
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'బద్మాషులు'. జూన్ 6న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘జిందగీ బిలాలే’ సాంగ్‌ను విడుదల చేశారు. శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హిలేరియస్ ఎంటర్టైనర్, తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి. బాలకృష్ణ, C.రామ శంకర్ నిర్మాతలుగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి జిందగీ బిలాలే సాంగ్‌ను హీరో ప్రియదర్శి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. 'బద్మాషులు సినిమా ప్రోమోషల్ సాంగ్ జిందగీ బిలాలే సాంగ్ విడుదల చేయడం జరిగింది, సాంగ్ చాలా ఎంటర్టైన్‌గా ఉంది, తేజ కూనూరు సంగీతం అందించారు, చరణ్ అర్జున్ , విహ పాడిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను, టీజర్ హిలెరియ్‌గా ఉంది, ఫన్ టేక్ ఓవర్ చేసినట్లు ఉంది, జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ఆయన అన్నారు. ఇది మన ఊరి కథ అనే విధంగా ఈ చిత్రంలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయని మేకర్స్ అన్నారు. డైరెక్టర్ శంకర్ చేగూరి వంద శాతం జనాలను రెండు గంటలు నవ్వించాలనే ఉద్దేశ్యంతో బద్మాషులు చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు.

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా, రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యబోతోంది.