
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్‌లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.
గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు.