అనసూయ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అరి’ వచ్చేస్తోంది | Ari Movie Release Date Out | Sakshi
Sakshi News home page

అనసూయ ‘అరి’ వచ్చేస్తోంది

May 24 2025 2:51 PM | Updated on May 24 2025 5:13 PM

Ari Movie Release Date Out

పేపర్‌ బాయ్‌’ఫేం జయశంకర్‌ తాజాగా తెరకెక్కించిన మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అరి’ ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల పలు మార్లు విడుదల వాయిదా పడుతూ..ఇప్పుడు మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఈ మేరకు మేకర్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.  ఈ చిత్రంలో వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు.  

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన థీమ్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఇంత వరకు ఎవరు టచ్‌ చేయని  అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు జయశంకర్‌. కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని, కచ్చితంగా  అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement