
ఈ మధ్య ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేసేస్తున్నాయి. ఎప్పుడో రిలీజైన చిత్రాలు ఉన్నట్లుండి ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ థ్రిల్లర్ సినిమా భవానీ వార్డ్ 1997 సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ప్రస్తుతానికి ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. రూ.99 అదనంగా చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఆద్యంతం ఆడియన్స్‌ను భయపెట్టేలా ఈ సినిమా ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పొచ్చు.