినిమా.. ‘రంగస్థలం’ మించిపోతుంది: సుకుమార్
మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్ స్టార్’ రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్‌చరణ్‌తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయికి రామ్‌చరణ్ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్‌తో తీసిన ‘పుష్ప’ జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత ఫోకస్ పెట్టి తీశామన్నారు. స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్ ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమేరెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు. -
లాయర్‌గా విజయ్ ఆంటోని.. విలన్‌గా మేనల్లుడు
కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయన ఇప్పటికే నాలుగైదు చిత్రాలు చేస్తున్నారు. ఈయన నటిస్తున్న అగ్ని సిరైగల్, వళ్లి మయిల్, ఖాకీ, మార్గన్, శక్తి తిరుమగన్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా మరో నూతన చిత్రానికి సిద్ధమవుతున్నారు . దీనికి లాయర్ అనే టైటిల్ ను నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. దీన్ని విజయ్ అంటాని ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి జెంటిల్ ఉమెన్ చిత్రం ఫేమ్ జోశ్వా సేతురామన్ కథా, దర్శకత్వం బాధ్యతలను వహించనున్నారు. ఇది న్యాయస్థానం నేపథ్యంలో సాగే వైద్య భరిత కథాచిత్రంగా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొన్నారు. న్యాయస్థానంలో ఒక విభిన్నమైన కేసు ఇతి వృత్తంతో సాగే కథను దర్శకుడు రాశారని నిర్మాతలు తెలిపారు. ఇంతవరకు తెరపై చూడనటువంటి న్యాయస్థానాన్ని , దాని విధి విధానాలను సరికొత్తగా తెరపై ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందని పే ర్కొన్నారు. ఇందులో నటుడు విజయ్ ఆంటోనికి వ్యతిరేక పాత్రలో ఇండియాలోనే పాపులర్ అయిన ఓ నటి నటించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయినట్లు, త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను అతి త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ఈ మూవీని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు విలన్‌గా నటించనున్నారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మార్గన్‌లో విజయ్‌కు పోటీగా అజయ్ దీషన్ విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే తన మేనల్లుడుని విజయ్ ఆంటోనీ పరిచయం చేస్తున్నాడు. -
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్‌డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
హీరో నాని తన సోదరి దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, తమ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో తమ సొంత ఫ్రాంచైజీలో భాగమై ‘హిట్ 3’లో నాని నటించారు. ఆపై కోర్టు సినిమాను సొంత బ్యానర్లోనే తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు. అయితే, ఈ విజయాల్లో నాని సోదరి దీప్తి పాత్ర చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఆమె సహ నిర్మాతగా కూడా కోర్టు సినిమాకు ఉన్నారు.నాని సోదరి దీప్తి గంటా ఒక డైరెక్టర్ కూడా.. గతంలో ‘మీట్ క్యూట్’ అనే చిత్రాన్ని ఆమె తెరకెక్కించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పిస్తుండగా ప్రశాంతి నిర్మించారు. గతంలోనూ 'అనగనగా ఒక నాన్న' అనే షార్ట్‌ఫిలిం కోసం ఆమె దర్శకత్వం వహించిన దీప్తి తన ప్రతిభ చూపారు. అలా సినిమాతో ఆమెకు మంచి కనెక్షన్ ఉంది. అ!, హిట్ ఫ్రాంచైజీ చిత్రాలు, కోర్టు వంటి సినిమాలకు దీప్తి పనిచేశారు. అలా తన అక్కతో నాని చిత్ర పరిశ్రమలో సూపర్‌గా విజయాలు అందుకుంటున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో ఇలా ఫోటో షేర్ చేశారు. 'అక్కీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వేడుకలు జరుపుకోవడానికి నేను వేచి ఉండలేను.' అంటూ తెలిపాడు.హీరో నాని ఫ్యామిలీ మ్యాన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తన కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు. ఇప్పుడు సినిమాపై తనకున్న మక్కువతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్తవారికి ఛాన్సులు కల్పిస్తున్నాడు. వాస్తవానికి చిత్రపరిశ్రమకు నాని చాలామంది దర్శకులను పరిచయం చేశారు. వారితో విజయాలను కూడా అందుకున్నారు. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
అతని కాలి బూట్లకు ముద్దు పెట్టిన హీరో అజిత్.. వీడియో వైరల్
సినిమా హీరోలను దేవుడిలా అభిమానులు పూజిస్తారు. మరి ఆ హీరోలే మరోకరిని తమ జీవితానికి ఆదర్శంగా తీసుకుంటే అతనెంత గొప్పవాడై ఉంటాడో అని ఆలోచిస్తాం. సరిగ్గా అలాంటి సన్నివేశమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లైఫ్‌లో ఒకటి ఉంది. అజిత్ తాజాగా తన అభిమాన కార్ రేసర్‌కు నివాళులు అర్పించారు. ఆయనపై తన అభిమానం ఏపాటిదో వీడియోతో చూపాడు. దానిని చూసిన అజిత్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అజిత్ తాజాగా ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ అయర్టన్ సెన్నాకు నివాళులర్పించారు. ఇటలీ పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానం ఎలాంటిదో చూపాడు. అయర్టన్ సెన్నా విగ్రహాన్ని కొంత సమయం పాటు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. బ్రెజిల్ దేశానికి చెందిన అయర్టన్ సెన్నా మూడు సార్లు(1988,1990,1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సెట్ చేశాడు. 1994 కార్ రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు.అజిత్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ రేసర్‌గానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. షూటింగ్స్‌లకు కాస్త విరామం దొరికితే చాలు రేసింగ్ బైక్స్, కార్లలో చక్కర్లు కొడుతుంటారు. అంతర్జాతీయ కార్ రేసింగ్లలో కూడా ఆయన పాల్గొని సత్తా చాటారు. ఆపై తన రేసింగ్ టీమ్‌ను కూడా కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రకటించారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing) -
తమన్నాకు ఛాన్సులు తగ్గడం వెనుక కారణం ఇదేనా..?
పాన్ ఇండియా కథానాయకి నటి తమన్న. తన 15వ ఏటనే నటిగా రంగ ప్రవేశం చేసిన ఈమె తొలుత హిందీ చిత్రంలో నటించారు. ఆ వెంటనే తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. అయితే మొదట్లో గ్లామర్‌నే నమ్ముకున్న ఈ బ్యూటీ చివరి వరకూ ఆ గ్లామర్‌తోనే తమన్నాను స్టార్ హీరోయిన్ను చేసింది. మధ్యలో తనలోని నటనకు పదును పెట్టే పాత్రలు వచ్చినా అవి చాలా తక్కువగా పరిమితం అయ్యాయి. తమన్నా కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇక అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్‌తో అందాలను వెండితెరపై ఆరబోస్తూ కుర్రకారు హాట్ బీట్‌ను పెంచేస్తూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు. అలా ఐటమ్ సాంగ్స్‌కు స్పెషలిస్ట్‌గా ముద్ర వేసుకున్నారు. ఐతే కథానాయకిగా తమన్నా రెండు దశాబ్దాల మైలు రాయిని అవలీలగా టచ్ చేశారు. ఇప్పటికి ఈ బ్యూటీ వయసు జస్ట్ 35 ఏళ్లే. మొన్న జైలర్ చిత్రం, ఆ తరువాత హిందీ స్త్రీ2 వంటి చిత్రాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్‌తో ఇరగదీశారు. అలాంటిది ఇప్పుడు దక్షిణాదిలో ఈ భామకు ఒక్కటంటే ఒక్క సినిమా లేక పోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇటీవల సుందర్ సీ దర్శకత్వంలో నటించిన అరణ్మణై – 4 చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్‌లో మరో అవకాశం రాలేదు. ఇదే విధంగా తెలుగులో విభిన్న పాత్రలో నటించిన ఓదెల – 2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో అక్కడ మరో అవకాశం రాలేదు. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ తమన్నాను పూర్తిగా పక్కన పెట్టేసిందా? అన్న చర్చ జరుగుతోంది.ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారీ భామ. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా తమన్నా కన్నా వయసులో పెద్దవారైన నయనతార, త్రిష వంటి తారలు నాలుగు పదుల వయసు దాటేసినా ఇప్పటికీ అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్నారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల నటి తమన్నా విజయ్ వర్మ అనే హిందీ నటుడి ప్రేమలో పడడం, అది కొద్ది కాలానికే వికటించడం వంటి ఘటనలు ఈమె కెరీర్ కు ఎఫెక్ట్ అయ్యాయా? అనే చర్చ కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఏదేమైనా మిల్కీ బ్యూటీ మళ్లీ అవకాశాల వేటలో పడ్డారు. తన గ్లామరస్ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేస్తున్నారు. -
ముంబైలో మిరాయ్
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్యోధగా తేజ కనిపిస్తారు.తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్. -
మాయాబజార్‌ని థియేటర్స్‌లోనే చూడండి: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘ఎన్టీఆర్‌గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ‘మాయాబజార్’ సినిమాని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ రోజున చూసేందుకు రెండు టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లోనే చూడండి’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయాబజార్’.కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయాప్రోడక్షన్స్పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ సినిమా 1957 మార్చి 27న విడుదౖలñ ంది. ఈ నెల 28న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ‘మాయాబజార్’ చిత్రాన్ని బలుసు రామారావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాయాబజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ‘ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ’ చైర్మన్ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘రీ రిలీజ్లోనూ ‘మాయాబజార్’ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ–‘‘మా నాన్న ఎల్వీ ప్రసాద్, రామారావుగారు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు’’ అని తెలిపారు. ‘‘అలనాటి క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల చేయడం మన బాధ్యత’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. ఈ వేడుకలో వీర శంకర్, భగీరథ, త్రిపురనేని చిట్టి, బలుసు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
కాఫీ తాగుతూ హీరోయిన్ నభా నటేశ్ చిల్.. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో శ్వేతాబసు ప్రసాద్..!
కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న హీరోయిన్ నభా నటేశ్..స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో శ్వేతాబసు ప్రసాద్..లండన్ వేకేషన్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్...బ్లూ శారీలో యాంకర్ లాస్య హోయలు..కేన్స్ ఫెస్టివల్లో సందడి చేస్తోన్న ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
మంచు మనోజ్ బర్త్ డే స్పెషల్.. భైరవం సాంగ్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మే 30న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ మంజు మనోజ్ పుట్టినరోజు కావడంతో భైరవం టీమ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. థీమ్ ఆఫ్ గజపతి పేరుతో పవర్ఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు పూర్ణాచారి చల్లూరి లిరిక్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల, క్రాంతి కిరణ్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో అజయ్ రాజా, రవీంద్ర శరత్, సంపత్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
మగధీర సినిమా చూశాకే హీరోయిన్ అవ్వాలనుకున్నా: ఆదితి శంకర్
కోలీవుడ్ బ్యూటీ ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. భైరవం మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులను మెప్పించనుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో ఆదితితో పాటు ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవల ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆదితి శంకర్ తన స్టెప్పులతో వేదికపై అలరించింది. ఈ ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ముద్దుగుమ్మ. టాలీవుడ్ సినిమాల్లో మొదట థియేటర్లో చూసిన మూవీ మగధీర అని తెలిపింది. ఈ సినిమా చూశాకా గూస్బంప్స్ వచ్చేలా ఉందని తన ఆనందం వ్యక్తం చేసింది. మగధీర మూవీ చూశాకే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యానని ఆదితి శంకర్ తెలిపింది.(ఇది చదవండి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!)కాగా.. అంతకు ముందు హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. #Magadheera సినిమా చూసాక హీరోయిన్ అవ్వాలని అనుకున్న - #AditiShankarWatch Full Interview 👉 https://t.co/eTxTPMH8Yi#RamCharan #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/PLJHDz465S— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025 -
తమ్ముడి బర్త్ డే.. వెరైటీగా విషెస్ చెప్పిన మంచు లక్ష్మీ!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా ఇప్పటి వరకు మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ మనోజ్‌కు విష్ చేయలేదు.కానీ మంచు మనోజ్ అంటే అక్క మంచు లక్ష్మీకి విపరీతమైన ప్రేమ. గతంలో తానే పక్కనుండి మనోజ్- మౌనికల పెళ్లిని జరిపించింది. ఇవాళ తమ్ముడి పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. భైరవం మూవీలోని ధమ్ ధమారే అంటూ సాగే పాటకు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. అందరికంటే కాస్తా వెరైటీగా విష్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ కావడంతో సూపర్బ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో చూసిన మంచు మనోజ్ ఫుల్ ఖుషీ అయ్యారు. లవ్ సింబల్స్‌తో వీడియోకు రిప్లై కూడా ఇచ్చారు. థ్యాంక్యూ యూ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా.. మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ ఈనెల 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మంచు మనోజ్ బర్త్ డే.. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన హీరో
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన 42వ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఈ పుట్టినరోజును ఆస్వాదించారు. కాగా.. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య మౌనిక ఇప్పటికే శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. తన భర్త ప్రేమను తలచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా రోజుల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై మంచు మనోజ్ సందడి చేయనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 30న ప్రేక్షకుల థియేటర్లలో సందడి చేయనుంది. #TFNExclusive: Some lovely visuals of Rocking Star @HeroManoj1 celebrating his birthday with his kids and fans!!😍📸#ManchuManoj #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/bgEMWTV8Sp— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025 -
డబ్బు, పవర్ కాదు మూడో వ్యక్తి వల్లే విడిపోయాం: ఆర్తి రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్)(Ravi Mohan), ఆయన సతీమణి ఆర్తి రవి(Aarti Ravi) మధ్య విడాకుల వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. 2009లో వివాహం చేసుకున్న ఈ జంట, 18 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత విడిపోతున్నట్లు గత ఏడాది జయం రవి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై ఆర్తి తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనకు తెలియకుండానే, సంప్రదింపులు లేకుండా రవి ఏకపక్షంగా విడాకులు ప్రకటించారని సోషల్ మీడియాలో వెల్లడించారు.ఈ వివాదం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఆర్తి, జయం రవి తనను ఇంటి నుంచి తరిమేశారని, తమ ఇద్దరు కుమారుల బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా, ఆర్తి తనపై సానుభూతి కోసం పిల్లలను ఉపయోగించుకుంటోందని జయం రవి విమర్శించారు. తాజాగా, ఆర్తి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి డబ్బు లేదా పవర్ కారణం కాదని, మూడో వ్యక్తి (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో రవి సంబంధం) కారణమని ఆరోపించారు. ఈ విషయంపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఊహాగానం కాదని ఆర్తి స్పష్టం చేశారు.కాగా ఇటీవల జయం రవి, కెనీషాతో కలిసి ఓ వివాహ వేడుకలో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిపై ఆర్తి భావోద్వేగంతో స్పందించారు. "18 ఏళ్లు నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈజీగా దూరమయ్యారు. పిల్లల బాధ్యత నా భుజాలపై ఉంది. నేను మాట్లాడకపోవడం నా నిజాయితీ కోసమే" అని ఆర్తి పేర్కొన్నారు. మరోవైపు, ఆర్తి తన సోషల్ మీడియా ఖాతాలను తన ఆధీనంలో ఉంచి ఇబ్బంది పెట్టిందని, ఆర్థికంగా, మానసికంగా వేధించిందని రవి ఆరోపించారు.ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూడా ఈ వివాదంలోకి దిగి, జయం రవిని కొడుకులా చూసుకున్నామని, అతని కోసం రూ.100 కోట్ల అప్పులు చేశామని, అయినా రవి అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది, కానీ ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
రానా నాయుడు సీజన్-2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్.. నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది)సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు. తాజాగా రానా నాయుడు సీజన్-2 స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. ఇప్పటికే రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️🔥Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/NwhRM3MQcE— Netflix India (@NetflixIndia) May 20, 2025 -
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
తమిళ యాక్షన్ స్టార్ విశాల్( Vishal,), యువ నటి సాయి ధన్షిక(Sai Dhanshika)లు తమ పెళ్లి ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఇక వారి గురించి రూమర్స్ మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. కానీ..పుష్కరకాలం దాటిన ఈ జంట స్నేహం, ప్రేమగా విడదీయరాని బంధంగా మార్చిన సందర్భాలేమిటి? అంటే ఓ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. దీని గురించి వివరాలు తెలియాలంటే.. దాదాపు ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి.నటుడు–దర్శకుడు టి రాజేందర్ (టిఆర్ అని కూడా పిలుస్తారు) తమిళనాట సీనియర్ సినీ ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రేమసాగరం వంటి చిత్రాల ద్వారా మనకూ గుర్తోస్తారు. వయసు, అనుభవం ఎంత ఉంటే ఏం లాభం? పరిణితి లేనప్పుడు అన్నట్టుగా ఆయన గతంలో నటి సాయి దన్షిక విషయంలో ప్రవర్తించిన తీరు పూర్తిగా ఆక్షేపణకు గురైంది.తమిళనటులు కృష్ణ, విధర్త్ ప్రధాన పాత్రల్లో నటించిన సాయి ధన్షిక కీలక పాత్ర పోషించిన విజితిరు తమిళ చిత్రం 2017లో థియేటర్లలో వచ్చింది. ఈ చిత్రంలో టి రాజేందర్ అతిధి పాత్రలో నటించారు. విడుదలకు ముందు చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మాట్లాడిన సాయి ధన్సిక తన ప్రసంగంలో వేదికపై ఉన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పింది. అయితే నటి సాయి ధన్షిక తన పేరు మర్చిపోవడం టి.రాజేందర్‌ను తీవ్ర ఆగ్రహావేశాలకు అసహనానికి గురి చేసింది. దాంతో ఆమెను అదే వేదికపైనే చెడామెడా తిట్టిపోశాడు. ఆమె అప్పట్లో రజనీకాంత్ సినిమాలో (కబాలి) నటిస్తోంది కాబట్టి పొగరు పట్టిందంటూ తీవ్రంగా దుర్భాషలాడాడు. అయితే ధన్షిక తాను టి రాజేందర్‌ను గౌరవిస్తానని పొరపాటున పేరు మర్చిపోయానని అందుకు క్షమించాలని కోరడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే, టిఆర్ మాత్రం ఆగలేదు. తన తిట్ల పరంపరను కొనసాగించాడు పైగా సారీ అంటూ ధన్సిక చెప్పడాన్ని కూడా హేళన చేస్తూ ఆమె శారీ కట్టుకోలేదు కానీ సారీ చెబుతోంది అంటూ వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశాడు. విషాదం ఏమిటంటే ఈ మాటలకు ఆమె సహనటులు సహా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టడం..అవమానాన్ని తట్టుకోవడానికి ప్రయత్నించిన సాయి ధన్సిక, దీంతో తీవ్రంగా చలించిపోయింది. కన్నీటి పర్యంతమైపోతూ దానిని దాచడానికి విఫలయత్నం చేసింది. ఈ ప్రెస్ మీట్ ట్విట్టర్లో వైరల్ అయింది.ఈ కార్యక్రమంలో టి రాజేందర్ విచక్షణా రహిత ప్రవర్తన విషయంలో ధన్షికకు తన సహనటుల నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. వేదికపై టిఆర్ ప్రవర్తనను ఖండించకుండా ఆస్వాదించిన మిగిలిన నటులు దర్శకుడు వెంకట్ ప్రభులపై కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.ఇది తెలుసుకున్న తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టిఎఫ్‌పిసి) అధ్యక్షుడు విశాల్ టి రాజేందర్ ప్రవర్తనను స్పష్టంగా ఖండించాడు ‘ధన్షిక క్షమాపణలు చెప్పినా, మిస్టర్ టిఆర్ ఆమెను లక్ష్యంగా చేసుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను‘ అని విశాల్ అన్నాడు. అప్పటికే క్లోజ్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్న సాయి ధన్షిక, విశాల్‌లను ఆ సంఘటన మరింత దగ్గర చేసిందని, వారి బంధం మరింత బలపడిందని అంటారు. -
మరో జన్మ ఉంటే నువ్వే నా భర్తగా రావాలని కోరుకుంటా: మంచు మనోజ్ భార్య ఎమోషనల్ పోస్ట్
చాలా రోజుల విరామం తర్వాత మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇటీవల ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన మంచు మనోజ్ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య భూమా మౌనిక తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు మనోజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను ప్రేమించే నా సోల్‌మేట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాల్లో వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రపంచాన్ని మధురమైన ప్రదేశంగా మార్చారు. మీ చేయబోయే అన్ని మంచి పనులను బాగా జరగాలి. మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బతకాలి. ఈ ఏడాది మాత్రమే అన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఉండాలి. మేము నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాం.. మీరు జీవితం మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్రమే. మీరు నిజంగా మా రాకింగ్ స్టార్. ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి పునర్జన్మలో నా స్నేహితుడిగా, భర్తగా మిమ్మల్నే ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu) -
టాలీవుడ్లో మరో ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
రీతూ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్‌కు బి.కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను ఫుల్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలోనే విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే దేవిక అండ్ డానీ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరెకెక్కించినట్లు అర్థమవుతోంది. 'ఎవడు భయపెట్టినా.. ఎంత ప్రమాదమైనా రానీ.. వెనకడుగు వేసేదే లేదు'.. అని రీతూ వర్మ చెప్పే డైలాగ్ అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచేసింది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో సూర్య వసిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వైవా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనిక రెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలు పోషించారు. One holds her hand and the other... her soul. 🤍 https://t.co/zTcVhoqYg3Devika & Danny streaming from 6th June only on #JioHotstar 💌 Directed by @im_kishorudu #DevikaAndDanny #SuryaVashistta @iam_shiva9696 @actorsubbaraju #SoniyaSingh #MounikaReddy #IshwaryaVullingala… pic.twitter.com/OUiWshV7FW— Ritu Varma (@riturv) May 20, 2025 -
Cannes 2025 : కేన్స్‌లో టాలీవుడ్ సినిమాకు అరుదైన ఘనత
2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ తెలుగు సినిమా మన ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ (M4M - Motive for Murder). కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్లో ‘ఎం4ఎం’ మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.తెలుగు చిత్రసీమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్లతో పాటు అమెరికాకు చెందిన నటి జో శర్మ గౌరవంగా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు హర్షధ్వానాలు చేయడంతో పాటు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇది తెలుగు సినిమాకు కేన్స్‌లో దక్కిన అరుదైన ఘనత.ఇటీవల అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్లో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా ప్రతిభకు అక్కడి మీడియా ప్రశంసలు కురిపించింది.మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన M4M, కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథన బలంతో పాటు సినిమాటిక్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సహా ప్రపంచ సినీ పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరై చిత్రానికి అభినందనలు తెలిపారు.గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు కేన్స్‌లో ఊరిస్తున్న ఈ అరుదైన గౌరవం, M4M మూవీకి దక్కడంతో ఈ ప్రీమియర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జో శర్మ అభినయం ప్రపంచ స్థాయిలో ప్రశంసలందుకుంది.త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. భారతీయ ప్రాంతీయ సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన సినిమాగా M4M విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంటోంది. -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన దెయ్యం సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేసేస్తున్నాయి. ఎప్పుడో రిలీజైన చిత్రాలు ఉన్నట్లుండి ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ థ్రిల్లర్ సినిమా భవానీ వార్డ్ 1997 సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ప్రస్తుతానికి ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. రూ.99 అదనంగా చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఆద్యంతం ఆడియన్స్‌ను భయపెట్టేలా ఈ సినిమా ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పొచ్చు. -
గాయాలతో రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్
హీరోయిన్ రాశి ఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఒక సినిమా షూటింగ్లో కథ డిమాండ్ మేరకు చాలా రిష్క్ ఉన్న యాక్షన్ సీన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్గా 'ది సబర్మతి రిపోర్ట్'తో మెప్పించిన ఆమె 'ఫర్జీ2' వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమెకు గాయాలు అయినట్లు సమాచారం.గాయాలతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన రాశి ఖన్నా ఇలా చెప్పుకొచ్చింది. 'ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయలను కూడా లెక్కచేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు.' అంటూ పోస్ట్ చేసింది. షూటింగ్లో చిన్నచిన్న గాయాలైనట్లు రాశి ఖన్నా తెలిపింది.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా చేయనుంది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
ఎన్టీఆర్ 'వార్ 2' టీజర్ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక వచ్చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. తారక్‌ను ప్రధానంగా హైలెట్ చేస్తూ వీడియో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందులో తారక్ కిల్లర్ బాడీకి హృతిక్ రోషన్ లుక్స్ తోడు కావడంతో అటు బాలీవుడ్‌ను కూడా ఊపేయడం ఖాయమని చెప్పవచ్చు. టీజర్‌ను చూస్తే భారీ యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకునేలా సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తెలుగు, హిందీ, తమిళ్ వర్షన్లో టీజర్ విడుదలైంది. అయితే, అన్ని భాషల్లో కూడా తారక్‌నే డబ్బింగ్ చెప్పాడు.ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు.వార్తో ‘ఎన్టీఆర్ నీల్’కు బ్రేక్ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ‘వార్ 2’ నుంచి అప్డేట్ రావడంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్ని పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. -
నాట్య కళాకారిణితో ర్యాప్ సింగర్ పెళ్లి..
సౌత్ ఇండియా గాయకుడు విఘ్నేశ్ త్వరలో పెల్లి చేసుకోనున్నాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో పలు సాంగ్స్‌తో గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన సంగీత దర్శకుడు, గీత రచయిత కూడా.. ముఖ్యంగా ర్యాప్ పాటల సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళంలో హారీష్ జయరాజ్ సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడారు.అదే విధంగా డి.ఇమాన్,సత్య సీ, తమన్, శ్యామ్ సీఎస్ జస్టిన్ ప్రభాకరన్ వంటి సంగీత దర్శకుల చిత్రాలకు సౌండ్ ట్రాక్స్ పాడారు. ముఖ్యంగా విఘ్నేశ్ తెలుగులో చాలా పాటలు పాడారు. కాగా ఈయనకు ఇప్పుడు పెళ్లి కళ వచ్చేసింది. శ్వేత ఆనంద్ అనే భరత నాట్య కళాకారిణిని వివాహమాడబోతున్నారు. ఈమె చెన్నైలో పుట్టి, కెనడాలో నివశిస్తున్న భారతీయ సంతతికి చెందిన యువతి అన్నది గమనార్హం. శ్వేత ఆనంద్ భరతనాట్య కళాకారిణి మాత్రమే కాకుండా, కాస్ట్యూమ్ డిజైనర్, గాయనీ,మృదంగ కళాకారిణి, వయోలిస్ట్ కూడా. కాగా విఘ్నేశ్, శ్వేత ఆనంద్‌ల వివాహం జూన్ నెల 5న చైన్నె సముద్రతీరంలోని దక్షిణ చిత్ర సాంస్కృతిక కళా ప్రాంగణంలో జరగనుంది. ఈ విషయాన్ని వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ను ఆల్‌రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు. -
కలెక్టర్ కావాలనుకున్న పేద విద్యార్థినికి కమల్ సాయం
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తను చేసిన సాయాన్ని బయటిప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద చెప్పిన తర్వాత వైరల్ అవుతుంటుంది. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వందల మందికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించింది. ఈమె తండ్రి మత్స్యకారుడు. తల్లి పీతలు ఎగుమతి కంపెనీలో రోజువారీ కూలీ. కాగా తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధిని శోభన. ఈమెకు ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలన్నది ఆశ. అయితే కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసి ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమలహాసన్ విద్యార్ధిని శోభనను తన కార్యాలయానికి పిలిపించి కమల్ సాంస్కృతి కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సాయం చేశారు. తను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆపై సివిల్ సర్వీస్‌కు కావాల్సిన వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు ఆయన మాట ఇచ్చారు. దీంతో శోభన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కమల్ సార్ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని శోభన చెప్పింది. తాను సివిల్ సర్వీస్ సాధించి తప్పకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతానని మాటిచ్చింది. -
ఇక నాకు ఇది కొత్త జన్మ: మంచు మనోజ్
‘‘నాకు నా హార్డ్‌వర్క్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ బర్త్ డే (మే 20) నుంచి నాకు ఇది కొత్త జన్మ. నా బర్త్ డే స్టార్ట్ కాక ముందే నేను ఏదైతే స్టేజ్ (సినిమా వేదిక) మిస్సవుతున్నానో ఆ స్టేజ్‌కు తీసుకువచ్చాడు దేవుడు. అంతకంటే పెద్ద బర్త్ డే గిఫ్ట్ ఏదీ ఉండదు’’ అని మంచు మనోజ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. అలాగే నేడు (మంగళవారం) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్ పంచుకున్న విశేషాలు.⇒ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమ్ముడు శ్రీనివాస్ (బెల్లంకొండ సాయి) నన్ను కలవడం, ‘గరుడన్ ’ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’ గురించి దర్శకుడు విజయ్‌తో మాట్లాడమని చెప్పడం, కథ నచ్చి, నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయి. ∙ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్ చేశాను. ‘భైరవం’ని డైరెక్టర్ విజయ్ బాగా తీశాడు. యాక్టర్స్‌గా నాకు, శ్రీనివాస్, నారా రోహిత్‌గారికి కొంత స్క్రీన్ గ్యాప్ వచ్చింది. అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది.⇒ నా జీవితంలో నాకు మా నాన్నే హీరో (ప్రముఖ నటుడు–నిర్మాత మోహన్ బాబు). నాన్నగారు కష్టపడి, పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం. ఆయన్ను చూస్తూ పెరిగాను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నమ్మినవాళ్లను బాగా చూసుకోవడం, వాళ్లతోనే ఉండటం, పదిమందికి హెల్ప్ చేయడం, స్కూల్‌ని బిల్డ్ చేయడం... ఇలా నాన్నగారు చాలా చేశారు. ఇక దాన్నుంచి (ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి కావొచ్చు) నేను బయటకు రాలేకపోతున్నాను. విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఏ సిట్యువేషన్ లోనైనా మాట్లాడి, ఆ పరిస్థితులను ఎలా సెట్ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను.⇒ నేను తిరుపతిలో చదువుకున్నాను. తను (భార్య మౌనిక) ఆళ్లగడ్డలో చదువుకున్నారు. ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆదరణ మాపై ఉన్నాయి. మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే.⇒ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. కానీ నా ఇబ్బందుల్లో వారిని ఇన్ వాల్వ్ చేయాలనుకోలేదు. నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోయింది. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే, తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం. భవిష్యత్‌లో మా పిల్లలు ‘నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావ్’ అంటే, ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదనిపించింది. తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను. -
రబ్బరు గాజులు సాంగ్.. థియేటర్లోనే ఇరగదీసిన ఫ్యాన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యమదొంగ. 2007లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అప్పట్లో థియేటర్లలో ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ నెల 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను ఈరోజు థియేటర్లలో ప్రదర్శించారు.అయితే ఈ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత యమదొంగ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడంతో అభిమానులు ఆనందంలో చిందులు వేశారు. రబ్బరు గాజులు పాట రాగానే పూనకంతో ఊగిపోయారు. ఈ సినిమా చూస్తూ థియేటర్లో రబ్బర్ గాజులు సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’)కాగా.. ఈ చిత్రంలో మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో ప్రియమణి, మమత మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇద్దరి ఇరగదీశారు మాటల్లేవ్ 💟💟❤️🔥❤️🔥ఇదేం క్రేజీ రా బాబు మామూలుగా లేదుగా సెలబ్రేషన్ 😍😍🥵🥵👌👌#Yamadonga4K @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/ZN1j0zj5kF— Shivam🐉🔱🚩 (@tarak9999SM) May 19, 2025 -
యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025 -
ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!
హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందు వస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. #AditiShankar Live Dance Performance for #OVennela Song at #Bhairavam Event#BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohith pic.twitter.com/ehgv08ARi5— The Cult Cinema (@cultcinemafeed) May 18, 2025 View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
'ఛత్రపతి' రీమేక్ అందుకే ఫెయిలైంది: బెల్లంకొండ శ్రీనివాస్
తెలుగులో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. మధ్యలో హిందీలో సినిమా చేశాడు. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఇక్కడ 'భైరవం' చిత్రం చేశాడు. మే 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొన్న ఇతడు.. ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'హిందీలో సినిమాలు చేసిన తెలుగు హీరోలు పెద్దగా లేరు. ప్రస్తుతం రానా, రామ్ చరణ్ మాత్రమే చేశారు. చరణ్ చేసింది 'జంజీర్' రీమేక్. హిందీ మూవీని మళ్లీ హిందీలో చేయడం వల్ల ప్రేక్షకులు అలా తీసుకున్నారేమో తెలియదు. నేను చేస్తున్నది సౌత్ మూవీ కదా అనుకున్నాను. రాజమౌళి హిట్ సినిమా, ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని అనుకున్నాం''పైగా సవతి తల్లి, బిడ్డల సెంటిమెంట్ లాంటివి హిందీలో పెద్దగా ఉండవని నిర్మాత భరోసా ఇచ్చారు. దీంతో వర్కౌట్ అవుతుందేమోనని అనుకున్నాం. కానీ ఛత్రపతి మూవీని రీమేక్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే సౌత్ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు బాగా చూసేశారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందా? అనే టెన్షన్ వల్ల పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి) -
రకుల్ ప్రీత్ సొగసులు.. హెబ్బా ట్రెడీషనల్ వేర్
పక్కా ట్రెడిషనల్ గా తయారైన హెబ్బా పటేల్స్విమ్ సూట్ లో కనిపించిన నటి హంస నందినిఒంటికి అతుక్కుపోయిన డ్రస్సులో జాక్వెలిన్అందాలన్నీ చూపించేస్తున్న కేథరిన్ ట్రెసాపట్టుచీరలో మెరిసిపోతున్న పూజా హెగ్డేతెలుగమ్మాయి రమ్య అదిరిపోయే గ్లామర్గ్లామర్ గా కనిపించేందుకు కష్టపడుతున్న అన్షు View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shaneem (@shaneemz) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
నమ్రతా శిరోద్కర్ సిస్టర్‌కు కరోనా.. సోషల్ మీడియాలో పోస్ట్!
హిందీ బిగ్‌బాస్ షోలో ఫ్యాన్స్‌ను మెప్పించిన బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె వంద రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. ఈ షో ద్వారా శిల్పా మరింత ఫేమస్ అయ్యారు. అయితే శిల్పా శిరోద్కర్ తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు స్టే సేఫ్.. టేక్ కేర్ మేడమ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్‌పై ఆమె సిస్టర్, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ సైతం స్పందించింది. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
నాకు ఆ వ్యాధి.. అందుకే ఇలా కనిపిస్తున్నా: పూనమ్ కౌర్
అప్పట్లో తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన పూనమ్ కౌర్.. ప్రస్తుతం రాజకీయాలు అంటూ తిరుగుతోంది. ఇది కాకుండా ఎప్పుడో ఏదో ట్వీట్ వేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, అందువల్లే ఇలా మారిపోయానని చెప్పుకొచ్చింది.తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి పూనమ్ కౌర్.. ఆయనకు ఓ బహుమతిని అందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసి.. తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి కూడా బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'గత రెండు రోజులుగా ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నాను. దీని వల్ల ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా వచ్చింది. అందుకే శరీరం ఇలా ఉబ్బిపోయింది. యాంటీ బయోటిక్స్ కూడా వాడుతున్నా కదా. అందుకే ఇలా' అని పూనమ్ కౌర్ ట్విటర్ లో రాసుకొచ్చింది.పూనమ్ కౌర్ ఎప్పుడూ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పై సెటైర్స్ వేస్తూ ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనూ త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసింది. కానీ ఇదెక్కడ వరకు వచ్చిందో తెలీదు. ప్రస్తుతానికైతే పూనమ్.. నటిగా ఎలాంటి సినిమాలు చేయట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం) -
కట్టు బట్టలతో రోడ్డున పడేశారు: మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరును తలచుకుని ఎమోషనలయ్యారు.మంచు మనోజ్ మాట్లాడుతూ..' కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల దుస్తులు, చిన్నప్పటి నుంచి దాచుకున్న వాటితో సహా ఏది వదలకుండా రోడ్డున పడేశారు. మేము బయటికి కూడా వెళ్లడానికి కార్లు కూడా లేకుండా చేశారు. కానీ నాకు మాత్రం శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు అన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్నా నా కోసం. ప్రతి ఒక్కరూ మేమున్నాం అంటూ నాకోసం నిలబడ్డారు. కానీ నాకొక్కటే బాధ. ఇంత చేసినా.. ఇంత జరిగినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నాపై ఎన్ని కేసులు వేసినా.. నాకు ఎవరి మీద కోపం రావట్లేదు.. బాధగా మాత్రమే ఉంది. అది నా బలహీనతో.. వాళ్ల బలమో నాకు అర్థం కావట్లేదు.' అని అన్నారు.తన తండ్రి గురించి మాట్లాడుతూ..'ఎన్ని జన్మలైనా.. ఈ జన్మకు మాత్రం నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే.. అది మార్చడం ఎవరి వల్ల కాదు..నా చిన్నప్పటి నుంచి ఆయన నేర్పించిన క్రమశిక్షణే. నీతి వైపు నిలబడాలని నాకు నేర్పించారు. నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కలా అందరూ చేరి తప్పు అంటున్నారు. ఏదేమైనా.. ఎన్ని జన్మలెత్తినా.. మీరే నా దేవుడు.. నా తండ్రి.. నా తల్లి.. మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో మంచు మనోజ్‌కు తన ఫ్యామిలీతో గొడవలు తలెత్తిన సంగతి తెలిసిందే. -
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
‘భగవంత్ కేసరి’ని దళపతి విజయ్ వదిలిపెట్టలేదు. అంతలా ఈ చిత్రానికి ఆయన కనెక్ట్ అయ్యారు. బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భగవంత్ కేసరి’. గతేడాదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను జననాయగన్ పేరుతో తమిళ్లో విజయ్ దళపతి రీమేక్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే చివరి సినిమా అని కూడా తెలుస్తోంది. అయితే, ఈ రీమేక్ అంశం గురించి తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది.విజయ్ కొత్త సినిమా 'జన నాయగన్' కోసం ‘భగవంత్ కేసరి’లోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి సంబంధించి హక్కులను పొందారట. ఈ సినిమాలో 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' గురించి అందరికీ అవగాహన ఉండాలని బాలకృష్ణతో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇప్పుడు అదే సీన్‌ను జన నాయగన్లో విజయ్ రీక్రియేట్ చేశాడని సమాచారం. ఈ సీన్ మాత్రమే రీమేక్ అని, మిగతాది అంతా భగవంత్ కేసరితో జన నాయగన్ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని విజయ్ అభిమానులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది. అందుకే ఈ సినిమాపై విజయ్ ఆసక్తి చూపాడని తెలుస్తోంది. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' సీన్ కోసం జగ నాయగన్ టీమ్ హక్కులు కూడా పొందిందని సమాచారం. అందుకోసం సుమారు రూ. 4 కోట్లు చెల్లించినట్లు టాక్. ఈ సీన్ మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ భావించాడట. పొలిటికల్‌గా కూడా తనకు కొంతమేరకు ఉపయోగపడొచ్చని తెలుస్తోంది.#JanaNayagan : Just to use a single episode, the makers have acquired the remake rights of #BhagavanthKesari film. Overall, there is no other connection between Jana Nayagan and Bhagavanth Kesari#JanaNayagan pic.twitter.com/sthnxzv4Q1— 𓃰TVK✘BALA𓃰 (@TvkSouthWing) May 19, 2025 -
నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం
తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి కమలహాసిని.. ఆదివారం రాత్రి చెన్నైలో మరణించారు. ఈ క్రమంలో తోటి నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చెన్నైలోని భరత్ ఇంటికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు వచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) దర్శకుడు శ్రీనువైట్ల తీసిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్ సినిమాలతో పాటు బిందాస్, మిస్టర్ ఫెర్ఫెక్ట్ తదితర 80 తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. పెద్దవాడు అయిన తర్వాత అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మూవీతో నటుడిగా మారాడు. చివరగా గతేడాది రిలీజైన గోపీచంద్ విశ్వం సినిమాలో సహాయ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.నటుడిగా తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలు చేసిన మాస్టర్ భరత్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోవడంతో చాలా బాధపడుతున్నాడు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో మాస్టర్ భరత్ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగారు.(ఇదీ చదవండి: అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ) -
'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం
కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా పెట్టాలెక్కింది. సూర్యకు రెట్రో, వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్ చిత్రాలు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్‌ను తాజాగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’), దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ సినిమాల కోసం ఇతర భాషలకు చెందిన హీరోలను ఎంపిక చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు మళ్లీ తమిళ హీరో సూర్యతో మరో సినిమా ప్లాన్ చేయడం విశేషం. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
స్టార్ డైరెక్టర్ సినిమాలో శోభితకు ఛాన్స్
నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్ మోడల్‌గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్ రాఘవన్ 2.0 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా హాలీవుడ్లో మంకీ మాన్ చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా.రంజిత్ ఇటీవల విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రం చేశారు. తాజాగా వట్టువన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోల్డెన్ రేష్మియా ఫిలిమ్స్‌తో కలిసి నీలం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్ కథానాయకుడుగా, ఆర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఏపీలో నంది అవార్డులు ప్రకటిస్తాం: మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులను ప్రకటిస్తామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఏలూరులో జరిగిన భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మాదిరిగానే విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అక్కడ స్టూడియోల నిర్మాణంతో పాటు డబ్బింగ్, రీరికార్డింగ్ వంటి థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. కొద్దిరోజుల్లో సినిమా పరిశ్రమకు చెందిన పలు నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో ఏపీ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, నంది అవార్డుల గురించి చర్చిస్తామని తెలిపారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. వారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను చేర్చారు. కొద్దిరోజుల క్రితం పలు సినిమాల నుంచి నామినేషన్స్ కూడా తీసుకున్నారు. -
'రెట్రో' కలెక్షన్స్ విడుదల.. సూర్య కెరీర్లో ఇదే టాప్
రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్‌గా సూర్య ఇందులో నటించాడు.రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157 కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ భారీగానే దెబ్బ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్ బాగుండటంతో కోలీవుడ్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్ సులువుగా రూ. 300 కోట్లకు దగ్గర్లో ఉండేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.Dear Audience and #AnbaanaFans, we're humbled by your immense love and support for #TheOne ‼️ Grateful for the glory, it's all because of you ❤#RETRO@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/wScjYwaqu4— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 18, 2025 -
నవీన్ పోలిశెట్టికి లక్కీచాన్స్ వరించనుందా..?
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి జాక్‌పాట్ కొట్టబోతున్నారా? ఈ యువ నటుడికి డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించనుందా..? ఈ క్రేజీ చిత్రంలో ఆ స్టార్ కథానాయకి నటించి ఉన్నారా..? దీనికి సంబంధించిన వార్తనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా బుక్‌లో దర్శకుడు మణిరత్నం పేరు ఎప్పటికీ ప్రముఖంగానే ఉంటుంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో చిత్రాలు చేసి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నలకు పలు రకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్నాయి. తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి ఇంతకుముందు తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సక్సెస్ చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సాయిపల్లవి కథానాయకిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక పర్యటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. -
సరదాలే సరిగమలై...
‘‘వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన... ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరదాలే సరిగమలై పలికిన శుభవేళ’’ అంటూ సాగేపాట ‘షష్టిపూర్తి’(Shashtipoorthi) సినిమాలోనిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో రూపేష్, ఆకాంక్షా సింగ్ ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమాలోని ‘వేయి వేణువుల నాదం మోగే...’పాటను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈపాటను కార్తీక్, విభావరి ఆప్టే జోషి ఆలపించారు. స్వర్ణ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఈపాట గురించి పవన్ ప్రభ మాట్లాడుతూ– ‘‘ఈపాటను చైతన్య ప్రసాద్ అద్భుతంగా రాశారు.ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ఈపాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజాగారు స్వరపరిచిన ఈ సినిమాపాటల రికార్డింగ్‌ని ప్రత్యక్షంగా వీక్షించి, పులకించిపోయామను. ఈపాట కోసం తోట తరణిగారు ఓ మండువా లోగిలిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రాజేంద్రప్రసాద్, అర్చనగార్లు, రూపేష్–ఆకాంక్ష ఈ ΄పాటలో జీవించారు. చాలా కాలం గుర్తుండిపోయేపాట ఇది’’ అని తెలిపారు. -
మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తోన్న మైథలాజికల్ చిత్రం వసుదేవ సుతం. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్ చూస్తే ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.తాజాగా తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మా నాన్న గారి నుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయం గురించి అనసూయ రాసుకొచ్చింది. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో ఉన్నా జైహనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయగలను అని తండ్రి చెప్పేవారని తెలిపింది. నా తండ్రి తర్వాత తండ్రిగా భావించేది ఆ హనుమంతుడినే.. అందుకే నా పెద్ద కొడుకుకు శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం అని వివరించింది. ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అగ్ని దేవుడు (దూత) అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైన గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారానే చెప్పుకుంటాం.. ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్ మా ఇంటి పేరుని.. మా ఇంటికి ఆహ్వానించాడనికి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేసింది. అందరు ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందని అనసూయ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ముగ్గురు హీరోల 'భైరవం'.. ట్రైలర్ ఎలా ఉందంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. గతేడాది డిసెంబరు నుంచి రిలీజ్ మాట వినిపిస్తుంది. మరి కారణాలేంటో తెలీదు గానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా) ముగ్గురు హీరోల సీన్స్ తో పాటు అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసేలా ట్రైలర్ కట్ చేశారు. చూస్తుంటే సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
ఎర్రని బుగ్గలతో సుప్రీత.. రెడ్ శారీలో సంయుక్త
ఎర్రని బుగ్గలతో యంగ్ బ్యూటీ సుప్రీతచుడీదార్ లో పద్ధతిగా కనిపించిన కేతిక శర్మరెడ్ శారీలో హాట్ హాట్ గా సంయుక్త స్టిల్స్40ల్లోనూ అందంతో కేక పుట్టిస్తున్న శ్రియహైదరాబాద్ లో బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లాడ్యాన్స్ తో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్చీరలో కవ్విస్తున్న కీర్తి సురేశ్.. ఐశ్వర్య రాజేశ్ కూడా View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) -
ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. 'ఏ మాయ చేశావె'లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'ఎస్ఎమ్ఎస్' మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు. (ఇదీ చదవండి: నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?) మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి) -
దూసుకెళ్తున్న నవీన్ చంద్ర.. అప్పుడే మరో కొత్త సినిమా!
హీరో నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య లెవన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ హీరో..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘కరాలి’అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ మీద మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నారు. రాశీసింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ... ‘కొత్త వారు కొత్త పాయింట్‌తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ గారి లాంటి ధైర్యం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. ‘కరాలి’ అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా. కాజల్ చౌదరి నటించిన ‘అనగనగా’ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మా సినిమాకు మంచి టీం దొరికింది. ఇంత వరకు నన్ను ఆడియెన్స్, మీడియా ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. ఈ మూవీని ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేసేలా రూపొందిస్తున్నామ’ని అన్నారు.‘నేను చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మించేందుకు వచ్చిన శివ గారికి థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మేం చాలా నమ్మకంగా ఉన్నాం’ అని చిత్ర దర్శకుడు రాకేష్ పొట్టా అన్నారు.నాకు స్క్రిప్ట్ చాలా నాకు నచ్చింది. నవీన్ చంద్ర గారి సినిమాలు, ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఈ మూవీతో మంచి కథతో మీ అందరి ముందుకు రాబోతోన్నాం’అని హీరోయిన్ కాజల్ చౌదరి అన్నారు. -
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
గతేడాది బిగ్‌బాస్ సీజన్లో అభిమానులను అలరించిన టాలీవుడ్ నటి రోహిణి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. మొదటిసారి కంటే రెండోసారి బిగ్‌బాస్ ఛాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ షోతో రోహిణి దాదాపు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకుంది. రోహిణి టాలీవుడ్లో పలు సినిమాల్లో తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అయితే తాజాగా రోహిణి తన సొంతింటి కలను నేరవేర్చుకుంది. హైదరాబాద్‌లో శివారు ప్రాంతంలో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేస్తూ వెల్లడించింది. తాను కొనుగోలు చేసిన విల్లా అత్యాధునిక వసతులు ఉన్నాయని వెల్లడించింది. ఈ విల్లా ధర రూ.1.7 కోట్లు అని రోహిణి తెలిపింది. మై న్యూ ఛాప్టర్ స్టార్ట్స్ నౌ అంటూ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ రోహిణికి అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్‌గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు. ఇప్పటి వరకు రిలీజైన వాటిలో ఇది చాలా బెస్ట్ అని అన్నారు. ఈ సినిమాను మించిన కథ రాదేమో అని అనుకుంటున్నట్లు ఆర్జీవీ మాట్లాడారు.కానీ ఈ సినిమా చూశాక ఆయన చేసిన ఓ కామెంట్ తెగ వైరలవుతోంది. మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి- మహేశ్ కాంబోలో వస్తోన్న మూవీలో స్టంట్స్ ఇలాగే ఉంటున్నాయని అంటున్నారని ఆర్జీవీ ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలీదన్నారు. కాగా.. హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17న ఇండియాాలో రిలీజైంది. ఈ సినిమా చూసిన రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. #MissionImpossibleTheFinalReckoning#MissionImpossibleMANAM KUDA FILM MAKERS ANI CHEPPU KOVADANIKI SIGGU ESTADI - @RGVzoomin 💥💥💥💥💥I don't think anyone can say like what RGV has said . A BRUTAL HONEST OPINION pic.twitter.com/OkrXxyEvva— EXISTENTIAL NIHILIST 👻 (@Forced_Existenc) May 17, 2025 -
తెలుగులో విజయ్ సేతుపతి ‘ఏస్’
విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఏస్’. అరుముగ కుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై అరుముగ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ‘‘ఏస్’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడినా తెలుగు విడుదల హక్కులను మేము దక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు బి. శివ ప్రసాద్. -
నటుడు మిథున్ చక్రవర్తికి నోటీసులు
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్‌లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. -
ఆస్పత్రి పాలైన నటి సురేఖావాణి కూతురు.. పోస్ట్ వైరల్
సహాయ పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సురేఖావాణి. ఈమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా వల్ల మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సుప్రీత ప్రస్తుతం తెలుగులో రెండు మూడు చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే తను ఆస్పత్రి పాలైన విషయాన్ని ఇన్ స్టాలో వెల్లడించింది.(ఇదీ చదవండి: హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?) 'దిష్టి నిజమే. ఈ వారం జీవితంలో బలంగా ఎలా ఉండాలో ఆలోచించాను. నేను శివయ్యని నమ్ముతా. కానీ ఆయనకు నాపై కోపం వచ్చినట్లు ఉంది. అయినా శివయ్య, అమ్మ, ప్రసన్న, రమణ.. వీళ్లు లేకుండా నేను లేను. జీవితం ఎప్పుడూ నన్ను పరీక్షిస్తోంది. దిష్టి నా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. శారీరర, మానసిక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యమే' అని సుప్రీత రాసుకొచ్చింది. సుప్రీత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోల బట్టి చూస్తుంటే సెలైన్ ఎక్కించుకున్నట్లు కనపిస్తుంది. ఎప్పటికప్పుడు టూర్స్ కి వెళ్లే సుప్రీత.. ఇలా అనారోగ్యానికి గురవడంపై ఆమె ఫాలోవర్స్.. త్వరగా కోలుకోవాలని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. అటు సినిమాలతో పాటు అడపాదడపా పలు షోల్లో సుప్రీత కనిపిస్తోంది.(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
బాలయ్యా, నీ హీరోయిన్ మద్యం ప్రచారంపై ఏమందో విన్నావా?
ఆయన ఓ ప్రముఖ సినీనటుడు,అంతేకాదు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. అంతవరకు అయినా పర్లేదేమో కానీ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార గ్రహీత కూడా. అలాంటి నేపథ్యం వున్న బాలకృష్ణ(Nandamuri Balakrishna ) మాన్షన్ హౌస్ మద్యం ద్వారా పేరొందిన బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, అలాంటి గౌరవనీయమైన పురస్కారం పొందిన తర్వాత మద్యం ప్రకటనలో పాల్గొనడం అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. “పద్మ భూషణ్ పొందిన వ్యక్తి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం ఎలా అనుమతిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారుఇదిలా ఉండగా, బాలకృష్ణ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఇలాంటి ప్రకటనల్లో నటించడం బాధ్యత లేనితనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ మద్యం యాడ్ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చలకు గతం లో ని కొన్ని విషయాల ప్రస్తావనకు దారి తీసిందిబాలకృష్ణ ఆ మద్యం బ్రాండ్ పై తన అభిమానాన్ని పదే పదే చాటు కోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి, అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడo బాలకృష్ణ బరితెగింపు కి నిదర్శనం గా అనిపిస్తోంది. గతంలో ఈ తరహా మద్యం బ్రాండ్ల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొనడం పై ఉవ్వెత్తున విమర్శలు రావడం దాంతో అనేకమంది స్టార్స్ ఇక తాము అలాంటి ప్రకటనల్లో కనిపించం అని నిర్ణయం తీసుకోవడాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రచారం చేసినందుకే చిరంజీవి పై విమర్శలు రావడం దాంతో అయన వెనక్కి తగ్గడం కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒకనాటి బాలకృష్ణ హీరోయిన్, బంగారు బుల్లోడు సినిమా లో అయన సరసన నటించిన రవీనాటండన్(Raveena Tandon) తారల మద్యం ప్రచారం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. సెలబ్రిటీలుగా తమపై ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుందనీ, ఆల్కహాల్ ఉత్పత్తులకు తాము ప్రచారం చేయడం అంటే యువత ను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని ఆమె వ్యాఖ్యనించారు.. మరి బాలయ్య కి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా... లేక మంచి చెడూ జాంతానై.. మా బ్లడ్డు బ్రీడు సపరేట్ హై.. అంటూ ఇలాగే కంటిన్యూ అయిపోతారా.. దీనికి ఆన్సర్ కోసం జనం మాత్రమే కాదు ఆయన్ను వరించిన పద్మ భూషణ్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది. -
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. సోషల్‌మీడియాలో ట్రైలర్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్‌హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్‌రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేస్తున్నారు.ముద్దు సీనుతో వైరల్‘థగ్ లైఫ్’ ట్రైలర్లో కమల్ హాసన్(70), అభిరామి (41) మధ్య లిప్‌లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్‌కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వస్తుంది.అయితే, కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశాలు,సన్నిహిత సన్నివేశాలను తీసుకొని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్‌గానే ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు.., తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్ధిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.అభిరామి ఎవరు..?కేరళకు చెందిన అభిరామి తెలుగులో 'చెప్పవే చిరుగాలి'(2004) సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని, మహారాజ, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టైయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్‌కు తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది. -
హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?
తెలుగు సినిమా 'బేబి'.. రిలీజైన టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదేం సినిమా అని చాలామంది అన్నారు కానీ యూత్ మాత్రం ఈ మూవీని హిట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని దర్శకుడు సాయి రాజేశ్ ఫిక్స్ అయ్యాడు. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త)ప్రస్తుతానికైతే ఇంకా చర్చల దశలోనే ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు నటుడు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. లెక్క ప్రకారం హీరోల్లో ఒకరిగా ఇతడిని తీసుకోవాలని సాయి రాజేశ్ అనుకున్నాడు. కానీ రీసెంట్ గా బాబిల్.. బాలీవుడ్ ని పరోక్షంగా తిడుతూ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బాబిల్ ఖాన్.. ఆ దర్శకుడితో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అది సాధ్యపడటం లేదని రాసుకొచ్చాడు. సాయి రాజేశ్, టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని అన్నాడు.బాబిల్ పోస్ట్ పై స్పందించిన సాయి రాజేశ్.. 'నేను కలిసిన టాలెంటెడ్, కష్టపడే నటుల్లో బాబిల్ ఒకడు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నాను. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. మేం తప్పకుండా మ్యాజిక్ సృష్టిస్తాం' అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రీమేక్ నుంచి ఓ హీరో తప్పుకొన్నాడు. ఇప్పటికిప్పుడు మరో హీరోని వెతికి పట్టుకుని అతడికి ట్రైనింగ్ ఇప్పించి సినిమా చేయడానికి మరికొన్నాళ్లు పట్టొచ్చు. అంటే 'బేబి' హిందీ రీమేక్ కి బ్రేకులు పడ్డట్లే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Babil (@babil.i.k) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
శ్రీవారి సేవలో ఆది పినిశెట్టి- నిక్కీ
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి దర్శించుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం(మే 18) ఉదయం భార్య నిక్కీ గల్రానీతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. ‘పెళ్లి రోజు సందర్భంగా శ్రీవారి దర్శననానికి వచ్చాను. ఇది మా మూడోవ వివాహ వార్షికోత్సవం. ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. డిస్కో, మరగదమణి చిత్రాలలో నిక్కితో కలిసి నటిస్తున్నానని చెప్పారు. వీటిలో పాటు పలు వెబ్ సిరీస్ కూడా చేస్తూన్నట్లు ఆది తెలిపారు.హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ మలుపు చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించారు. ఈ ప్రయాణంలో స్నేహం కాస్తా ప్రేమగా మారడం.. ఆపై నిక్కీనే ఆదికి ప్రపోజ్ చేయడం జరిగిపోయింది. అలా ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటి అయ్యారు. -
‘పైసావాలా’ విజయం సాధించాలి: శ్రీలీల
రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పైసావాలా’(Paisawala Movie). కె. నవీన్ తేజస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై కె. నవీన్ తేజస్, నూనెల పైడిరాజు, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ, “‘పైసావాలా’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్రానికి నగేష్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘పైసావాలా’ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. -
ముగ్గురు హీరోలతో కష్టం అనుకున్నా! : దర్శకుడు విజయ్ కనకమేడల
‘‘చాలామంది ఫ్రీమేక్‌లు చేస్తున్నారు. కానీ... మేం అధికారికంగా రీమేక్ (తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’కు తెలుగు రీమేక్ ‘భైరవం’) చేశాం. అయినా ప్రేక్షకులు ఏ సినిమా బాగున్నా చూస్తారు. అది రీమేకా... ఫ్రీమేకా? అని పెద్దగా ఆలోచించరు. ‘భైరవం’(Bhairavam Movie) సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. నా ప్రతి సినిమాలో ఉండే ఓ సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంది’’ అని అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘తమిళ సినిమా ‘గరుడన్’ కథ కమర్షియల్గానూ నాకు నచ్చింది. తెలుగులోనూ ముగ్గురు హీరోలతో చేయొచ్చనిపించింది. కథ అనుకున్నప్పుడే సాయిగారిని హీరోగా ఫైనల్ చేశాం. రోహిత్, మనోజ్గార్లను ఆ తర్వాత కలిస్తే, వారూ ఓకే చెప్పారు. కథలో ఈ ముగ్గురు హీరోలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. మొదట్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమేమో అనిపించింది. కానీ... ఈ ముగ్గురు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి మిత్రులు. దాంతో నా పని సులువైంది. ఇక ‘భైరవం’ కథ విషయానికొస్తే... ముగ్గురు స్నేహితుల ఫ్యామిలీల మధ్య జరిగే కథ. ఒక గ్రామంలో గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి ‘భైరవం’ అని టైటిల్ పెట్టాం. కథలో ఒక హీరోకు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పాత్రను ఉద్దేశించి) చిన్నప్పట్నుంచి కాలభైరవుడు పూనతాడు. ఎందుకు? ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లూ అలరిస్తాయి. నా తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. నా దగ్గర చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్గార్లకు తగిన కథలు ఉన్నాయి’’ అని అన్నారు. -
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ప్రముఖ కన్నడ హీరో, దివంగత పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్ కుమార్ తన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. 2021లో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది. అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది.ధృతి గురించి శివరాజ్ కుమార్ ఇలా చెప్పారు. 'హాయ్ టోటో (ముద్దుపేరు), నీకు అభినందనలు! ఈ రోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది, మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా.. మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు. మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్లముందు ఉన్నాయి. నువ్వు నవ్వినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, అప్పు(పునీత్ రాజ్‌కుమార్) వచ్చినట్లు ఉంటుంది. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. అందుకే మా ప్రియమైన అప్పుకు మరోసారి అభినందనలు.' అని ఆయన అన్నారు. ధృతి తండ్రి పునీత్ రాజ్‌కుమార్ 2021లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా పట్టభద్రురాలైంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ డిజైన్ స్కూల్‌గా ఆ యూనివర్శిటికి గుర్తింపు ఉంది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ కాలేజీ 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్‌గా పేరు మార్చబడింది. ఈ సంస్ధ ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది. ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లలో శిక్షణ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్, డోనా కరణ్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు.Hi ಟೋಟೊ, Congratulations! ಈ ದಿನ ಬಹಳ ವಿಶೇಷವಾದ ದಿನ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ಹೆಮ್ಮೆಯ ದಿನ. You made me and dodappa very proud. Lots of good memories with ಅಪ್ಪು, ಅಶ್ವಿನಿ, you and ನುಕ್ಕಿ. ನೀನು ನಗುವಾಗ, ನಡೆಯುವಾಗ ಅಪ್ಪು ಬಂದಂತೆ, ನಿನ್ನಲಿಯೇ ಅಪ್ಪು. ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಅಪ್ಪುಗೆ. Congratulations once… pic.twitter.com/JZOw2mkZXW— DrShivaRajkumar (@NimmaShivanna) May 17, 2025 -
Vidyapati Review: వీడు మామూలోడు కాదు
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో కన్నడ చిత్రం విద్యాపతి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎవరికైనా ఆశ ఉండొచ్చు, అత్యాశ పనికి రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది తమ తక్షణ అవసరాల కోసం అత్యాశకు పోయి అనర్థాలు కొని తెచ్చుకుంటుంటారు. ఆ తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ కోవకు చెందిన కథే ‘విద్యాపతి’(Vidyapati ). ఇది ఓ కన్నడ సినిమా. ఇషాన్ ఖాన్, హసీమ్ ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్యాపతి’. నాగభూషణ, మలైకా వసుపాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దర్శకులు ఈ స్క్రీన్‌ప్లేని సరదా సరదాగా తీసుకువెళ్ళారు. అసలీ ‘విద్యాపతి’ సినిమా కథేంటంటే... విద్య అనే సినిమా హీరోయిన్ పెద్ద స్టార్. ఆ హీరోయిన్ని అల్లరి చిల్లరగా తిరిగే హీరో మోసం చేసి పెళ్ళి చేసుకుంటాడు. అంతేనా... పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయికి సంబంధించిన సినిమా వ్యవహారాలతోపాటు ఆస్తి పైన అప్పనంగా పెత్తనం చెలాయిస్తుంటాడు. అలా చెలాయిస్తూనే తన పేరును విద్యకు అనుసంధానంగా విద్యాపతిగా మార్చుకుని చెలామణి అవుతాడు. కానీ ఎప్పుడూ టైమ్ ఒకేలా ఉండదు కదా. విద్యకి విద్యాపతి చేసిన మోసం తెలిసి, తన ఇంటి నుండి గెంటేస్తుంది. అప్పటిదాకా ఫైవ్ స్టార్ భోగాలు అనుభవించిన విద్యాపతి తినడానికి, ఉండడానికి కూడా గతి లేక తన ఇంటికి వెళతాడు. విద్యాపతి తండ్రి బిరియానీ బండి నడుపుతుంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును అసహ్యించుకుంటాడు. తెలివొచ్చే టైమ్‌లో అన్నీ తెలిసొస్తాయన్నట్టు మన విద్యాపతి కళ్ళు నేల మీదకు వచ్చి విద్య దగ్గర తన లవ్‌ను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి... విద్యాపతి ప్రయత్నం ఫలించిందా లేక బెడిసికొట్టిందా అనేది మాత్రం సినిమాలోనే చూడాలి. ఓ మంచి లైన్‌తో దర్శకులు చక్కటి హ్యూమర్‌ను జోడించి, సినిమాను సరదాగా రూపొందించారు. గుడ్ మూవీ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
యూట్యూబ్‌లో కొత్త సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
ప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో విడుదలైంది. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్.మదర్ సెంటిమెంట్‌తో అమ్మ రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆయన కుమారుడు రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా.. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ఈ మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. అయితే, ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఉచితంగానే రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లేకుంటే యూట్యూబ్‌లో 'తల' సినిమాను చూడొచ్చు.కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే! -
ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి
తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం తాజాగా తమిళ్లో విడుదలైంది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఆపై వారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. సినిమా కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయం తెలుకున్న సూరి తన అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు. సినిమా చూసి కాస్త ప్రేమ చూపుతే చాలన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, సినిమా విడుదల సమయంలో ఇలా వృధాగా ఖర్చు చేయడం చాలా వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతాయనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. ( వీడియో సన్ న్యూస్ సౌజన్యంతో) -
తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్న నయనతార
సౌత్ ఇండియా స్టార్ నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్‌ఖాన్‌కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మోరు2) ఒకటి. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్2 చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పాత్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్‌లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలెట్‌గా ఉంటాయని సమాచారం. -
నో అప్డేట్!
హీరోల పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల జోష్ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో నటిస్తున్న సినిమాల నుంచి కొత్తపోస్టర్, టైటిల్, టీజర్... ఇలా ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ హీరో నటిస్తున్న తెలుగు సినిమా అప్డేట్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్).ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ నీల్’ నుంచి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. ఆ రోజు ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు.హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్డేట్ రానుండటంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్నిపోస్ట్΄ోన్ చేసినట్లు ప్రకటించారు. ఇక ‘వార్’ ఈ ఏడాది ఆగస్టు 14న, ‘ఎన్టీఆర్ నీల్’ 2026 జూన్ 25న రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్, ప్రియమణి జంటగా, మోహన్‌బాబు, మమతా మోహన్‌దాస్ కీలకపాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. -
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
చిరంజీవి హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేసినట్లు ప్రకటించి, స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయనతార... తన టీమ్‌తో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్పాటలు వినడం, ‘హలో మాస్టర్... కెమేరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చెప్పడం ఆకట్టుకున్నాయి.ఫైనల్‌గా అనిల్ రావిపూడి, నయనతార కలిసి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది. ‘‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల తర్వాత చిరంజీవి–నయనతార కలిసి మూడోసారి నటించనున్న చిత్రమిది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమేరా: సమీర్ రెడ్డి. -
సాహసం శ్వాసగా సాగిపో...
లక్ష్య సాధన కోసం అడవికి వెళ్తున్నారు హీరోలు. ఒకరిది నిధి అన్వేషణ అయితే, మరొకరిదిపోరాటం. ఇంకొకరిది ఆధిపత్యం... ఇలా తెలుగు హీరోలు తమ తమ లక్ష్య సాధన కోసం అడవి బాట పట్టారు. సాహసమే శ్వాసగా ముందుకు సాగుతున్నారు. ఇలా అడవి మాదే... శత్రువుల వేట మాదే అంటున్న కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేద్దాం.ఫారెస్ట్‌లో అడ్వెంచర్ ఫారెస్ట్‌లో మహేశ్‌బాబు ఏదో నిధి కోసం అన్వేషించనున్నారట. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రకథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సో... ఈ సినిమాలోని మేజర్ కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.అలాగే ఇటీవల ఈ సినిమాకు చెందిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో పూర్తయింది. ఓ భారీ సెట్లో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా షూటింగ్‌కు ముందు రాజమౌళి కెన్యా వెళ్లి, అక్కడ కొన్ని లొకేషన్స్‌ను చూసి వచ్చారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ విదేశీ అడవుల్లోనూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు, రాజమౌళి వేసవి బ్రేక్‌లో ఉన్నారు. ఈ బ్రేక్ పూర్తవగానే మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. జూన్ రెండో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావొచ్చు.నెక్ట్స్ షెడ్యూల్ కోసం వారణాసిని తలపించేలా హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారని, ఈ సెట్లోనే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్, దేవ కట్టా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇంగ్లిష్ డైలాగ్స్ కోసం ఓ హాలీవుడ్ రైటర్‌ను నియమించుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుందని సమాచారం.వీరమల్లు అన్వేషణ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చారిత్రాత్మక చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేయగా, పంచమి అనేపాత్రలో హీరోయిన్గా నిధీ అగర్వాల్ నటించారు. కాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంతో ఉంటాయని తెలిసింది. ఓ నిధి అన్వేషణ కోసం వీరమల్లు తన బృందంతో కలిసి అడవికి వెళ్తాడని, ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఏమ్ రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అడవిలో డ్రాగన్ ఫారెస్ట్‌లో అదిరిపోయే చేజింగ్ ఫైట్ చేస్తున్నారు హీరో ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇటీవల కర్ణాటక లొకేషన్స్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణలో ఓ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీన్ తీశారని తెలిసింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఈ ఫారెస్ట్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుందని, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ యాక్షన్ సీక్వెన్ని డిజైన్ చేశారని తెలిసింది. కాగా లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్‌కి హాజరయ్యారు ఎన్టీఆర్, అలాగే ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. సో... ఈ రెండు కారణాల వల్ల ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తిరిగి ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లోపాల్గొంటారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, రష్మికా మందన్నా ఓ కీలకపాత్ర చేయనున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలో కొన్ని ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలు ఉన్నట్లుగా చూశాం. ఇటీవల ‘దేవర 2’ సినిమాను ఓ సందర్భంగా కన్ఫార్మ్ చేశారు ఎన్టీఆర్. ఇలా వచ్చే ఏడాది ‘దేవర 2’ సినిమా కూడా సెట్స్‌పైకి వెళుతుందని ఊహింవచ్చు. సో... ‘దేవర 2’లోనూ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని ఊహించవచ్చు.అడవిలో జాతర రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘మాస్ జాతర’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌పాత్రలో రవితేజ కనిపిస్తారు. కాగా ఈ సినిమాలో కూడా అడవి నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అరకు,పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్స్ని కూడా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్ జాతర’ సినిమా జూలై చివర్లో లేదా ఆగస్టులో రిలీజ్ కావొచ్చు.భక్త కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమాలో తిన్నడుపాత్రలో కనిపిస్తారు విష్ణు మంచు. దైవత్వాన్ని నమ్మని తిన్నడు శివుడికి ఎలా వీరభక్తుడు అయ్యాడు? భక్త కన్నప్పగా ఎలా ప్రఖ్యాతి చెందాడు? అనే అంశాల ఆధారంగా ‘కన్నప్ప’ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కథ రీత్యా ఈ సినిమా మేజర్‌పార్ట్ అంతా అడవి నేపథ్యంతోనే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్పోస్టర్స్.. వంటి ప్రమోషనల్ కంటెంట్... ‘కన్నప్ప’ సినిమా ఫారెస్ట్ నేపథ్యంతోనే సాగుతుందన్న విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి. ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిధి వేట నిధి వేటలో ఉన్నారట అర్జున్. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వృషకర్మ’తోపాటు మరో రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో నిధిని అన్వేషించే అర్జున్‌పాత్రలో నాగచైతన్య, పురావస్తు శాస్త్రవేత్తగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ఇలా నిధి అన్వేషణలో భాగంగా అర్జున్ ఫారెస్ట్‌కి వెళతాడట. అక్కడ ఫారెస్ట్‌లో కొన్ని సాహసాలు చేస్తాడట. ఈ సినిమా కోసం ఓ గుహ సెట్‌ను రెడీ చేశారు మేకర్స్. ఈ గుహ సెట్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, ఈ సీక్వెన్స్ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుందని తెలిసింది. బాపినీడు సమర్పణలో సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అరణ్యంలో భోగి హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భోగి’. 1960 నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రత్యేకమైన విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత భాగం అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ఈ మూవీ కోసం శర్వానంద్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ కావొచ్చు.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కిష్కింధపురిలో ఏం జరిగింది? ‘కిష్కింధపురికి’ ప్రేక్షకులను తీసుకు వెళ్లనున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టరీ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’. ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ రాత్రివేళ అడవిలోకి వెళ్లడం, అక్కడ వీరిద్దరూ ఎందుకోసమో వెతుకాలడంట వంటి విజువల్స్ కనిపించాయి. చూస్తుంటే... ‘కిష్కింధపురి’ మేజర్ సీన్స్‌లు అడవి నేపథ్యంలో ఉంటాయని, అది కూడా రాత్రివేళ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ తెలుస్తోంది.అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాలోనూ ఫారెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలిసింది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.కింగ్డమ్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో జరుగుతుందని, ఫ్లాష్ బ్యాక్ టైమ్‌లైన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అడవి నేపథ్యంతోనే ఉంటాయని ఫిల్మ్ నగర్ సమాచారం. పైగా ‘కింగ్డమ్’ సినిమా టీజర్లోనూ అడవిని తలపించే కొన్ని షాట్స్ కనిపించాయి. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇలా అడవి నేపథ్యం, అడవి సన్నివేశాలు కీలకంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
'అమరావతికి ఆహ్వానం' మధ్య ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి
తెలుగులో తీస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జివికె దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మధ్య ప్రదేశ్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. మధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ లాంటి పలు అందమైన లొకేషన్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. అమరావతికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది అని చెప్పుకొచ్చారు. -
మృణాల్ చాలా పద్ధతిగా.. మీనాక్షి నెవ్వర్ బిఫోర్ లుక్
పద్ధతిగా క్యూట్ లుక్స్ లో మృణాల్ ఠాకుర్నాభి అందాలతో షాకిచ్చిన మీనాక్షి చౌదరిఫ్రెండ్స్ తో ట్రిప్ లో కల్యాణి ప్రియదర్శన్చీరలో మరింత అందంగా సమంతజీన్స్ లో మెరిసిపోతున్న యాంకర్ అనసూయజిమ్.. ఫుడ్ క్రేవింగ్స్ వీడియోతో తృప్తి దిమ్రి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Face Magazine (@facemag.in) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
ఎన్టీఆర్ బర్త్‌డే స్పెసల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమత మోహన్‌దాస్ కాంబినేషన్లో వచ్చిన ఐకానిక్ సోషియో ఫాంటసీ చిత్రం ‘యమదొంగ’(Yamadonga) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ చిత్రాన్ని మే 18 నుంచి రీ రిలీజ్ చేయనున్నారు.రీ రిలీజ్ కోసం టీం అమితంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ‘యమదొంగ’ను 8Kలో స్కాన్ చేసి, 4K నాణ్యతకు కుదించి, అసాధారణమైన దృశ్య అనుభవాన్ని అందించేలా సిద్ధం చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను మరింత ఉన్నత నాణ్యతలో ఆస్వాదించవచ్చు.సోషల్ మీడియాలో ‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి జోరుగా సాగుతోంది. ప్రధాన నటీమణులు ప్రియమణి, మమత మోహన్‌దాస్ షూటింగ్ రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ విడుదల చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి దర్శకత్వ విజన్, ఎంఎం కీరవాణి సంగీతంతో ‘యమదొంగ’ మరోసారి తెరపై సందడి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.