
సహాయ పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సురేఖావాణి. ఈమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా వల్ల మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సుప్రీత ప్రస్తుతం తెలుగులో రెండు మూడు చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే తను ఆస్పత్రి పాలైన విషయాన్ని ఇన్ స్టాలో వెల్లడించింది.
(ఇదీ చదవండి: హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?)
'దిష్టి నిజమే. ఈ వారం జీవితంలో బలంగా ఎలా ఉండాలో ఆలోచించాను. నేను శివయ్యని నమ్ముతా. కానీ ఆయనకు నాపై కోపం వచ్చినట్లు ఉంది. అయినా శివయ్య, అమ్మ, ప్రసన్న, రమణ.. వీళ్లు లేకుండా నేను లేను. జీవితం ఎప్పుడూ నన్ను పరీక్షిస్తోంది. దిష్టి నా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. శారీరర, మానసిక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యమే' అని సుప్రీత రాసుకొచ్చింది.
సుప్రీత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోల బట్టి చూస్తుంటే సెలైన్ ఎక్కించుకున్నట్లు కనపిస్తుంది. ఎప్పటికప్పుడు టూర్స్ కి వెళ్లే సుప్రీత.. ఇలా అనారోగ్యానికి గురవడంపై ఆమె ఫాలోవర్స్.. త్వరగా కోలుకోవాలని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. అటు సినిమాలతో పాటు అడపాదడపా పలు షోల్లో సుప్రీత కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త)