
ఆయన ఓ ప్రముఖ సినీనటుడు,అంతేకాదు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. అంతవరకు అయినా పర్లేదేమో కానీ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార గ్రహీత కూడా. అలాంటి నేపథ్యం వున్న బాలకృష్ణ(Nandamuri Balakrishna ) మాన్షన్ హౌస్ మద్యం ద్వారా పేరొందిన బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, అలాంటి గౌరవనీయమైన పురస్కారం పొందిన తర్వాత మద్యం ప్రకటనలో పాల్గొనడం అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. “పద్మ భూషణ్ పొందిన వ్యక్తి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం ఎలా అనుమతిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు
ఇదిలా ఉండగా, బాలకృష్ణ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఇలాంటి ప్రకటనల్లో నటించడం బాధ్యత లేనితనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ మద్యం యాడ్ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చలకు గతం లో ని కొన్ని విషయాల ప్రస్తావనకు దారి తీసింది
బాలకృష్ణ ఆ మద్యం బ్రాండ్ పై తన అభిమానాన్ని పదే పదే చాటు కోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి, అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడo బాలకృష్ణ బరితెగింపు కి నిదర్శనం గా అనిపిస్తోంది. గతంలో ఈ తరహా మద్యం బ్రాండ్ల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొనడం పై ఉవ్వెత్తున విమర్శలు రావడం దాంతో అనేకమంది స్టార్స్ ఇక తాము అలాంటి ప్రకటనల్లో కనిపించం అని నిర్ణయం తీసుకోవడాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రచారం చేసినందుకే చిరంజీవి పై విమర్శలు రావడం దాంతో అయన వెనక్కి తగ్గడం కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒకనాటి బాలకృష్ణ హీరోయిన్, బంగారు బుల్లోడు సినిమా లో అయన సరసన నటించిన రవీనాటండన్(Raveena Tandon) తారల మద్యం ప్రచారం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. సెలబ్రిటీలుగా తమపై ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుందనీ, ఆల్కహాల్ ఉత్పత్తులకు తాము ప్రచారం చేయడం అంటే యువత ను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని ఆమె వ్యాఖ్యనించారు.. మరి బాలయ్య కి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా... లేక మంచి చెడూ జాంతానై.. మా బ్లడ్డు బ్రీడు సపరేట్ హై.. అంటూ ఇలాగే కంటిన్యూ అయిపోతారా.. దీనికి ఆన్సర్ కోసం జనం మాత్రమే కాదు ఆయన్ను వరించిన పద్మ భూషణ్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది.