
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.
అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది.