అట్లీ- బన్ని సినిమా అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కి పునకాలు గ్యారెంటీ! | Atlee, Allu Arjun Movie Latest Update | Sakshi
Sakshi News home page

అట్లీ- బన్ని సినిమా అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కి పునకాలు గ్యారెంటీ!

May 22 2025 11:07 AM | Updated on May 22 2025 11:23 AM

Atlee, Allu Arjun Movie Latest Update

హీరో అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు అట్లీ (Atlee)ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. తమ కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రానున్న సినిమా పనులను స్పీడప్‌ చేశారు. తాజాగా ఈ చిత్రం ప్రీ డక్షన్‌ పనుల నిమిత్తమై అల్లు అర్జున్‌ను కలిసేందుకు హైదారాబాద్‌ వచ్చారు అట్లీ. 

వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను ముగించేసి, జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలన్నది వీరి ప్లాన్‌ అని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారట.  ఈ మూడు పాత్రల్లో ఒకటి యానిమేటెడ్‌ రోల్‌ అనే టాక్‌ వినిపిస్తోంది.  ఫ్యాన్స్‌కి పునకాలు తెప్పించే సన్నివేశాలో ఇందులో చాలా ఉండబోతున్నాయట. 

ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చారిత్రాత్మక చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ వేరే లెవల్‌లో ఉంటాయట.   గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని చిత్రబృందం ముందు నుంచి చెబుతుంది. రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.   సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించబోతున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement