
తెలుగులో తీస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జివికె దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మధ్య ప్రదేశ్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది.
మధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ లాంటి పలు అందమైన లొకేషన్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. అమరావతికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది అని చెప్పుకొచ్చారు.