
ప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్‌లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో విడుదలైంది. అంకిత నస్కర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్.
మదర్ సెంటిమెంట్‌తో అమ్మ రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆయన కుమారుడు రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా.. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ఈ మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. అయితే, ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఉచితంగానే రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లేకుంటే యూట్యూబ్‌లో 'తల' సినిమాను చూడొచ్చు.

కథ
హీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే!