
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి దర్శించుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం(మే 18) ఉదయం భార్య నిక్కీ గల్రానీతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. ‘పెళ్లి రోజు సందర్భంగా శ్రీవారి దర్శననానికి వచ్చాను. ఇది మా మూడోవ వివాహ వార్షికోత్సవం. ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. డిస్కో, మరగదమణి చిత్రాలలో నిక్కితో కలిసి నటిస్తున్నానని చెప్పారు. వీటిలో పాటు పలు వెబ్ సిరీస్ కూడా చేస్తూన్నట్లు ఆది తెలిపారు.
హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ మలుపు చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించారు. ఈ ప్రయాణంలో స్నేహం కాస్తా ప్రేమగా మారడం.. ఆపై నిక్కీనే ఆదికి ప్రపోజ్ చేయడం జరిగిపోయింది. అలా ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటి అయ్యారు.