Thala Movie
-
యూట్యూబ్‌లో కొత్త సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
ప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో విడుదలైంది. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్.మదర్ సెంటిమెంట్‌తో అమ్మ రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆయన కుమారుడు రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా.. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ఈ మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. అయితే, ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఉచితంగానే రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లేకుంటే యూట్యూబ్‌లో 'తల' సినిమాను చూడొచ్చు.కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే! -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
ఓటీటీల్లో కొన్ని సినిమాలు చాలా హడావుడితో రిలీజ్ చేస్తారు. మరికొన్నింటిని మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్ గా స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేస్తారు. అలా ఇప్పుడు రెండు తెలుగు సినిమాల్ని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ అవేంటి? ఎందులో చూడొచ్చు?కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన మూవీ 'తల'. తన కొడుకునే హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేశారు. అసలు విడుదలైనట్లు కూడా తెలియనంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)గతేడాది నవంబర్ 8న రిలీజైన 'జాతర' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఒక ఊరిలో ఉండే గంగమ్మ తల్లి దేవత బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు.అయితే ఈ రెండు తెలుగు సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ చేసుంటే అయిపోయేది. కానీ రెంట్ విధానంలో ఎందుకు తీసుకొచ్చారనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. త్వరలో ఉచితంగా స్ట్రీమింగ్ అందుబాటులోకి తెస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
'తల' సినిమా రివ్యూ
టైటిల్: తలనటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్దర్శకుడు: అమ్మ రాజశేఖర్బ్యానర్: దీపా ఆర్ట్స్నిర్మాత : శ్రీనివాస గౌడ్డీఓపీ: శ్యామ్ కె నాయుడుమ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణడ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్ఎడిటర్ : శివ సామిప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తల సినిమా (Thala Movie Review) ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే!ఎవరెలా నటించారంటే?అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా చూపించాడు. అయితే తన వయసుకు మించిన యాక్షన్ సీన్స్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ అంకిత బాగా నటించింది. చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్.. హీరో తండ్రి పాత్రకు ప్రాణం పోశారు. ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే ఎస్తర్ నోరోన్హా ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్‌తో ఎమోషన్ పండించింది. మిగతావారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.సాంకేతిక విశ్లేషణఈ చిత్రానికి కథ ప్రాణమని చెప్పుకోవాలి. ట్రైలర్లో చెప్పినట్లుగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న ఈ జనరేషన్లో అమ్మకోసం కష్టపడే కొడుకు కథగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే అక్కడక్కడా కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. హింస ఎక్కువగా ఉంది.చదవండి: క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్ -
ప్రీరిలీజ్ ఈవెంట్లో కుప్పకూలిన డైరెక్టర్..ఏమైంది?
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘తల’. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈవెంట్‌కి వచ్చిన అమ్మ రాజశేఖర్ సడెన్‌గా కిందపడిపోవడంతో కాసేపటి వరకు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సడెన్ గా కింద పడిపోవడంతో డెరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఏమయ్యిందని స్టేజిపై ఉన్నవారిలో ఆందోళన మొదలయ్యింది. కాసేపటికి ఆయన తిరిగి స్పృహలోకి వచ్చి, కాసేపు క్రింద అలాగే కూర్చుండిపోయారు. మంచి నీళ్లు తాగి కొద్ది సేపు రెస్ట్ తీసుకుని రిలీఫ్ అయ్యారు. హైబీపీ కారణంగానే అమ్మ రాజశేఖర్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. కాసేపటికే కోలుకొని స్టేజ్ మీదకు రావడంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.అనంతరం తల సినిమా గురించి మాట్లాడుతూ.. మూడు నాలుగు నెలలుగా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్ లో చాలా స్ట్రగుల్ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించిన అందరికీ ఈ మూవీతో సమాధానం చెబుతాను. నాలాగే నా కొడుకు రాగిన్ రాజ్ ను కూడా ఆశీర్వదించాలి. హిట్ తరవాత అందరి గురించి మాట్లాడతాను. శ్రీనివాస్ గౌడ్ గారి చేసిన సపోర్ట్ లైఫ్ లాంగ్ మర్చిపోను. మీ లాంటి మంచి వారి కోసమైనా ఈ సినిమా హిట్ కావాలి. 14న విడుదలవుతోన్న తల చిత్రాన్ని మీరంతా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.." అన్నారు.హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. "తల కథ మా నాన్న(అమ్మ రాజశేఖర్) నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. 14న ఈ చిత్రాన్ని అందరూ చూడండి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు చాలా నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బలు తగిలాయి.ఈ కథ చూస్తే నా వయసు 18యేళ్లు. ఆ వయసు అబ్బాయి అమ్మ సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్. దీంతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూస్తే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు.." అన్నాడు. -
అమ్మ రాజశేఖర్ ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘తల’ కోసం రెండేళ్లు ఆలోచించా: అమ్మ రాజశేఖర్
అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాను. దీంతో అంతా అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) పని అయిపోయిందని అన్నారు. కానీ నేను మళ్లీ వచ్చాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటాను. ప్రస్తుతం ‘తల’ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. త్వరలోనే చెయ్యితో, కాలితో అన్నింటితోనూ వస్తా(నవ్వుతూ). మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అన్నాడు ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘తల’(thala Movie). ఈ చిత్రంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. అంకిత నాన్సర్ హీరోన్. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సందర్భంలో స్టేజ్‌పై మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు’ అన్నారు.నటుడు సోహైల్ మాట్లాదుతూ.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్‌బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి" అన్నారు.హీరో అశ్విన్ మాట్లాడుతూ. "తల ట్రైలర్ చూశాను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాల బాగుంది. అస్లాం సౌండ్ వినిపిస్తోంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్‌గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని ఆదరించండి" అన్నాడు.నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉందని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదే అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు సినిమాల తర్వాత అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను. ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుంది. అందరూ చూడండి' అన్నాడు.హీరో అమ్మ రాగిణ్ రాజ్ మాట్లాడుతూ... మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాను. క్లైమేట్ చేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సహాయం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న తప్పక చూడండి వైలెంట్ వాలెంటైన్స్ థాంక్యూ" అన్నారు.