
తెలుగు సినిమా 'బేబి'.. రిలీజైన టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదేం సినిమా అని చాలామంది అన్నారు కానీ యూత్ మాత్రం ఈ మూవీని హిట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని దర్శకుడు సాయి రాజేశ్ ఫిక్స్ అయ్యాడు. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.
(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త)
ప్రస్తుతానికైతే ఇంకా చర్చల దశలోనే ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు నటుడు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. లెక్క ప్రకారం హీరోల్లో ఒకరిగా ఇతడిని తీసుకోవాలని సాయి రాజేశ్ అనుకున్నాడు. కానీ రీసెంట్ గా బాబిల్.. బాలీవుడ్ ని పరోక్షంగా తిడుతూ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బాబిల్ ఖాన్.. ఆ దర్శకుడితో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అది సాధ్యపడటం లేదని రాసుకొచ్చాడు. సాయి రాజేశ్, టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని అన్నాడు.
బాబిల్ పోస్ట్ పై స్పందించిన సాయి రాజేశ్.. 'నేను కలిసిన టాలెంటెడ్, కష్టపడే నటుల్లో బాబిల్ ఒకడు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నాను. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. మేం తప్పకుండా మ్యాజిక్ సృష్టిస్తాం' అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రీమేక్ నుంచి ఓ హీరో తప్పుకొన్నాడు. ఇప్పటికిప్పుడు మరో హీరోని వెతికి పట్టుకుని అతడికి ట్రైనింగ్ ఇప్పించి సినిమా చేయడానికి మరికొన్నాళ్లు పట్టొచ్చు. అంటే 'బేబి' హిందీ రీమేక్ కి బ్రేకులు పడ్డట్లే.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)