
మోహన్‌లాల్(Mohanlal ) పుట్టినరోజు (మే 21) సందర్భంగా ‘కన్నప్ప’(Kannappa) చిత్ర బృందం ఒక అద్భుతమైన స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో మోహన్‌లాల్ కిరాత అనే దైవిక శక్తితో ముడిపడిన పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇక కన్నప్ప విషయానికొస్తే.. విష్ణు మంచు హీరోగా నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషించారు.ఆవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.