
గతేడాదిలో 'ప్రేమలు' సినిమాతో తెలుగు యూత్‌కు బాగా దగ్గరయ్యాడు యువ నటుడు నస్లేన్ కె. గఫూర్. మలయాళ పరిశ్రమకు చెందిన ఆయన రీసెంట్‌గా మరో చిత్రం 'జింఖానా'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
జింఖానా సినిమా సోనిలివ్ (SonyLIV)లో జూన్ 5నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా నటించారు. మొదట మలయాళంలో ‘అలప్పుజ జింఖానా’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా తర్వాత రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో విడుదల చేశారు.

కథ
ఊరిలో ఆకతాయి కుర్రాళ్లుగా ఉన్న జోజో జాన్సన్ (నస్లేన్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), డీజే జాన్ (బేబీ జీన్), దీపక్ పణిక్కర్ (గణపతి), షణవాస్ (శివ హరిచరణ్) వీరందరూ మంచి స్నేహితులు. అయితే, వారిలో షణవాస్ మినహా మిగతా వాళ్లంతా 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోతారు. కానీ, స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు వారు బాక్సింగ్ ఆటలో ఎంట్రీ ఇస్తారు. అందుకోసం స్థానికంగా ఉన్న 'అలప్పుజా జింఖానా' అకాడమీలో శిక్షణ తీసుకుంటారు. అలా బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెడుతారు. ప్రొఫెషనల్ ఆటగాళ్లతో ఈ ఆకతాయి గ్యాంగ్ ఎలా ఎదుక్కొంటుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? అనేది సినిమాలో చూడాల్సిందే.