
‘బలగం’ సినిమా నటుడు జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ కమెడీయన్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి చిన్న తాత అంజన్న పాత్రలో ఆయన నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొంతకాలం క్రితం ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో పాటు గొంతు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆయన మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ కోసం ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సమయంలో దర్శకుడు వేణు, ప్రియదర్శి కొంత సాయం చేశారు.
అప్పటికీ ఆయన ఆసుపత్రి ఖర్చులు అంతకు మించి ఎక్కువ కావడంతో ఆర్థిక సాయం కోసం చాలామందిని ప్రాదేయపడ్డారు. జీవీ బాబు మృతి పట్ల దర్శకుడు వేణు సంతాపం తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ' జి వి బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు.. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను .' అని తెలిపారు.